ఫోటో స్టోరి: జాక్విలిన్ కాదు నాట్య మ‌యూరి

జాక్విలిన్ రొటీన్ గ్లామ్ లుక్ తో పోలిస్తే ఇది వైవిధ్య‌మైన‌ది. ఆ మోములో అంద‌మైన న‌వ్వు, అభిన‌యం ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ‌గా నిలిచాయి.;

Update: 2025-06-08 16:30 GMT

జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ఇటీవల కాలంలో ఎక్క‌వ‌గా వివాదాల‌తో ప్ర‌చారంలోకి వ‌చ్చింది. కాన్ మేన్ సుకేష్ చంద్ర‌శేఖ‌ర్ తో స్నేహం కార‌ణంగా మ‌ర‌క అంటింది. అయినా జాకీ నిరుత్సాహ‌ప‌డ‌కుండా ఇటీవ‌ల త‌న‌ కెరీర్ పైనే పూర్తిగా ఫోక‌స్ చేస్తోంది. ఉత్త‌రాది ద‌క్షిణాది భాషల్లో ప్రత్యేక గీతాలలో కనిపించిన జాక్విలిన్ ఇటీవ‌ల‌ 'హౌస్‌ఫుల్ 5'లో ఒక ముఖ్యమైన పాత్రలో న‌టించింది. జాకీని పూర్తి స్థాయి పాత్రలో మళ్ళీ చూడాలని ఆసక్తిగా ఉన్న అభిమానులకు ట్రీట్ దొరికింది. కానీ 'హౌస్ ఫుల్ 5' ఫ్రాంఛైజీలో చెత్త అడ‌ల్ట్ సినిమా అన్న నెగెటివ్ టాక్ వినిపిస్తోంది.

 

సినిమా ఫ‌లితం ఎలా ఉన్నా జాక్విలిన్ లో జోష్ మాత్రం త‌గ్గ‌లేదు. య‌థావిథిగానే ఈ బ్యూటీ నిరంత‌రం త‌న ఇన్ స్టాలో ఫోటో ట్రీట్ తో అభిమానుల‌కు ట‌చ్ లో ఉంది. తాజాగా జాక్విలిన్ షేర్ చేసిన ట్రెడిష‌న‌ల్ లుక్ ఇంట‌ర్నెట్ లో వైర‌ల్ గా మారుతోంది. న‌గ‌రానికి నాట్యం చేయ‌డానికి వ‌చ్చిన మ‌యూరంలా క‌నిపించింది జాకీ. ఫోటోషూట్ కోసం అద్భుత‌మైన నాట్య భంగిమ‌ల‌ను ప్ర‌ద‌ర్శించింది. ఆరెంజ్ క‌ల‌ర్ డిజైన‌ర్ బ్లౌజ్ ని ఛ‌మ్కీల‌తో ఎంతో అందంగా తీర్చిదిద్దగా, బాటమ్ లో బ్రింజాల్ ప‌రికిణీ ఎంతో అద్భుతంగా జ‌త కుదిరింది.

 

జాక్విలిన్ రొటీన్ గ్లామ్ లుక్ తో పోలిస్తే ఇది వైవిధ్య‌మైన‌ది. ఆ మోములో అంద‌మైన న‌వ్వు, అభిన‌యం ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ‌గా నిలిచాయి. ప్ర‌స్తుతం ఈ స్పెష‌ల్ ఫోటోషూట్ అభిమానుల్లో వైర‌ల్ గా మారుతోంది. బోల్డ్ బ్యూటీ జాక్విలిన్ గొప్ప నృత్య‌కారిణి. 'బ్యాడ్ బోయ్ ..' అంటూ ప్ర‌భాస్ ని టీజ్ చేస్తూ గ్లామ‌ర‌స్ గా స్పెష‌ల్ పాట‌లో న‌ర్తించ‌గ‌ల‌దు. వీలున్న‌ప్పుడ‌ల్లా న‌వ నాట్య మ‌యూరంలా క్లాసిక‌ల్ డ్యాన్స్ తో మెరిపించ‌గ‌ల‌దు! ఈ వైవిధ్య‌మే జాకీకి ఇంకా అవ‌కాశాల్ని అందిస్తోంది. ప్ర‌స్తుతం జాక్విలిన్ ప‌లు అగ్ర నిర్మాణ సంస్థ‌ల‌తో ఒప్పందాలు కుదుర్చుకునే ప‌నిలో ఉంద‌ని తెలిసింది. వివ‌రాలు ప్ర‌క‌టించాల్సి ఉంది.

Tags:    

Similar News