ఆమె తీపి గుళిక‌.. ప్రియురాలిపై యువ‌హీరో

తాజాగా ఫిల్మ్‌ఫేర్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పాలక్‌తో డేటింగ్ పుకార్ల గురించి ఇబ్ర‌హీం ఓపెన్ అయ్యాడు. పాల‌క్ మంచి స్నేహితురాలు.. స్వీట్ గా ఉంటుంది.. అంతే! అని అన్నాడు.;

Update: 2025-04-18 02:30 GMT

టాలీవుడ్ లో వ‌రుస చిత్రాల్లో న‌టిస్తున్న‌ ప్ర‌ముఖ బాలీవుడ్ న‌టుడు సైఫ్ అలీఖాన్, ఇటీవ‌ల త‌న‌యుడి సినీరంగ ప్ర‌వేశంపైనా దృష్టి సారించిన సంగ‌తి తెలిసిందే. న‌ట‌వార‌సుడు ఇబ్ర‌హీం అలీఖాన్ 'నాదానియన్' చిత్రంతో తన నట జీవితాన్ని ప్రారంభించాడు. ఇది విమర్శకులు, ప్రేక్షకులను కూడా ఆకట్టుకోలేకపోయింది. ఇబ్రహీం నటనకు కూడా సానుకూల సమీక్షలు రాలేదు. కానీ సినిమా విడుదలకు ముందే ఇబ్రహీం ర‌క‌ర‌కాల‌ కారణాలతో హెడ్ లైన్స్‌లోకి వచ్చాడు. వాటిలో ఒకటి పాలక్ తివారీతో అతడి ప్రేమాయ‌ణం. ఇద్దరూ క‌లిసి చాలాసార్లు ఫోటోల‌కు ఫోజులిచ్చారు. క‌లిసి మెలిసి ఉండ‌టంపై చాలా పుకార్లు ఉన్నాయి. ఈ జంట‌ కలిసి వెకేష‌న్స్ కోసం మాల్దీవులకు వెళ్లారని కూడా పుకార్లు వచ్చాయి.

తాజాగా ఫిల్మ్‌ఫేర్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పాలక్‌తో డేటింగ్ పుకార్ల గురించి ఇబ్ర‌హీం ఓపెన్ అయ్యాడు. పాల‌క్ మంచి స్నేహితురాలు.. స్వీట్ గా ఉంటుంది.. అంతే! అని అన్నాడు. కాబట్టి పాలక్ కేవలం 'మంచి స్నేహితురాలు' అని ఇబ్రహీం స్పష్టంగా చెప్పేసాడు. ఇది కేవ‌లం స్నేహ‌మేనా కాదా? అన్న‌దానికి కాల‌మే స‌మాధానం చెబుతుంది.

త‌దుప‌రి ఇబ్రహీం 'సర్జమీన్‌' అనే చిత్రంలో న‌టిస్తున్నాడు. ఇందులో కాజోల్, పృథ్వీరాజ్ సుకుమారన్ కూడా ప్రధాన పాత్రలో నటించారు. ఈ సినిమా షూటింగ్ పూర్తయినట్లు వార్తలు వచ్చాయి కానీ విడుదల తేదీ ఇంకా ప్రకటించలేదు. నాదానియన్ సినిమాలో ఇబ్రహీం నటనతో ఆకట్టుకోలేకపోయినా.. తదుపరి అత‌డి ప‌రివ‌ర్త‌న గురించి ఫ్యాన్స్ ఆస‌క్తిగా వేచి చూస్తున్నారు. పాలక్ తివారీ తదుపరి 'ది భూత్నీ' అనే చిత్రంలో కనిపిస్తారు. ఈ చిత్రం ఏప్రిల్ 18న విడుదల కావాల్సి ఉన్నా కానీ 1 మే 2025కి వాయిదా పడింది.

Tags:    

Similar News