• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  బాస్ లేడీ బ‌రిలో దిగితే...

బాస్ లేడీ బ‌రిలో దిగితే బంతాటే

| తాజా లుక్ ట్రెండీగా యువ‌త‌రం గుండెల్లోకి దూసుకెళ్లింది. రెడ్ ఫ్యాంట్, బ్లూ టాప్ పై బ్లేజ‌ర్ తో బాస్ లేడీని త‌ల‌పించింది కాజ‌ల్.

By - Tupaki Desk
Update: 2023-10-17 17:32 GMT

మాస్ గాడ్ నందమూరి బాలకృష్ణ హీరోగా సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై తెర‌కెక్కిన‌ మూవీ `భగవంత్ కేసరి`. శ్రీలీల కీలక పాత్రలో నటిస్తుండగా కాజల్ అగర్వాల్ కథానాయికగా నటిస్తోంది. ఈ సినిమా ప్రమోషన్ కంటెంట్ భారీ బజ్ క్రియేట్ చేసింది. దసరా కానుకగా అక్టోబర్ 19న భగవంత్ కేసరి విడుదల కానుంది. ఇటీవ‌ల ప్ర‌మోష‌న్స్ లో పాల్గొంటున్న కాజ‌ల్ రెగ్యుల‌ర్ గా కొత్త లుక్స్ తో మ‌తులు చెడ‌గొడుతున్నారు. తాజా లుక్ ట్రెండీగా యువ‌త‌రం గుండెల్లోకి దూసుకెళ్లింది. రెడ్ ఫ్యాంట్, బ్లూ టాప్ పై బ్లేజ‌ర్ తో బాస్ లేడీని త‌ల‌పించింది కాజ‌ల్.


కాజ‌ల్ అగ‌ర్వాల్ మాట్లాడుతూ ఈ సినిమా కోసం పనిచేసిన అనుభవాలను షేర్ చేసారు. భగవంత్ కేసరి మహిళా శక్తి , మహిళా సాధికారతను ఆవిష్క‌రించే కథ. అలాంటి కథలో భాగం కావడం ఎలా? ఈ కథను ఎంచుకోవడానికి ఇదే కారణం. భగవంత్ కేసరి కాన్సెప్ట్ నాకు బాగా నచ్చింది. ఆడబిడ్డలను ధైర్యంగా పెంచడం, మహిళా సాధికారత గురించి మాట్లాడాల్సిన అవసరం నేటి సమాజంలో ఎంతైనా ఉంది. ఇలాంటి కథలు చెప్పేందుకు మన సూపర్‌స్టార్లు ముందుకు రావడం ఆనందంగా ఉంది. నా క్యారెక్టర్ ఎలా ఉంటుందో అనే దానికంటే ఈ కథ చెప్పాలి అనే ఫీలింగ్ కలిగింది. ఇలాంటి మంచి సందేశం ప్రజల్లోకి వెళ్లాలి. ఇంత గొప్ప సినిమాలో భాగమైనందుకు ఆనందంగా ఉంది... అని అన్నారు.

బాలకృష్ణతో పని అనుభ‌వం గురించి మాట్లాడుతూ "ఆయ‌న‌ చాలా స్వీట్ అండ్ ఫ్రెండ్లీ. అతను గొప్ప హాస్య స్వ‌భావం కలవాడు. అన్నింటికంటే మించి ఆయన చాలా నిజాయితీపరుడు. ఆయనతో పనిచేయడం ఆనందంగా ఉంది. మా మధ్య కొన్ని ఫన్నీ సీన్స్ ఉన్నాయి. వాటిని ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేస్తారు.. అని తెలిపారు.

శ్రీలీలతో స్క్రీన్ షేర్ చేసుకోవడం ఎలా అనిపించిందో మాట్లాడుతూ... శ్రీలీల చాలా ప్రతిభావంతురాలు. చాలా ఎనర్జిటిక్. సెట్స్‌లో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. ఆమెకు మంచి పాత్రలు చేయాలనే కోరిక ఉంది. ఇందులో విజ్జి పాప పాత్ర కథలో చాలా ముఖ్యమైనది. తప్పకుండా ఈ పాత్ర తనకు మంచి పేరు తెస్తుంది. న‌వ‌త‌రం న‌టిగా చాలా మంచి భవిష్యత్తు ఉంది... అని తెలిపారు.

భగవంత్ కేసరి ఎలా ఉండబోతోంది? అన్న‌దానిపై మాట్లాడుతూ.. ఇది పవర్ ప్యాక్డ్ మూవీ. ఎమోషన్స్ , యాక్షన్ అద్భుతంగా ఉన్నాయి. బలమైన సందేశం కూడా ఉంది. ప్రతి ఒక్కరు తప్పక చూడాల్సిన సినిమా ఇది... అని వెల్ల‌డించారు.

Tags:    
  • Tollywood 
  • Kajalagarwal 
  • Actress 
  • Actresskajal 
  • Socialmedia 
  • Photoshoot 
  • Phototalk 
  • Ladybosslook 
  • Gorgeouslooks 

Similar News

ట్రెండింగ్: అల్లు స్నేహారెడ్డి ఈ కొత్త రోల్ షాకిస్తోందే!

2026-11-12 17:45 GMT

అనిల్ రావిపూడికి ఉన్న టైమ్ మిగతా దర్శకులకు ఉండటం లేదా...

2026-11-12 17:30 GMT

ఒకప్పుడు ప్రభాస్ ఆ బాలీవుడ్ డైరెక్టర్ తో వర్క్ చేయాలని ఉందన్నాడు. ఇప్పుడు చేస్తాడా?

2026-11-12 16:30 GMT

2027లో బ్లాస్టింగ్ మామూలుగా ఉండ‌దు!

2026-11-12 15:30 GMT

బాహుబలి 2ను వెనక్కి నెట్టిన రామాయణం.. పుష్ప 2కు కూడా షాక్!

2026-11-12 14:30 GMT

ఐకాన్ స్టార్ కోసం గ్యాంగ్ స్ట‌ర్ టైటిల్!

2026-11-12 13:53 GMT

హైందవ 'ఎవరైనా' సాంగ్.. బీచ్ లొకేషన్లో కూల్ కెమిస్ట్రీ

2026-11-12 13:45 GMT

చిన్నతనంలోనే అమ్మానాన్న దూరమై ఇల్లు లేక బాధపడ్డాను!

2026-11-12 13:30 GMT

షారుక్ ఖాన్‌ ఒక్కో ఇల్లు రూ.50 కోట్లు.. అయినా కొనడానికి పోటీపడ్డ కుబేరులు!

2026-11-12 12:30 GMT

బయట 100 కెమెరాలు..లోపల వైట్ సోఫా రూల్!

2026-11-12 11:30 GMT

ఘనంగా మహేష్ బాబు మేనల్లుడి ప్రీ వెడ్డింగ్.. స్పెషల్ పోస్ట్ పంచుకున్న నమృత!

2026-11-12 11:00 GMT

‘వారణాసి’కి రామాయణం చేస్తున్న సాయం

2026-11-12 10:38 GMT

Copyright @2026

Powered by Blink CMS