మిర్జాపూర్ సినిమాలో బబ్లూ మారుతున్నాడు..!
సూపర్ హిట్ వెబ్ సిరీస్ మిర్జాపూర్ ఫ్యాన్స్ కి రెట్టింపు థ్రిల్ కలిగించే క్రమంలో ఆ సీరీస్ ని ఇప్పుడు సిల్వర్ స్క్రీన్ పై తీసుకొస్తున్నారు.;
సూపర్ హిట్ వెబ్ సిరీస్ మిర్జాపూర్ ఫ్యాన్స్ కి రెట్టింపు థ్రిల్ కలిగించే క్రమంలో ఆ సీరీస్ ని ఇప్పుడు సిల్వర్ స్క్రీన్ పై తీసుకొస్తున్నారు. మిర్జాపూర్ సినిమాకు సంబంధించిన ప్రతి అప్డేట్ ఫ్యాన్స్ ని సర్ ప్రైజ్ చేస్తుంది. లేటెస్ట్ గా ఈ సినిమాలో బబ్లూ పండిట్ పాత్రలో జితేంద్ర కుమార్ ని తీసుకున్నారు. జితేంద్ర కుమార్ ఇప్పటికే పంచాయత్ ఇంకా, కోటా ఫ్యాక్టరీ సీరీస్ అతో పాపులారిటీ తెచ్చుకున్నాడు.
పంచాయత్ లో సచివ్ జీగా, కోటా ఫ్యాక్టరీలో జితు భియా పాత్రల్లో జితేంద్ర కుమార్ మెప్పించాడు. ఇక ఇప్పుడు అతను మిర్జాపూర్ సినిమాలో ఛాన్స్ అందుకున్నాడు. పంచాయత్ స్టార్ మిర్జాపూర్ లో ఛాన్స్ అందుకోవడం సినీ ప్రియులను సర్ ప్రైజ్ చేస్తుంది. మిర్జాపూర్ సినిమాలో జితేంద్ర బబ్లూ పండిట్ పాత్రలో నటిస్తున్నారని తెలుస్తుంది.
మిర్జాపూర్ సీరీస్ లో బబ్లూ పండిట్ గా విక్రాంత్ మాస్సే నటించాడు. ఐతే అతను ఇప్పుడు బిజీ యాక్టర్ అయ్యాడు. అతన్ నటించిన ట్వెల్త్ ఫెయిల్, సెక్టార్ 36 సక్సెస్ అవ్వడంతో అతను మిర్జాపూర్ లో నటించే అవకాశం లేదు. అందుకే అతని ప్లేస్ లో బబ్లూ పాత్రకు జితేంద్రని ఎంపిక చేశారు.
మిర్జాపూర్ సీరీస్ లో ఇంపార్టెంట్ రోల్ అయిన బబ్లూ రోల్ ఇప్పుడు జితేంద్ర చేతికి వచ్చింది. ఐతే మిర్జాపూర్ సినిమా ఫ్లాష్ బ్యాక్ లో బబ్లూ పండిట్ సీన్స్ ఉంటాయట. మరి ఈ పంచాయత్ నటుడు మిర్జాపూర్ సినిమాకు ఎంతవరకు న్యాయం చేస్తాడన్నది చూడాలి. ఐతే విక్రాంత్ చేయాల్సిన ఈ రోల్ ని జితేంద్ర చేయడం కాస్త డిజప్పాయింట్ అనిపించినా జితేంద్ర కూడా తన నటనతో ఆడియన్స్ ని ఆకట్టుకోవాలని చూస్తున్నాడు. ఓ విధంగా సీరీస్ ని సినిమాగా తీయడమే మిర్జాపూర్ చేస్తున్న కొత్త ప్రయోగం అయితే సీరీస్ లో నటించిన ఒక పాత్రలో సినిమాలో మరొకరిని తీసుకోవడం కూడా కొత్త విషయమని చెప్పొచ్చు.
మిర్జాపూర్ సీరీస్ లవర్స్ కి కూడా ఈ మార్పు యాక్సెప్ట్ చేసేలా ఉందని చెప్పొచ్చు. మరి జితేంద్ర కుమార్ మిర్జాపూర్ సినిమాలో ఎలా ఆడియన్స్ ని అలరిసాడు అన్నది చూడాలి. మిర్జాపూర్ సీరీస్ ని సినిమాగా తీసుకు రావాలన్న ఆలోచనతో ఆడియన్స్ ముందుకు తీసుకు రాగా అందుకు వాళ్ల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. అందుకే మిర్జాపూర్ సీరీస్ ని చాలా భారీగా తెరకెక్కిస్తున్నారు.