• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ప్రభాస్ మూవీ.. ఈ పిల్లతో...

ప్రభాస్ మూవీ.. ఈ పిల్లతో జాగ్రత్త హను!

| ప్రభాస్ డాన్స్ చేయకపోయిన పర్లేదు మరీ తేలిపోకుండా చూసుకోవాల్సిన బాధ్యత దర్శకుడు హను చేతిలోనే ఉందని ఫ్యాన్స్ అంటున్నారు.

By - Tupaki Desk
Update: 2024-08-18 09:19 GMT

పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమాని శనివారం గ్రాండ్ గా లాంచ్ చేశారు. మైత్రీ మూవీ మేకర్స్, టి-సిరీస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించబోతోంది. 1940 బ్యాక్ డ్రాప్ లో సెకండ్ వరల్డ్ వార్ కి ముందు జరిగిన కథగా ఈ సినిమా ఉండబోతోంది. “ఫౌజీ” అనే టైటిల్ ని ఈ సినిమాని ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. అయితే అధికారికంగా ఇంకా కన్ఫర్మ్ చేయలేదు. సెప్టెంబర్ నుంచి ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ అవుతుందంట.

ఈ చిత్రంలో బ్రిటిష్ ఇండియన్ ఆర్మీ సోల్జర్ గా ప్రభాస్ కనిపిస్తాడంట. పవర్ ఫుల్ యాక్షన్ సీక్వెన్స్ ఉంటాయనే మాట వినిపిస్తోంది. ఈ సినిమాలో హీరోయిన్ గా ఇమాన్వి ఇస్మాయిల్ అనే అమ్మాయిని హను రాఘవపూడి హీరోయిన్ గా కన్ఫర్మ్ చేశారు. ఈ బ్యూటీకి ఇదే మొదటి చిత్రం. అయితే సోషల్ మీడియాలో తన డాన్స్ వీడియోలతో ఇమాన్వి బాగా పాపులర్ అయ్యింది. మంచి డాన్సర్ గా గుర్తింపు తెచ్చుకుంది. కొరియోగ్రాఫర్ కూడా చేస్తోంది.

ఈ అమ్మాయి డాన్స్ టాలెంట్ కి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. మంచి ఎక్స్ ప్రెషన్స్ తో డాన్స్ పెర్ఫార్మ్ చేస్తూ ఉంటుంది. అయితే ఈ బ్యూటీని హీరోయిన్ గా హను రాఘవపూడి కన్ఫర్మ్ చేయడంతో డార్లింగ్ ఫ్యాన్స్ కొంత టెన్షన్ పడుతున్నారు. ప్రభాస్ హెవీ డాన్సర్ కాదని అందరికి తెలిసిందే. ఏదో చిన్న చిన్న స్టెప్పులతో మ్యానేజ్ చేస్తాడు. ఇమాన్వి డాన్స్, ఎక్స్ ప్రెషన్స్ చూస్తుంటే ప్రభాస్ ని సాంగ్స్ లో డామినేట్ చేసేస్తుందనే అభిప్రాయాన్ని ఫ్యాన్స్ వ్యక్తం చేస్తున్నారు.

ప్రభాస్ డాన్స్ చేయకపోయిన పర్లేదు మరీ తేలిపోకుండా చూసుకోవాల్సిన బాధ్యత దర్శకుడు హను చేతిలోనే ఉందని ఫ్యాన్స్ అంటున్నారు. ఒక స్టార్ హీరో పక్కన కొత్త అమ్మాయిని హీరోయిన్ గా హను రాఘవపూడి ఎంపిక చేశారంటే కచ్చితంగా ఆన్ స్క్రీన్ రొమాన్స్ ని పెర్ఫెక్ట్ గా డిజైన్ చేస్తాడనే అభిప్రాయం ఇండస్ట్రీ వర్గాలలో ఉంది. అయితే ఇప్పటి వరకు హను రాఘవపూడి సినిమాలలో హీరోయిన్స్ పాత్రలన్నీ కూడా హీరోలని పెర్ఫార్మెన్స్ పరంగా డామినేట్ చేసే విధంగానే ఉన్నాయని అభిమానులు గుర్తు చేసుకుంటున్నారు.

ఏది ఏమైనా ఇమాన్వి లాంటి టాలెంటెడ్ యాక్టర్ ప్రభాస్ కి జోడీగా నటించడంపై ఫ్యాన్స్ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. అయితే ఆమె ఎక్కడ తమ అభిమాన హీరోని డామినేట్ చేస్తుందా అనే టెన్షన్ పడుతున్నారు. మరి మొదటి సినిమానే ఇండియన్ నెంబర్ వన్ స్టార్ కి జోడిగా నటిస్తోన్న ఇమాన్వి ఏ స్థాయిలో “ఫౌజీ”తో మెప్పిస్తుందనేది వేచి చూడాలి.

Appudu loop lo chuse vadini ee video....expressions baga istadi and dance kuda ....#ImanEsmail ee song popular aindhe ee reel valla 😍.....ippudu #Prabhas Anna pakkana chance kottavu waiting 🔥❤️#Fauji @hanurpudi pic.twitter.com/VvhCzV2F99

— Ramsai (@timesaved1) July 22, 2024
Tags:    
  • Prabhas 
  • Imanviesmail 
  • Actress 
  • Hanuraghavapudi 
  • Telugucinema 
  • Mythrimoviemakers 
  • Filmindustry 
  • Fauji 
  • Darlingfans 

Similar News

తెరపై గ్లామర్ క్వీన్..తెరవెనుక మాత్రం కంప్లీట్ హోమ్‌బాడీ!

2026-11-03 12:30 GMT

ట్రైలర్ టాక్: ఈఎన్ఈ గ్యాంగ్ మరో రచ్చ

2026-11-03 11:30 GMT

ఆ ఒక్కటి సరిదిద్దుకుంటే ఇక సాయి పల్లవికి లోటు లేనట్టే..!

2026-11-03 11:30 GMT

కాస్ట్యూమ్ తో కాదు కాస్ట్ తో ఆశ్చర్యపరిచిన కరీనాకపూర్!

2026-11-03 11:05 GMT

5 కోట్లు ఇస్తావా చస్తావా? హీరో కం నిర్మాత‌ను బెదిరించిన గ్యాంగ్ స్ట‌ర్!

2026-11-03 11:02 GMT

జీవన్ స్పీచ్.. తరుణ్ భాస్కర్‌కే షాక్ ఇచ్చేలా!

2026-11-03 11:02 GMT

ఎవరూ ఊహించని రీతిలో ప్రమోషన్ మొదలుపెట్టిన నయనతార!

2026-11-03 11:00 GMT

'ఈ అమ్మాయి హీరోయిన్ అయితే చేయనని అగ్రిమెంట్‌'

2026-11-03 10:59 GMT

కమిటీ కుర్రోడికి.. ఈసారి పెద్ద ఛాన్స్!

2026-11-03 10:30 GMT

బిగ్ బాస్ తెలుగు 10కు గట్టి పోటీనిస్తున్న ‘ది ట్రైటర్స్ తెలుగు’!

2026-11-03 09:54 GMT

Tupaki Exclusive: డార్క్ చాక్లెట్ సినిమా వెనుక ఆసక్తికర విశేషాలు!

2026-11-03 09:45 GMT

గోవా నైట్‌లో దివి అందాల సందడి.. స్టైల్‌కు ఫ్యాన్స్ ఫిదా!

2026-11-03 09:35 GMT

Copyright @2026

Powered by Blink CMS