• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  జరగండి సాంగ్.. మళ్ళీ అదే...

జరగండి సాంగ్.. మళ్ళీ అదే గోల

| ఈ సినిమాకు స్టార్ డైరెక్టర్ తమన్ మ్యూజిక్ అందిస్తున్నారు.

By - Tupaki Desk
Update: 2024-03-27 11:31 GMT

టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్ ప్రస్తుతం నటిస్తున్న గేమ్ ఛేంజర్ మూవీ నుంచి కొత్త అప్డేట్ వచ్చిన విషయం తెలిసిందే. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా నుంచి జరగండి సాంగ్ ను రిలీజ్ చేశారు మేకర్స్. గతేడాది దీపావళికి రిలీజ్ చేస్తామని చెప్పిన మేకర్స్.. నేడు రామ్ చరణ్ బర్త్ డే సందర్భంగా బుధవారం ఉదయం విడుదల చేశారు. ఈ సినిమాకు స్టార్ డైరెక్టర్ తమన్ మ్యూజిక్ అందిస్తున్నారు.

గతంలో ఈ సాంగ్ సోషల్ మీడియాలో లీకైన విషయం తెలిసిందే. అప్పుడు పాడిన వారిని కాకుండా.. కొత్తవారితో పాడించారు తమన్. తెలుగుతో పాటు తమిళ, హిందీ భాషల్లో ఈ పాటను రిలీజ్ చేశారు గేమ్ ఛేంజర్ మేకర్స్. ఇక ఈ సాంగ్ విడుదలైన తర్వాత సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో చర్చ జరుగుతోంది. చరణ్ ఫ్యాన్స్ అంతా.. పాట సూపర్ గా ఉందని చెబుతుంటే.. ఆశించిన స్థాయిలో అసలు లేదని నెటిజన్లు అంటున్నారు.

ఇప్పటికే రామ్ చరణ్, కియారా కాంబోలో వచ్చిన వినయ విధేయ రామ సినిమా సాంగ్సే బెటర్ అంటూ కొందరు కామెంట్లు పెడుతున్నారు. కొన్ని స్టెప్పులు కూడా బాగాలేదని అంటున్నారు. తమన్ పై కూడా ఫుల్ ట్రోల్స్ చేస్తున్నారు. కాపీ ట్యూన్ అంటూ జూనియర్ ఎన్టీఆర్ శక్తి మూవీ లోని సుర్రు సుర్రో పాటను షేర్ చేస్తున్నారు. రెండు సాంగ్స్ క్లిప్పింగ్స్ ను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి మరీ తమన్ పై ట్రోలింగ్ చేస్తున్నారు.

ఇటీవల గుంటూరు కారం మూవీ సమయంలో కూడా తమన్ పై ఫుల్ ట్రోల్స్ వచ్చాయి. ఓ మై బేబీ సాంగ్ విషయంలో భారీగా ట్రోల్స్ రాగా.. ఆ తర్వాత కుర్చీ మడతపెట్టి సాంగ్ రిలీజ్ అయ్యాక కాస్త తగ్గాయి. ఇక గేమ్ ఛేంజర్ కు సంబంధించిన ఒక్క సాంగ్ తో తమన్ ను ఇలా ట్రోలింగ్ చేయడం కరెక్ట్ కాదని కొందరు నెటిజన్లు ఆయనకు మద్దతు పలుకుతున్నారు. కానీ ఫస్ట్ సాంగ్ విషయంలో జాగ్రత్తలు తీసుకోకుంటే ఇలాంటి సమస్యలే వస్తాయని సూచిస్తున్నారు.

జరగండి సాంగ్ లిరిక్స్ విషయంలో కూడా నెటిజన్లు మండిపడుతున్నారు. జాబిలమ్మ జాకెట్ వేసుకోవడమేంటని ప్రశ్నిస్తున్నారు. తమిళం భాష వచ్చిన వాళ్లు.. లిరిక్స్ పై పెదవి విరుస్తున్నారు. అలా ఈ మధ్య తమన్ కంపోజ్ చేసిన అనేక పాటలపై నెట్టింట ట్రోలింగ్ జరగడం కామన్ అయిపోయింది. ఇక జరగండి పాటకు జరుగుతున్న ట్రోలింగ్ పై గేమ్ ఛేంజర్ మేకర్స్ స్పందిస్తారో లేదో చూడాలి. కనీసం తమన్ అయినా రెస్పాండ్ అవుతారో లేదో.

Tags:    
  • Tollywood 
  • Jaragandisong 
  • GameChanger 
  • Ramcharan 
  • Kiara 
  • RamaLovesSitasong 
  • Gunturkaram 
  • KurchiniMadthapettisong 
  • Shankar 
  • Boys 

Similar News

ఆ పాన్ ఇండియా విషయంలో మాత్రం తెలుగు వాళ్ళ కన్నా తమిళ వాళ్లే మిన్న..!

2026-11-05 12:30 GMT

ఓటీటీ లవర్స్‌కు గుడ్ న్యూస్.. ఈ వారం అదిరిపోయే రిలీజ్‌లు!

2026-11-05 12:17 GMT

అదిరిపోయే ఫ్యాషన్ లుక్స్‌తో శోభిత ధూళిపాళ్ల సందడి!

2026-11-05 12:16 GMT

మంచు కొండల్లో వణుకుతున్న జాన్వీ!

2026-11-05 11:30 GMT

కంబ్యాక్ కోసం శ్రీనువైట్ల ప్రయత్నం ఫలిస్తుందా? 'జార్జ్ క్రిష్'తో నాటి వైభవం సాధ్యమేనా?

2026-11-05 10:30 GMT

స్నేహితుల రియల్ లైఫ్ డ్రామానే సినిమా!

2026-11-05 10:08 GMT

'జైల‌ర్ 3'పై ఊహించని అప్‌డేట్‌.. ఆ ఏడాదే సెట్స్‌పైకి?

2026-11-05 10:01 GMT

దిగ్గజాల సమ్మేళనం: 1986 నాటి అన్న‌గారు ఎన్టీఆర్ విందులో చిరంజీవి!

2026-11-05 10:00 GMT

పెద్ద సినిమాలకు మాత్రమే ఎందుకీ నిర్లక్ష్యం..!

2026-11-05 09:58 GMT

విడుదలకు ముందే కేక పెట్టిస్తున్న కాకా..!

2026-11-05 08:06 GMT

నేచుర‌ల్ అందంతో జెన్ Zని క‌వ్విస్తున్న డెబ్యూ న‌టి

2026-11-05 08:06 GMT

అన్ని పుకార్ల‌కు చెక్.. 'దాదా' ఫిక్స‌యితే ద‌బిడి దిబిడే!

2026-11-05 07:53 GMT

Copyright @2026

Powered by Blink CMS