సుకుమార్ శిష్యుల్లో మరోకరు తెరపైకి!
టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ సక్సెస్ఫుల్ డైరెక్టర్ల బాటలో పయనిస్తున్న సుకుమార్ స్కూల్ నుంచి మరో టాలెంటెడ్ అసిస్టెంట్ డైరెక్టర్ త్వరలోనే మెగాఫోన్ పట్టనున్నారు.
టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ సక్సెస్ఫుల్ డైరెక్టర్ల బాటలో పయనిస్తున్న సుకుమార్ స్కూల్ నుంచి మరో టాలెంటెడ్ అసిస్టెంట్ డైరెక్టర్ త్వరలోనే మెగాఫోన్ పట్టనున్నారు. ఇప్పటికే సుకుమార్ శిష్య బృందం నుంచి బుచ్చిబాబు సానా, శ్రీకాంత్ ఓదెల, కార్తీక్ దండు వంటి దర్శకులు ఇండస్ట్రీలో సంచలనాలు సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. ఈ కోవలోనే మరో యువ సంచలనం దర్శకుడిగా అరంగేట్రం చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నాడు.
తాజా సమాచారం ప్రకారం ఈసారి బయటి నిర్మాతల కోసం కాకుండా నేరుగా సుకుమార్ సొంత నిర్మాణ సంస్థ అయిన సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లోనే ఈ కొత్త ప్రాజెక్ట్ లాంచ్ కానుందని తెలుస్తోంది. డైరెక్షన్ ఛాన్స్ ఇవ్వడమే కాకుండా తన శిష్యులకు ప్రొడక్షన్ పరంగా కూడా పూర్తి భరోసా కల్పిస్తూ ప్రోత్సహించడంలో సుకుమార్ ఎప్పుడూ ముందుంటారు. ఈ క్రమంలోనే తదుపరి చిత్రాన్ని సొంత బేనర్లోనే నిర్మించాలని సుకుమార్ నిర్ణయించుకు న్నట్లు తెలుస్తోంది.
కొత్త దర్శకుడికి సంబంధించి ఇండస్ట్రీ వర్గాలలో మరో ఆసక్తికరమైన విషయం వైరల్ అవుతోంది. ఆయన మరెవరో కాదు. సుకుమార్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన పాన్-ఇండియా బ్లాక్‌బస్టర్ `పుష్ప` చిత్రానికి కీలకమైన విభాగంలో పనిచేసిన వ్యక్తి అని సమాచారం. `పుష్ప` సెట్స్‌లో సుకుమార్ వర్కింగ్ స్టైల్‌ను దగ్గరుండి గమనించి.. సినిమా మేకింగ్ మెళకువలను పూర్తిగా ఒంటబట్టించుకున్న యువకుడు పక్కా కమర్షియల్ స్క్రిప్ట్‌తో దర్శకుడిగా ప్రమోట్ అవుతున్నాడు.
వచ్చే ఏడాది లో ఈ సినిమా అధికారికంగా పట్టాలెక్కేలా సన్నాహాలు జరుగుతున్నట్లు సమాచారం. ప్రస్తుతం స్క్రిప్ట్‌కు సంబంధించిన తుది మెరుగులు దిద్దే పనిలో ఉన్న ఆ యువ దర్శకుడు త్వరలోనే ప్రీ-ప్రొడక్షన్ పనులను కూడా ప్రారంభించనున్నారుట. `పుష్ప` లాంటి భారీ ప్రాజెక్ట్‌కు పనిచేసిన అనుభవం ఉండటంతో ఆయన టేకింగ్ .. మేకింగ్ విజన్ డిఫరెంట్‌గా ఉంటుందని చెప్పొచ్చు.
సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ అంటేనే కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలకు పెద్ద పీట వేస్తారు. అలాంటి సంస్థలో ఈ సినిమా వస్తుండటంతో అంచనాలు తారాస్థాయికి చేరుకుంటున్నాయి. కమర్షియల్ హంగులే కాకుండా ప్రేక్షకులను ఆలోచింపజేసేలా బలమైన కథాంశంతో ఈ చిత్రం రూపుదిద్దుకోనుందని తెలుస్తోంది. సుకుమార్ పర్యవేక్షణలో తెరకెక్కుతుండటంతో ప్రాజెక్ట్‌పై ట్రేడ్ వర్గాల్లో కూడా మంచి బజ్ క్రియేట్ అయింది.
త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన హీరో, నటీనటులు , సాంకేతిక నిపుణుల వివరాలను అధికారికంగా ప్రకటించడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. గురు-శిష్యుల కాంబినేషన్ లో పట్టాలెక్కుతున్న కొత్త చిత్రం టాలీవుడ్లో మరో విజయం సాధించడం ఖాయమని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరి సక్కు మాష్టారు స్కూల్ నుంచి వస్తోన్న కొత్త ప్రతిభ ఎంతవరకు అంచనాలను అందుకుంటుందో చూడాలి.