ఎంత టాలెంట్ ఉన్నా వారి ముందు తగ్గి ఉండాల్సిందే!

తాజాగా జాన్వీ కపూర్ బాలీవుడ్ నిర్మాత, నటుడు , దర్శకుడు అయినటువంటి కరణ్ జోహార్ తో కలిసి ట్వింకిల్ ఖన్నా,కాజోల్ హోస్ట్ లుగా చేస్తున్న "టూ మచ్ విత్ కాజోల్ ట్వింకిల్" టాక్ షోలో పాల్గొన్నారు.;

Update: 2025-10-25 22:30 GMT

బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ ఎప్పుడు ఏదో ఒక విషయంతో నెట్టింట్లో హాట్ టాపిక్ గా నిలుస్తూ ఉంటుంది. అలా తాజాగా ఒక టాక్ షో లో పాల్గొన్న జాన్వీ పురుషాధిక్యంపై బహిరంగంగా మాట్లాడి సంచలనం సృష్టించింది. మరి ఇంతకీ ఎంతో బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి జాన్వీ కపూర్ కి ఇండస్ట్రీలో ఎదురైనటువంటి ఆ చేదు సంఘటనలు ఏంటి? ఎందుకు మెయిల్ ఇగో గురించి అలాంటి వ్యాఖ్యలు చేసింది? అనేది ఇప్పుడు చూద్దాం.

తాజాగా జాన్వీ కపూర్ బాలీవుడ్ నిర్మాత, నటుడు , దర్శకుడు అయినటువంటి కరణ్ జోహార్ తో కలిసి ట్వింకిల్ ఖన్నా,కాజోల్ హోస్ట్ లుగా చేస్తున్న "టూ మచ్ విత్ కాజోల్ ట్వింకిల్" టాక్ షోలో పాల్గొన్నారు. ఈ టాక్ షోలో జాన్వీ కపూర్ మాట్లాడుతూ.. "నేను నెపోకిడ్ ని ఒప్పుకుంటున్నాను. సినిమా నేపథ్యమున్న కుటుంబం నుంచే వచ్చాను. కానీ నేను కూడా ఎన్నో ఇబ్బందులు పడ్డాను. ఈ పురుషాహంకార ప్రపంచంలో రాణించాలంటే ఎన్నో ఇబ్బందులు పడాల్సి ఉంటుంది.. సినిమా ఇండస్ట్రీలో రాణించాలంటే కచ్చితంగా పురుషుల అహంకారాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది.. ఇండస్ట్రీకి వచ్చాకే నేను చాలా విషయాలు నేర్చుకున్నాను. ఒక్కోసారి మనల్ని మనమే తక్కువ చేసుకోవాలి. నలుగురు మహిళలు ఉన్న దగ్గర గట్టిగా మాట్లాడగలం. కానీ నలుగురు పురుషులు ఒకే దగ్గర ఉన్నప్పుడు మాట్లాడడం చాలా కష్టం. అలా మాట్లాడేటప్పుడు చాలా ఒద్దికగా మాట్లాడాల్సి ఉంటుంది.. ఎందుకంటే నేను మాట్లాడేటప్పుడు నలుగురు పురుషులకు ఎలాంటి ఇబ్బంది ఉండకూడదు.వారు నొచ్చుకోకుండా వారికి ఇబ్బంది కలగకుండా మాట్లాడాల్సి వస్తుంది.

మనం ఎదుటివారి కంటే అద్భుతంగా నటించగలం. అద్భుతంగా నటించే సామర్థ్యం ఉంటుంది. కానీ వారి ముందు మనకు ఎలాంటి సామర్థ్యం లేదు అని అనుకునేలాగా తగ్గి నటించాల్సి వస్తుంది. అయితే ఇలాంటి వాటిపై నేను పోరాటం చేశాను.అయినా మనల్ని పట్టించుకునే వారు ఉండరు. నేను చెయ్యను.. నాకు రాదు.. నాకు నచ్చలేదు అని చెప్పే బదులు దాని గురించి నాకు సరిగ్గా అర్థం అవ్వడం లేదు ప్యాకప్ అని చెప్పాల్సి వస్తుంది. సినిమా ఇండస్ట్రీలో ఎన్నోసార్లు పురుషాహంకారాన్ని ఎదుర్కొన్నాను.ఇక్కడ రాజకీయాలు వేరేలా ఉంటాయి. మనకు నచ్చినట్టుగా కాదు వారికి నచ్చినట్టుగా ఉండాలి. వారి ముందు అన్ని విషయాల్లో తగ్గే ఉండాలి.. "అంటూ సినీ ఇండస్ట్రీలో ఉండే మెయిల్ ఇగో గురించి సంచలన వ్యాఖ్యలు చేసింది జాన్వీ కపూర్. అయితే జాన్వీ కపూర్ చేసిన వ్యాఖ్యలకు ట్వింకిల్ ఖన్నా కూడా మద్దతు తెలిపింది. గతంలో నేను సినిమాల్లో రాణించిన సమయంలో కూడా ఇలాంటి పరిస్థితులు,ఇబ్బందులు ఎదుర్కొన్నాను అంటూ చెప్పుకొచ్చింది.

జాన్వీ కపూర్ మాటల్ని బట్టి చూస్తే మాత్రం ఇండస్ట్రీలో మెయిల్ డామినేషన్ ఎంతలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. బ్యాక్ గ్రౌండ్ ఉన్న నటికే ఇలాంటి పరిస్థితులు ఎదురైతే.. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చే నటీమణులకు ఇంకా ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతాయో అర్థం చేసుకోవచ్చు అంటూ నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు.

Tags:    

Similar News