ఇషా అంబానీ 3D గౌన్ తయారీకి 10 వేల గంట‌లు

మెట్ గాలా 2024 సీజ‌న్ ర‌క్తి క‌ట్టిస్తోంది. రెడ్ కార్పెట్ పై బాలీవుడ్ అంద‌గ‌త్తెల హంస న‌డ‌కలు గుబులు పుట్టిస్తున్నాయి.

Update: 2024-05-07 11:08 GMT

మెట్ గాలా 2024 సీజ‌న్ ర‌క్తి క‌ట్టిస్తోంది. రెడ్ కార్పెట్ పై బాలీవుడ్ అంద‌గ‌త్తెల హంస న‌డ‌కలు గుబులు పుట్టిస్తున్నాయి. ఇక ఇదే వేదిక‌పై ప్ర‌పంచంలోనే గొప్ప‌ ధ‌న‌వంతుడైన ముఖేష్ అంబానీ- నీతా అంబానీల కుమార్తె, ఇషా అంబానీ ప్ర‌ద‌ర్శ‌న ఇవ్వాల్సి ఉండ‌గా దీనికోసం ప్ర‌త్యేక‌మైన డిజైన‌ర్ లుక్ ని సిద్ధం చేసారు. ఈ ఏడాది ఆసియ‌న్ ధ‌న‌వంతుని కుమార్తె లుక్ ఎలా ఉండ‌బోతోంది? అన్న ఆస‌క్తి న‌డుమ వైర‌ల్ భ‌యానీ త‌న లుక్ ని షేర్ చేసారు.


ఇషా 2017లో క్రిస్టియన్ డియోర్ గౌనులో అరంగేట్రం చేసారు. ఆ తర్వాత 2019లో ప్రబల్ గౌరుంగ్ రూపొందించిన లిలక్ బాల్ గౌనులో హెడ్ ట‌ర్న‌ర్ గా మారారు. గత సంవత్సరం చీరను త‌ల‌పించే దుస్తులలో త‌నదైన ఎన‌ర్జీ, గ్రేస్‌ని ప్రదర్శించ‌డం అబ్బుర‌ప‌రిచింది. మెట్ గాలా 2024 కోసం భారతీయ డిజైనర్ రాహుల్ మిశ్రా నుండి బంగారు రంగులో ఉన్న పూల చీర గౌనును డిజైన్ చేసారు. ఈ సంవత్సరం మెట్ గాలా థీమ్ ది గార్డెన్ ఆఫ్ టైమ్. ఇషా కోసం రాహుల్ మిశ్రా- అనిత అడ‌జానియా ఒక ప్ర‌త్యేక‌మైన లుక్ ని డిజైన్ చేసారు. కానీ ఈ గౌన్ ని ఇషాజీ ఈవెంట్లో ప్ర‌ద‌ర్శించ‌లేక‌పోయార‌ని కూడా తెలిపారు. ఈసారి ఈవెంట్ ని మిస్స‌య్యార‌ని వెల్ల‌డించారు.

Read more!

అనిత అడ‌జానియా మాట్లాడుతూ-``ఇషా భారతీయ డిజైనర్ రాహుల్ మిశ్రా చేతితో ఎంబ్రాయిడరీ చేసిన కోచర్ చీర గౌను ధరించిన శాంపిల్ ఫోటోషూట్ ఇది. ఈ సంవత్సరం మెట్ గాలా థీమ్ `ది గార్డెన్ ఆఫ్ టైమ్` కోసం లుక్ ఇది. రాహుల్, నేను ప్రకృతి నుంచి స్ఫూర్తి పొంది అద్భుతమైన - ఔదార్యవంతమైన జీవితచక్రాన్ని చీర‌గౌనులో చిత్రీకరించడానికి ప్ర‌య‌త్నించాం. ఇషా కస్టమ్ లుక్ పూర్తి కావడానికి 10,000 గంటల సమయం పట్టింది. ఈ లుక్ రాహుల్ గత సేకరణలలోని అంశాలను చేర్చడం ద్వారా గ్లామ‌ర్‌ను సంతరించుకుంది`` అని అన్నారు.


ఇషా అంబానీ తన చీరను భారీగా అలంకరించిన కార్సెట్ బ్లౌజ్‌తో స్టైలింగ్ చేసారు. ఇషా లుక్ ని రూపొందించడానికి 10,000 గంటలు పట్టింది. భారతీయ హస్తకళాకారుల కృషికి ఇది పరిపూర్ణ నిదర్శనం. ఆరు గజాలలో పువ్వులు, సీతాకోకచిలుకలు, తూనీగలతో సున్నితమైన నమూనాలు ఈ చీర‌లో ఉన్నాయి. అవి ప్రత్యేకమైన అప్లిక్ - ఎంబ్రాయిడరీ పద్ధతుల ద్వారా చక్కగా అలంకర‌ణ‌లో ఇమిడాయి. దుస్తులలో ఫరీషా, జర్దోజీ, నక్షి , దబ్కా, అలంకారాలు.. అలాగే ఫ్రెంచ్ నాట్లు ఉన్నాయి. భారీగా అలంకరించబడిన స్ట్రాప్‌లెస్ టాప్ అద‌న‌పు ఆక‌ర్ష‌ణ‌గా నిలిచింది అని అనిత వ‌ర్ణించారు. వందలాది మంది స్థానిక కళాకారులు, చేనేత కార్మికులకు మద్దతునిస్తూ అనేక భారతీయ గ్రామాలలో రాహుల్ మిశ్రా `అటెలియర్‌`లలో అద్భుతమైన రూపాన్ని చేతితో ఎంబ్రాయిడరీ చేశారు. స్వదేశీ కళాకారులచే రూపొందించిన‌ గౌను మ‌రో ఆక‌ర్ష‌ణ‌. సాంప్రదాయ తామర చేతి కంకణాలు (హాత్‌పోచాస్), చిలుక చెవిపోగులు, విరేన్ భగత్ రూపొందించిన ఫ్లవర్ చోకర్‌ సహా భారీ బంగారు ఉపకరణాలను ఇషా ఎంపిక చేసుకుంది. గ్లామ్ మేకప్, హాఫ్‌-టైడ్ హెయిర్‌డో .. న్యూడ్ లిప్స్ తో ఇషా లుక్ ఒక ఫిలిం స్టార్ ని త‌ల‌పించింది. స్వదేశీ కళాకారులచే రూపొందించిన నకాషి మినియేచర్ పెయింటింగ్‌ల పురాతన భారతీయ కళారూపాలను కలిగి ఉన్న జాడే క్లచ్‌తో ఇషా గౌనును డిజైన్ చేసారు. అయితే దీనిని మెట్ గాలా ఈవెంట్లో ప్ర‌ద‌ర్శించలేక‌పోయార‌ని ఇన్ స్టాలో వైర‌ల్ భ‌యానీ వెల్ల‌డించారు. ఇషాజీ ఈవెంట్ కి అనుకోని ప‌రిస్థితుల్లో హాజ‌రు కాలేక‌పోతున్నార‌ని తెలిపారు.

Tags:    

Similar News