ఇండియన్ సినిమా గేమ్ ఛేంజర్స్!
ప్రతి ముప్పై సంవత్సరాలకు బతుకు తాలూకా ఆలోచన మారుతూ ఉంటుంది. సినిమా వాళ్లు దాన్ని ట్రెండ్ అంటారు.;
ప్రతి ముప్పై సంవత్సరాలకు బతుకు తాలూకా ఆలోచన మారుతూ ఉంటుంది. సినిమా వాళ్లు దాన్ని ట్రెండ్ అంటారు. వ్యాపార వేత్తలు ఫ్యాషన్ అంటారు. రాజకీయ నాయకులు తరం అంటారు. మామూలు జనం జనరేషన్ అంటారు. కాని ప్రతి జనరేషన్‌లోనూ ఓ కొత్త థాట్‌ని ముందుకు తీసుకువెళ్లే వాడు మాత్రం ఒక్కడే ఉంటాడు.. వాడే టార్చ్ బేరర్`... `అరవింద సమేత`లో ఎన్టీఆర్ క్యారెక్టర్‌ని ఉద్దేశించి రావురమేష్ చెప్పిన డైలాగ్ ఇది. ఈ డైలాగ్
సంచలన డైరెక్టర్స్ రామ్ గోపాల్‌వర్మ, సందీప్‌రెడ్డి వంగ, రాజమౌళి, ఆదిత్యధర్‌లకు కరెక్ట్‌గా సరిపోతుంది.
ఇండియన్ సినిమాల్లో విప్లవాత్మకమైన మార్పులకు వివిధ దశల్లో వీరు శ్రీకారం చుట్టారు. ఇండియన్ సినిమా గేమ్ ఛేంజర్స్‌గా అయ్యారు. 1989 వరకు భారతీయ సినిమా మేకింగ్, టేకింగ్ ఓ పంథాను అనుసరించేది. హీరో క్యారెక్టరైజేషన్ కూడా రొటీన్‌గానే సాగేది. అలా దశబ్దాల కాలం పాటు పాత పద్దతుల్లోనే సాగిన సినిమా మేకింగ్, టేకింగ్‌ని ఉన్నపలంగా మార్చి సరికొత్త ట్రెండ్‌కు శ్రీకారం చుట్టిన మూవీ `శివ`. రామ్ గోపాల్ వర్మ డైరెక్టర్‌గా పరిచయమైన ఈ సినిమా అప్పట్లో తెలుగు సినిమా స్వరూపాన్నే మార్చేసి సంచలనం సృష్టించింది.
ఆ తరువాత మేకింగ్, హీరోయిజంలో విప్లవాత్మక మార్పులొచ్చాయి. `శివ` విడుదలైన 26 ఏళ్లకు మళ్లీ సినిమా మేకింగ్‌లో పెను సంచలనం సృష్టించింది ఎస్.ఎస్. రాజమౌళి. ప్రభాస్ హీరోగా జక్కన్న తెరకెక్కించిన `బాహుబలి` ఇండియన్ సినిమాల్లో ఓ గేమ్ ఛేంజర్. పాన్ ఇండియా సినిమాలకు ఇది ఆద్యం పోసింది. అంత వరకు 20 నుంచి 30 కోట్ల బడ్జెట్ సినిమాలు చేయడానికే మేకర్స్ భయపడుతున్న వేళ రూ.180 కోట్ల బడ్జెట్.. మూడేళ్ల మేకింగ్ టైమ్ తీసుకుని బాక్సాఫీస్ వద్ద సరికొత్త వసూళ్లని రాబట్టి పాన్ ఇండియా సినిమాలకు ఊతమిచ్చింది.
రెండేళ్ల తరువాత వచ్చిన పార్ట్ 2 ఇండియన్ బాక్సాఫీస్ వద్ద మరింత ఇంపాక్ట్‌ని కలిగించి ఏకంగా రూ.1800 కోట్లకు పైగా వసూళ్లని రాబట్టి సరికొత్త రికార్డుని క్రియేట్ చేసింది. ఇదే సమయంలో సందీప్‌రెడ్డి వంగ, విజయ్‌దేవరకొండ చేసిన సినిమా `అర్జున్‌రెడ్డి`. హీరో క్యారెక్టరైజేషన్, సినిమా మేకింగ్, కథను నడిపించే తీరుతో పాటు మూడున్నర గంటల నిడివి.. ఇంటర్వెల్ బ్యాంగ్.. ఇలా ప్రతీ విషయంలోనూ ఈ సినిమా పాథ్‌బ్రేకింగ్ ఫిల్మ్‌గా నిలిచి చరిత్ర సృష్టించింది. ఇండియన్ సినిమాల్లో సరికొత్త ట్రెండ్‌కు నాంది పలికింది.
అర్జున్‌రెడ్డి రీమేక్‌తో బాలీవుడ్‌లోకి ప్రవేశించిన సందీప్‌రెడ్డి వంగ ఈ సినిమాతో సంచలనాలు సృష్టించడమే కాకుండా బాలీవుడ్ హీరోల దృష్టిని ఆకర్షించాడు. రీసెంట్‌గా రణ్‌బీర్ కపూర్‌తో చేసిన `యానిమల్` హీరో క్యారెక్టర్, కంటెంట్ విషయంలో చర్చకు దారి తీయడం తెలిసిందే. రామ్ గోపాల్‌వర్మ, సందీప్‌రెడ్డి వంగ, రాజమౌళి వంటి దర్శకులు ఇండియన్ సినిమా స్వరూపాన్నే మార్చేస్తే తాజాగా ఆదిత్యధర్ అంతకు మించి అన్నట్టుగా సరికొత్త మార్పులకు శ్రీకారం చుట్టడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.
తను డైరెక్ట్ చేసిన `ధురంధర్` బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తూ రికార్డు స్థాయి వసూళ్లని రాబడుతోంది. రణ్‌వీర్ సింగ్ హీరోగా స్పై యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ మూవీ రియలిస్టిక్ ఇన్సిడెంట్స్‌తో రియలిస్టిక్ అప్రోచ్‌తో రూపొందింది. ఇండియాపై పాక్ పన్నిన కుయుక్తులు, దానికి `ధురంధర్` పేరుతో రా చేసిన విరుగుడు ఆపరేషన్ సినిమాని వరల్డ్ వైడ్‌గా హాట్ టాపిక్‌గా మార్చింది. అంతే కాకుండా సినిమా మేకింగ్‌లోనూ ఇండియన్ సినిమాల్లో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టింది. ఒక సినిమాని రిసీస్ తరహాలో కూడా తీసి బ్లాక్ బస్టర్ చేయొచ్చని దర్శకుడు ఆదిత్యధర్ ఈ మూవీతో నిరూపించి ఇండియన్ సినిమాకు గేమ్ ఛేంజర్‌గా నిలవడం విశేషం.