• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  జాన్వీకి అలా అమ్మను...

జాన్వీకి అలా అమ్మను గుర్తు చేస్తున్న 'దేవర'!

| దేవర సినిమా కోసం ఇప్పటికే పలు దఫాలుగా సెట్స్‌ కి వచ్చిన జాన్వీ కపూర్‌ తాజాగా ఒక షెడ్యూల్‌ ను ముగించుకుని ముంబై వెళ్లి పోయింది.

By - Tupaki Desk
Update: 2023-12-04 07:35 GMT

ఎన్టీఆర్‌ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న దేవర సినిమా తో అతిలోక సుందరి శ్రీదేవి తనయ జాన్వీ కపూర్‌ తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవ్వబోతున్న విషయం తెల్సిందే. హీరోయిన్‌ గా జాన్వీ కపూర్‌ బాలీవుడ్‌ లో అడుగు పెట్టి చాలా కాలం అయింది. ఎట్టకేలకు జాన్వీ 'దేవర' సినిమా తో సౌత్‌ లో అడుగు పెట్టబోతుంది.

దేవర సినిమా కోసం ఇప్పటికే పలు దఫాలుగా సెట్స్‌ కి వచ్చిన జాన్వీ కపూర్‌ తాజాగా ఒక షెడ్యూల్‌ ను ముగించుకుని ముంబై వెళ్లి పోయింది. దేవర సినిమా విశేషాలతో పాటు ఇతర విషయాల గురించి జాన్వీ కపూర్‌ బాలీవుడ్‌ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

దేవర సినిమా గురించి సదరు ఇంటర్వ్యూలో జాన్వీ కపూర్‌ మాట్లాడుతూ.. తెలుగు లో దేవర నా మొదటి సినిమా. ఆ సినిమా కోసం తెలుగు డైలాగ్స్ నేర్చుకునేందుకు నేను చాలా సమయం తీసుకుంటూ ఉన్నాను. తెలుగు పై కొంత పట్టు ఉన్న కారణంగా నేను ఆ డైలాగ్స్ ను చెప్పడంలో ఇబ్బంది పడటం లేదు.

మా అమ్మ ఇంట్లో ఉన్నప్పుడు మాతో హిందీ లేదా ఇంగ్లీష్ లో మాట్లాడేది. సౌత్‌ కి వెళ్లినప్పుడు తమిళ్ లేదా తెలుగు లో మాట్లాడేవారు. ఇప్పుడు నేను దేవర సినిమా షూటింగ్‌ కు వెళ్లిన సమయంలో అమ్మ గుర్తుకు వస్తున్నారు. అమ్మతో గడిపిన సమయం, నాకు అమ్మ తో ఉన్న బాండింగ్‌ ను దేవర సెట్స్ లో నెమర వేసుకుంటున్నాను.

సౌత్‌ ఇండియన్ సినిమాలో నటిస్తున్నాను అంటే అమ్మ కచ్చితంగా ఆనందిస్తుంది. ఇప్పుడు అమ్మ లేక పోయినా కూడా ఒక ఆధ్యాత్మిక అనుభూతి నాకు కలుగుతూ ఉంది. తెలుగు సినిమాలో నటించడం చాలా సంతోషంగా ఉంది. ముందు ముందు మరిన్ని సౌత్‌ సినిమాలు చేస్తాను అన్నట్లుగా జాన్వీ కపూర్‌ వ్యాఖ్యలు చేశారు.

దేవర ను రెండు పార్ట్‌ లుగా విడుదల చేయబోతున్న విషయం తెల్సిందే. దేవర మొదటి పార్ట్‌ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్‌ లో ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు. ఇక రెండో పార్ట్‌ 2025 సమ్మర్‌ లో విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.

Tags:    
  • Tollywood 
  • Filmindustry 
  • Janhvikapoor 
  • Actress 
  • Actressjanhvi 
  • Devara 
  • Southfilm 

Similar News

ఆఫర్లు తెచ్చిన మైకం.. కానీ నన్ను కాపాడింది అతడే!

2026-11-06 14:30 GMT

బ్యానర్‌లో కాదు.. ఆయనతోనే సినిమా చేయాలనుంది: మౌళి

2026-11-06 13:18 GMT

కమల్ హాసన్ బర్త్‌డే ట్రీట్.. అదిరిపోయిన సండియర్ ఫస్ట్ లుక్!

2026-11-06 13:15 GMT

రామాయణం తీయడానికి ఇంత ఖర్చు అవసరమా..!

2026-11-06 13:11 GMT

వైజాగ్ నుంచి హాలీవుడ్ వరకు శోభిత గ్రాండ్ జర్నీ!

2026-11-06 12:30 GMT

చదువు,ఉద్యోగాలు వదిలేసి యువత థియేటర్ల ముందుండాలా?

2026-11-06 11:40 GMT

ఫేమస్ నటీమణులపై లేడీ సూపర్‌స్టార్ శ్రీదేవి ఇంపాక్ట్!

2026-11-06 11:30 GMT

మెగాస్టార్‌కు వ‌రుస‌గా బాంబ్ బెదిరింపులు.. అస‌లేం జ‌రుగుతోంది?

2026-11-06 10:49 GMT

రామాయణ లో ఉన్నది.. ఆదిపురుష్‌లో లేనిది ఇదేనా!

2026-11-06 10:48 GMT

రామాయణంలో భాగం కావడం మర్చిపోలేని అనుభూతి.. రకుల్ ప్రీత్ సింగ్!

2026-11-06 10:46 GMT

ఈసారైనా పెళ్లి అవుతుందా? సీజన్ 2పై పెరిగిన ఆసక్తి!

2026-11-06 10:30 GMT

భారతీయ కథలకు ప్రపంచమే వేదిక!

2026-11-06 09:30 GMT

Copyright @2026

Powered by Blink CMS