బెల్లంకొండ రిసెప్షన్లో స్పెషల్ అట్రాక్షన్ గా కాజల్.. ఈమె ధరించిన శారీ ఖరీదు తెలిస్తే షాక్!

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో అల్లుడు శీను సినిమాతో ప్రేక్షకులను పలకరించి.. మొదటి సినిమాతోనే అందరి దృష్టిని ఆకట్టుకున్నారు బెల్లంకొండ సాయి శ్రీనివాస్.;

Update: 2026-05-02 12:19 GMT

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో అల్లుడు శీను సినిమాతో ప్రేక్షకులను పలకరించి.. మొదటి సినిమాతోనే అందరి దృష్టిని ఆకట్టుకున్నారు బెల్లంకొండ సాయి శ్రీనివాస్. అలాంటి ఈయన బ్యాచిలర్ లైఫ్ ను వీడి.. తన ప్రేయసి కావ్య రెడ్డితో బుధవారం ఏప్రిల్ 29 రాత్రి 11:05 గంటలకు కుటుంబ సభ్యులు, సన్నిహితులు, సినీ, రాజకీయ ప్రముఖుల సమక్షంలో శ్రీవారి ఆశీస్సుల నడుమ మూడు ముళ్ళు.. ఏడడుగులు వేశారు. వివాహం అనంతరం మే ఒకటవ తేదీ హైదరాబాద్ వేదికగా గ్రాండ్ రిసెప్షన్ నిర్వహించారు. ఈ వేడుకకు టాలీవుడ్ సినీ ఇండస్ట్రీ నుండి మెగాస్టార్ చిరంజీవి, మోహన్ బాబు , తరుణ్, గోపీచంద్ తో పాటు పలువురు సినీ తారలు వచ్చి సందడి చేశారు.

ఈ ఈవెంట్ లో ప్రముఖ స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. ఇంటర్ ఫిలా షాంపేన్ మెష్ చీర ధరించి అందరి దృష్టిని తన వైపు తిప్పు..ముఖ్యంగా ఈ చీర ట్యూల్ అప్లిక్ డిజైన్ తో రూపొందించారు. సున్నితమైన సీక్విన్, కట్ దాన వర్క్ తో తీర్చిదిద్దిన ఈ చీరకు అనుగుణంగా ఎంబెలిష్డ్ హై నెక్ బ్లౌజును జత చేశారు. ఇక ఈ చీర ధరించి తన జుట్టును బన్ రూపంలో ముడి వేసి ఈ వేడుకలో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది కాజల్ అగర్వాల్. ముఖ్యంగా తన భర్త గౌతమ్ కిచ్లూ తో కలిసి ఫోటోలకు ఫోజులు ఇచ్చిన తీరుకి ఈవెంట్ కి వచ్చిన అతిథులు సైతం ముగ్ధ మనోహరులయ్యారు అనడంలో సందేహం లేదు

ఇకపోతే కాజల్ అగర్వాల్ అలా స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచిందో లేదో ఈమె కట్టుకున్న చీర గురించి ఎక్కువగా సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. ఇక దీని ధర తెలిసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ రిసెప్షన్ వేడుకలో కాజల్ అగర్వాల్ కట్టుకున్న ఈ చీర విలువ అక్షరాలా రూ.1,69,290. ప్రస్తుతం ఈ చీర విలువ తెలిసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఇకపోతే డైరెక్టర్ నీరజాకోన నేతృత్వంలో చాలా అందంగా ముస్తాబయి అందరి దృష్టిని ఆకట్టుకుంది ఈ ముద్దుగుమ్మ.

కాజల్ అగర్వాల్ విషయానికి వస్తే ..లక్ష్మీ కళ్యాణం అనే సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన ఈమె.. ఆ తర్వాత చందమామ సినిమాతో ఓవర్ నైట్ లోనే స్టార్ హీరోయిన్గా పేరు దక్కించుకుంది. ఇక మగధీర సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న కాజల్ అగర్వాల్ వరుస పెట్టి స్టార్ హీరోల సినిమాలలో అవకాశాలు అందుకుంటూ మరింత బిజీగా మారిపోయింది. ఇక కెరియర్ పీక్స్ లో ఉండగానే తన చిన్ననాటి స్నేహితుడు గౌతమ్ ను పెళ్లి చేసుకున్న ఈమె.. ఒక కొడుకుకు కూడా జన్మనిచ్చింది.

ఇక సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా హీరోయిన్గా అవకాశాలు అందుకుంటూ మరింత బిజీగా మారింది కాజల్ అగర్వాల్. ఇక ప్రస్తుతం కాజల్ అగర్వాల్ ఇంస్టాగ్రామ్ ద్వారా పంచుకున్న ఈ ఫోటోలు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి.

Tags:    

Similar News