• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఈ సూప‌ర్ క‌పుల్.. ఒకే...

ఈ సూప‌ర్ క‌పుల్.. ఒకే వ‌ర‌లో రెండు కత్తులు!

| 2డి ఎంట‌ర్ టైన్ మెంట్స్ బ్యాన‌ర్ స్థాపించి అభిరుచి ఉన్న సినిమాల‌ను నిర్మిస్తున్న జంట‌గా వీరు పాపుల‌ర‌వుతున్నారు.

By - Tupaki Desk
Update: 2024-09-30 05:16 GMT

ఒకే వ‌ర‌లో రెండు క‌త్తులు ఇమ‌డ్చ‌డం ఎలా? అలా చేస్తే తేడాలొచ్చేందుకు ఆస్కారం ఉంది. కానీ ఎలాంటి తేడా లేకుండా సూప‌ర్ హిట్లు కొడుతూనే జాతీయ అవార్డులు అందుకునే సినిమాలు తీస్తున్నారు జ్యోతిక‌- సూర్య జంట‌. 2డి ఎంట‌ర్ టైన్ మెంట్స్ బ్యాన‌ర్ స్థాపించి అభిరుచి ఉన్న సినిమాల‌ను నిర్మిస్తున్న జంట‌గా వీరు పాపుల‌ర‌వుతున్నారు.

ఇంత‌కుముందు సుర‌రై పొట్రు (ఆకాశం నీ హ‌ద్దురా-తెలుగులో) లాంటి బ్లాక్ బ‌స్ట‌ర్ ని తెర‌కెక్కించారు. ఈ సినిమాకి జాతీయ అవార్డులు రావ‌డం ఒకెత్తు. ఉత్త‌మ సినిమా- ఉత్త‌మ న‌టుడు-ఉత్త‌మ న‌టి పుర‌స్కారాల‌ను గెలుచుకుంది ఈ చిత్రం. ఇక ఇదే బ్యాన‌ర్ నుంచి ఆల్మోస్ట్ ఆస్కార్ రేసులో నామినేష‌న్ కి పంపిన జై భీమ్ లాంటి చిత్రం కూడా తెర‌కెక్కింది. జై భీమ్ బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్రం. నిజానికి ఎనిమిదేళ్ల‌ విరామం తర్వాత జ్యోతిక `36 వయధినిలే`తో తిరిగి న‌ట‌న‌లోకి వచ్చింది. 2డి ఎంట‌ర్ టైన్ మెంట్ లో రూపొందించిన ఈ సినిమా ఇన్ స్టంట్ హిట్. ఆ త‌ర్వాత‌ దశాబ్ద కాలంగా సూర్య - జ్యోతిక పలు విజ‌య‌వంత‌మైన చిత్రాలను నిర్మించారు. ఇటీవ‌లే ఈ బ్యాన‌ర్ నుంచి విడుద‌లైన స‌త్యం సుంద‌రం కూడా బ‌ల‌మైన ఎమోష‌న్స్ ఉన్న సినిమాగా మంచి పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. దేవ‌ర లాంటి భారీ చిత్రంతో పోటీప‌డుతూ విడుదలైన ఈ సినిమాకి థియేట‌ర్ల‌లో ఆద‌ర‌ణ ద‌క్కుతోంద‌ని స‌మాచారం.

అయితే ద‌శాబ్ధ కాలం పాటు కలిసి న‌టించిన ఈ జంట‌, మ‌రో ద‌శాబ్ధ కాలంగా క‌లిసి సినిమాలు నిర్మిస్తున్నారు. వీరు మంచి అభిరుచితో తెస్తున్న సినిమాలు ప్ర‌జ‌ల‌కు గొప్ప వినోదం పంచుతున్నాయి. సూప‌ర్ హిట్ లు ఒక వైపు.. అవార్డులు రివార్డులు మ‌రోవైపు.. ఒకే వ‌ర‌లో బాగా ఒదిగాయంటే ఈ జంట అభిరుచి ప్ర‌ధాన కార‌ణం. జ్యోతిక‌- సూర్య దంప‌తులు కోలీవుడ్ ఆద‌ర్శ జంట‌గా త‌మ పిల్ల‌ల‌ను గొప్ప స్థాయిల‌కు ఎదిగేందుకు సాకుతూనే, న‌టులుగా, నిర్మాత‌లుగా మంచి పేరు తెచ్చుకుంటున్న వైనం ఔత్సాహిక ఫిలింమేక‌ర్స్, న‌టీన‌టులు అంద‌రికీ స్ఫూర్తి.

Tags:    
  • Jyothika 
  • Suriya 
  • 2Dentertainments 
  • Filmindustry 
  • Jyothikasuriya 
  • Jaibheem 
  • Nationalawards 
  • Jyothikasuriyamovies 

Similar News

ఇప్పుడున్న స్టార్ డైరెక్టర్లందరు కలిసి ఒక సినిమా కోసం వర్క్ చేస్తే ఎలా ఉంటుంది?

2026-11-04 16:30 GMT

ప్లాప్స్ లో సీనియ‌ర్లు టాప్ చైర్ కోసం యువ ద‌ర్శ‌కులు!

2026-11-04 15:30 GMT

నటనలోనే కాదు.. భాషల్లోనూ తోపు! 9 భాషలు మాట్లాడే ఏకైక తెలుగు హీరో

2026-11-04 14:30 GMT

టైటిల్ మార్పులపై సెన్సార్ కత్తి!

2026-11-04 13:30 GMT

AIని అంగీక‌రించ‌డానికి టాలీవుడ్ మాన‌సికంగా సిద్ధంగా లేదు!

2026-11-04 13:15 GMT

పాలకొల్లు నుంచి భాగ్యనగరం వరకు.. అమ్మ‌మ్మ‌ల‌పై అల్లు బాస్ కామెంట్స్‌

2026-11-04 13:14 GMT

'ఇట్లు అర్జున' ట్రైలర్ టాక్: మూగ ప్రేమలో పవర్ఫుల్ యాక్షన్

2026-11-04 13:08 GMT

లోయలోకి జారిపోతున్న నటి ప్రాణాలను కాపాడిన షారుఖ్ ఖాన్!

2026-11-04 12:30 GMT

సందీప్ రెడ్డి వంగ కి ఆర్జీవీ లో నచ్చే విషయాలు...

2026-11-04 11:30 GMT

రణ్‌బీర్ 'రామాయణ'పై బన్నీ ఆసక్తికర వ్యాఖ్యలు!

2026-11-04 11:29 GMT

చందమామ..నీకు అంత కోపమా..!

2026-11-04 11:16 GMT

టాలీవుడ్‌లో కనిపించని రామాయణ సందడి?

2026-11-04 10:58 GMT

Copyright @2026

Powered by Blink CMS