ఎన్టీఆర్‌ లుక్ మారింది గమనించారా?

కొన్ని రోజుల క్రితం ఎన్టీఆర్‌ సన్నబడి బయటకు కనిపించిన సమయంలో చాలా మంది సర్‌ప్రైజ్ అయ్యారు.

Update: 2026-07-07 07:45 GMT

యంగ్ టైగర్ ఎన్టీఆర్‌ 'డ్రాగన్‌' సినిమా కోసం ఏడాది కాలంగా కష్టపడుతున్న విషయం తెల్సిందే. కేజీఎఫ్‌, సలార్‌ వంటి బిగ్గెస్ట్‌ బ్లాక్‌ బస్టర్‌ హిట్స్‌ను ఇచ్చిన దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో ఎన్టీఆర్‌ డ్రాగన్‌ మూవీ రూపొందుతోంది. ప్రశాంత్‌ నీల్‌ మూవీ అంటే యాక్షన్‌ సీక్వెన్స్ గుర్తుకు వస్తాయి. ముఖ్యంగా సలార్‌లో కాటేరమ్మ ఫైట్‌ ఏ స్థాయిలో డిజైన్ చేశాడో మనం చూశాం. కేజీఎఫ్‌లోనూ అద్భుతమైన యాక్షన్‌ సీన్స్ ఉన్నాయి. యాక్షన్‌ ఎపిసోడ్స్‌ అద్భుతంగా రావాలంటే హీరోల ఫిజిక్‌ అత్యంత కీలకం అనే విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందుకే డ్రాగన్‌ సినిమాలోని యాక్షన్‌ ఎపిసోడ్స్ కోసం ఎన్టీఆర్‌ అదనపు వర్కౌట్స్ చేస్తున్నాడు. అంతే కాకుండా షూటింగ్‌ ప్రారంభంకు ముందే బరువు తగ్గాడు. ఎన్టీఆర్‌ గతంతో పోల్చితే చాలా సన్నబడి కనిపిస్తున్నాడు. ఎన్టీఆర్‌ న్యూ లుక్‌ విషయంలో నలుగురు నాలుగు రకాలుగా అనుకుంటున్నారు.

అఖిల్‌ లెనిన్‌ మూవీకి ఎన్టీఆర్‌ వాయిస్ ఓవర్‌..

కొన్ని రోజుల క్రితం ఎన్టీఆర్‌ సన్నబడి బయటకు కనిపించిన సమయంలో చాలా మంది సర్‌ప్రైజ్ అయ్యారు. కొందరు మాత్రం ఎన్టీఆర్‌ ఫేస్‌లోని ఆ ఛార్మింగ్‌ తగ్గిందని కొందరు కామెంట్స్ చేశారు. మొత్తానికి చాలా రకాలుగా ఎన్టీఆర్‌ న్యూ లుక్‌ పై కామెంట్స్ వినిపించాయి. ఎన్టీఆర్‌ తాజాగా అక్కినేని అఖిల్‌ హీరోగా నటించిన 'లెనిన్‌' సినిమా కోసం తన వాయిస్ ఇచ్చిన విషయం తెలసిందే. ఆ విషయాన్ని తెలియజేస్తూ అఖిల్‌ కృతజ్ఞతలు తెలియజేస్తూ కొన్ని ఫోటోలను షేర్‌ చేశాడు. పిలిచిన వెంటనే లెనిన్‌ కోసం వచ్చిన ఎన్టీఆర్‌ కు అఖిల్‌ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేశాడు. ఆ సందర్భంగా తీసుకున్న ఫోటోలను అఖిల్‌ సోషల్‌ మీడియా ద్వారా షేర్‌ చేయడం ద్వారా అందరి దృష్టిని ఆకర్షించాడు. అఖిల్‌ను కాకుండా అంతా కూడా ఎన్టీఆర్‌ లుక్ గురించి ఆ ఫోటోల కింద కామెంట్స్ చేస్తూ తమ అభిమానం ను చాటుకుంటున్నారు.

ఎన్టీఆర్‌ ఫేస్‌లో ఛార్మింగ్‌...

ఎన్టీఆర్‌ బరువు తగ్గిన సమయంలో మొహంలో కాస్త ఛార్మింగ్‌ తగ్గిందనే కామెంట్స్ వచ్చాయి. తాజా లుక్‌ లో ఎన్టీఆర్‌ మునుపటి ఛార్మింగ్‌తో ఆకట్టుకుంటున్నాడు అంటూ పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఎన్టీఆర్‌ మునుపటి ఛార్మింగ్‌తో కనిపించడంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. చాలా మంది అభిమానులు సోషల్‌ మీడియాలో ఎన్టీఆర్‌ న్యూ లుక్ పోస్టర్‌ ను షేర్‌ చేసి ఇది గమనించారా.. మునుపటి లుక్‌లో ఎన్టీఆర్‌ కనిపిస్తున్నాడు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఎన్టీఆర్‌ బరువు పెరగక పోయినా ఫేస్‌లో మాత్రం ఆ ఛార్మింగ్‌ తిరిగి రావడం పట్ల అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇదే లుక్‌తో ఎన్టీఆర్‌ ముందు ముందు సినిమాల్లో కూడా నటించాలని అంతా కోరుకుంటున్నారు. డ్రాగన్‌ సినిమాను వచ్చే ఏడాదిలో ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.

ఎన్టీఆర్‌, ప్రశాంత్‌ నీల్‌ డ్రాగన్‌ మూవీ షూటింగ్‌ అప్‌డేట్‌...

ఇటీవల హైదరాబాద్‌లో కీలక షెడ్యూల్‌ను చేయడం జరిగింది. త్వరలోనే యూనిట్‌ సభ్యులు అంతా శ్రీలంక వెళ్లి అక్కడ దాదాపుగా రెండు నెలల పాటు షూటింగ్‌ చేసుకుని రాబోతున్నట్లు సమాచారం అందుతోంది. ఈ నెలలోనే యూనిట్‌ సభ్యులు శ్రీలంక వెళ్తారని నిర్మాణ సంస్థ నుంచి సమాచారం అందుతోంది. శ్రీలంకలో కీలక యాక్షన్‌ సన్నివేశాలు చిత్రీకరించే అవకాశాలు ఉన్నాయి. శ్రీలంక షెడ్యూల్‌తో మెజార్టీ షూటింగ్‌ పూర్తి అయినట్లుగా అవుతుందని, బ్యాలన్స్ వర్క్ ను ఇండియాలోనే ముగించి వచ్చే ఏడాదిలో అనుకున్న సమయంకు విడుదల చేయాలని పట్టుదలతో దర్శకుడు ఉన్నాడు. రుక్మిణి వసంత్‌ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో అనిల్‌ కపూర్‌ కీలక పాత్రలో నటిస్తున్నట్లుగా తెలుస్తోంది. సినిమాలోని ఎన్టీఆర్‌ పాత్ర గురించి ఇప్పటికే కొంత స్పష్టత వచ్చినప్పటికీ అభిమానులు సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నారు.

Tags:    

Similar News