దేవర-2.. మరోసారి తారక్ ఫుల్ క్లారిటీ!
కానీ తారక్ మాత్రం.. అవకాశం వచ్చినప్పుడల్లా దేవర-2పై రెస్పాండ్ అవుతున్నారు. ఆ మధ్య ఓ ఈవెంట్ లో దేవర సీక్వెల్ కచ్చితంగా ఉంటుందని తెలిపారు.;
టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్, డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్ లో దేవర మూవీ తెరకెక్కిన విషయం తెలిసిందే. అరవింద సమేత తర్వాత తారక్ సోలోగా నటించిన ఆ సినిమా.. భారీ అంచనాల మధ్య గత ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఫ్యాన్స్ ను బాగా ఆకట్టుకున్న మూవీ.. తారక్ కెరీర్ లోనే రికార్డ్ గ్రాసర్ గా నిలిచింది.
బాక్సాఫీస్ వద్ద కూడా భారీ వసూళ్లను రాబట్టింది. అయితే రెండు పార్టులుగా రానున్నట్లు మేకర్స్ ముందే ప్రకటించగా.. సీక్వెల్ కోసం ఇప్పుడు ఫ్యాన్స్ ఎంతగానో వెయిట్ చేస్తున్నారు. మొదటి భాగం విడుదలైన వెంటనే సీక్వెల్ వస్తుందని అభిమానులు భావించినా.. ఇప్పటి వరకు షూటింగ్ కూడా మొదలుపెట్టలేదు మేకర్స్.
దేవర-1 తర్వాత తన బాలీవుడ్ డెబ్యూ వార్-2పై ఎన్టీఆర్ ఫోకస్ పెట్టారు. రీసెంట్ గా డబ్బింగ్ కంప్లీట్ చేశారు. ఇప్పుడు ప్రముఖ దర్శకుడు ప్రశాంత్ నీల్ తో చేస్తున్న సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నారు. రీసెంట్ గా త్రివిక్రమ్ శ్రీనివాస్ తో తారక్.. మైథలాజికల్ డ్రామాకు గాను వర్క్ చేయనున్నట్లు నిర్మాత నాగవంశీ ప్రకటించారు.
నెల్సన్ దిలీప్ కుమార్ తో ఎన్టీఆర్ ఓ సినిమా చేస్తారని ఎప్పటి నుంచో టాక్ ఉంది. అలా తారక్ లైనప్ వేరే లెవెల్ అని చెప్పాలి. దీంతో దేవర-2 ఎప్పుడా అన్నది పెద్ద క్వశ్చన్ మార్క్ గా మారింది. అదే సమయంలో దేవర-2 ఉండదని చాలా మంది సినీ ప్రియులు భావిస్తున్నారు. ఇప్పట్లో కష్టమేనని కూడా అంతా అనుకుంటున్నారు.
కానీ తారక్ మాత్రం.. అవకాశం వచ్చినప్పుడల్లా దేవర-2పై రెస్పాండ్ అవుతున్నారు. ఆ మధ్య ఓ ఈవెంట్ లో దేవర సీక్వెల్ కచ్చితంగా ఉంటుందని తెలిపారు. రీసెంట్ గా జపాన్ వెళ్లిన ఆయన.. ఆ మూవీ సర్ప్రైజింగ్ గా ఉంటుందని చెప్పారు. దేవరకు ఏమైంది అనే బ్యాక్ స్టోరీ సీక్వెల్ లో ఉంటుందని చెప్పి అంచనాలు పెంచారు.
ఇప్పుడు తాజాగా ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టారు. ఆదివారం కొరటాల శివ పుట్టినరోజు కావడంతో విషెస్ చెప్పారు. "పుట్టినరోజు శుభాకాంక్షలు శివ.. నిశ్శబ్దం, శక్తి ద్వారా మాట్లాడే చిత్ర నిర్మాత. నీకు స్ఫూర్తినిచ్చే మరిన్ని కథలు, మాతో జీవించే క్షణాలు కావాలని కోరుకుంటున్నాను. మరోసారి అలల వెంట ప్రయాణించడానికి వేచి ఉండలేను" అంటూ రాసుకొచ్చారు.
అలా to అనే పదానికి 2 అని మెన్షన్ చేసి దేవర సీక్వెల్ ను ప్రస్తావించారు. ప్రస్తుతం తారక్ పోస్ట్ వైరల్ గా మారగా.. నెటిజన్లు స్పందిస్తున్నారు. షూటింగ్ ఎప్పుడు ప్రారంభిస్తారనే దానిపై స్పష్టత లేనప్పటికీ, ఎన్టీఆర్ తన అభిమానుల కోసం సీక్వెల్ తీసుకురావాలని ఆసక్తిగా ఉన్నట్లు తెలుస్తుందని చెబుతున్నారు. కొరటాల ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేశారని సమాచారం. మరి షూటింగ్ ఎప్పుడు ప్రారంభమవుతుందో వేచి చూడాలి.