ఆ డైరెక్ట‌ర్ `బ్ల‌డీ బెగ్గ‌ర్` గా న్యూ జ‌ర్నీ!

`జైల‌ర్` విజ‌యంతో నెల్స‌న్ దిలీప్ కుమార్ పేరు పాన్ ఇండియాలో మారు మ్రోగిన సంగ‌తి తెలిసిందే.

Update: 2024-05-04 08:27 GMT

`జైల‌ర్` విజ‌యంతో నెల్స‌న్ దిలీప్ కుమార్ పేరు పాన్ ఇండియాలో మారు మ్రోగిన సంగ‌తి తెలిసిందే. అంత‌కు ముందు విజ‌య్ తో తెర‌కెక్కించిన `బీస్ట్` ప్లాప్ అయినా `జైల‌ర్` విజ‌యం అన్ని లెక్క‌లు స‌రి చేసింది. సినిమా 600 కోట్ల‌కు పైగా వ‌సూళ్లు సాధించ‌డంతో నెల్స‌న్ కోలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ డైరెక్ట‌ర్ల జాబితాలో చేరిపోయాడు. త‌దుప‌రి సినిమాతో కూడా భారీ హిట్ కొట్టాల‌నే క‌సితో ఉన్నాడు. కుదిరితో సూప‌ర్ స్టార్ మ‌ళ్లీ రంగంలోకి దించాల‌ని ట్రై చేస్తున్నాడు.

మ‌రోవైపు త‌ల‌ప‌తి విజ‌య్ తో చివరి సినిమా ఛాన్స్ కోసం కూడా ఎదురు చూస్తున్నాడు. `బీస్ట్` తో ఇచ్చిన ప్లాన్ కి స‌రైన స‌మాధానంగా మ‌రో సినిమా చేసి హిట్ ఇవ్వాల‌ని అంతే క‌సితో ఉన్నాడు. ఆ హీరోలిద్ద‌రి ఇమేజ్ కి త‌గ్గ స్టోరీలు రెడీ చేసిపెట్టుకున్నాడు. అయితే జైల‌ర్ రిలీజ్ అయిన కొన్ని నెల‌లు గ‌డుస్తున్నా? ఇంత‌వ‌ర‌కూ కొత్త ప్రాజెక్ట్ ప్ర‌క‌టించ‌లేదు. దీంతో నెల్స‌న్ ఏం చేస్తున్నాడు? అన్న చ‌ర్చ కోలీవుడ్ లో న‌డుస్తోంది.

Read more!

దీంతో నెల్స‌న్ అంద‌ర్నీ స‌ర్ ప్రైజ్ చేస్తూ నిర్మాత‌గా ముందుకొచ్చాడు. `బ్లడీ బెగ్గ‌ర్` అనే టైటిల్ తో ఓ సినిమా నిర్మిస్తున్నాడు. నెల్సన్ ఫిలమెంట్ పిక్చర్స్ అనే కొత్త నిర్మాణ సంస్థను ప్రారంభించాడు. ఈ సంస్థ‌పైనే సినిమా నిర్మిస్తున్నాడు. దీనికి శివబాలన్ దర్శకత్వం వ‌హిస్తున్నాడు. ఇందులో కవిన్ మెయిన్ లీడ్ పోషిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన అధికార‌క ప్ర‌క‌ట‌న నేడు ఇచ్చారు. దీంతో పాటు ఇంట్రెస్టింగ్ ప్రోమోని కూడా రిలీజ్ చేసారు.

క‌విన్ బిచ్చ‌గాడి లుక్ అదిరిపోయింది. మాసిన లుంగీ..మ‌ట్టి ప‌ట్టిన రెండు చొక్కాలు ఒంటిపై ధ‌రించాడు. జుత్తు అంతా చింద‌ర‌వంద‌ర‌గా ఉంది. గెడ్డుకుండా మాసింది. మొడ‌లో తావీదులు..అమాయ‌క‌మైన చూపు...రెండు కాళ్ల మ‌ధ్య‌లో చేతులు పెట్టుకుని దీనంగా చూస్తోన్న వైనం అచ్చం బెగ్గ‌ర్ నే త‌ల‌పిస్తుంది. ప్ర‌స్తుతం ఆ పోస్ట‌ర్ నెట్టింట వైర‌ల్ గా మారింది. `బిచ్చ‌గాడు` టైటిల్ తో ఇప్ప‌టికే విజ‌య్ ఆంటోనీ ఓ సినిమా చేసిన సంగ‌తి తెలిసిందే. ఈసినిమా తెలుగు..త‌మిళ్ లో పెద్ద విజ‌యం సాధించింది. ఆసినిమాతో విజ‌య్ మార్కెట్ రెట్టింపు అయింది. న‌టుడిగా ప్ర‌త్యేక‌మైన గుర్తింపును ఆ సినిమా తీసుకొచ్చింది. తాజాగా క‌విన్ `బ్ల‌డీ బెగ్గ‌ర్` అంటూ మ‌రో ప్ర‌యోగం తో ప్రేక్ష‌కుల ముందుకొస్తున్నాడు.

Tags:    

Similar News