సైఫ్ కొడుకుకే కష్టాలా? బాలీవుడ్‌లో షాకింగ్ రియాలిటీ!
బాలీవుడ్‌లో స్టార్ కిడ్స్ ఎంట్రీ అంటే ఒకప్పుడు సక్సెస్‌కు షార్ట్‌కట్‌గా భావించేవారు. కానీ తాజా పరిణామాలు చూస్తుంటే ఆ ఫార్ములా ఇక పనిచేయడం లేదన్న అభిప్రాయం బలపడుతోంది.;
బాలీవుడ్‌లో స్టార్ కిడ్స్ ఎంట్రీ అంటే ఒకప్పుడు సక్సెస్‌కు షార్ట్‌కట్‌గా భావించేవారు. కానీ తాజా పరిణామాలు చూస్తుంటే ఆ ఫార్ములా ఇక పనిచేయడం లేదన్న అభిప్రాయం బలపడుతోంది. ముఖ్యంగా ఇబ్రహీం అలీ ఖాన్ కెరీర్ ప్రారంభ దశలో ఎదుర్కొంటున్న సవాళ్లు ఈ చర్చను మరింత ముందుకు తెచ్చాయి. సైఫ్ అలీ ఖాన్ కొడుకుగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఇబ్రహీంకు సహజంగానే భారీ అంచనాలు నెలకొన్నాయి. స్టార్ ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్, బాలీవుడ్ కనెక్షన్స్.. అతని డెబ్యూకి బాగా ఉపయోగపడ్డాయి. అంతేకాదు, అతని లాంచ్‌ను స్వయంగా కరణ్ జోహార్ లాంటి ప్రముఖ దర్శక నిర్మాత చేపట్టడం మరింత హైప్‌ను సృష్టించింది. ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్ లో వచ్చిన నదానియాన్ అతని డెబ్యూ ప్రాజెక్ట్‌గా నిలిచింది.
అయితే ఆ సినిమాకు ఆశించిన స్థాయి స్పందన రాలేదు. థియేట్రికల్ రిలీజ్ కాకుండా ఓటీటీలో రిలీజవడం, మొదటి సినిమాతో ఇబ్రహీం ఆడియన్స్ ను ఇంప్రెస్ చేయలేకపోవడం అతని కెరీర్‌పై ప్రశ్నలను లేవనెత్తింది. ఆ తరువాత వచ్చిన సర్జమీన్ కూడా ఇదే దారిలో నడవడం గమనార్హం. దీంతో స్టార్ కిడ్ అయిన ఇబ్రహీంకు స్ట్రగుల్ తప్పేలా లేదనిపిస్తోంది. గతంలో స్టార్ల పిల్లలు మొదటి సినిమాతోనే గుర్తింపు తెచ్చుకునే అవకాశాలు ఎక్కువగా ఉండేవి. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. సోషల్ మీడియా, కంటెంట్ డ్రివెన్ సినిమాలు, ఆడియన్స్ అభిరుచుల మార్పులు.. ఇవన్నీ సినిమా పరిస్థితిని డిసైడ్ చేస్తున్నాయి.
ఇదిలా ఉంటే, కరణ్ జోహార్ తో ఇబ్రహీం మధ్య దూరం పెరిగిందన్న ఊహాగానాలు కూడా ఈ చర్చకు మరింత వేడిని జోడిస్తున్నాయి. ఇబ్రహీంను లాంచ్ చేసిన తర్వాతే వీరిద్దరి రిలేషన్‌లో మార్పులు వచ్చాయా? లేక వారి కాంబినేషన్ లో వచ్చిన రిజల్ట్స్ ఫలితంగా వారి మధ్య దూరం పెరిగిందా అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అయితే ఈ వార్తల్లో ఎలాంటి ఆధారాలు ఇప్పటివరకు బయటకు రాలేదు.
అదే సమయంలో, ఇబ్రహీం నుంచి వరుసగా వచ్చిన ప్రాజెక్ట్స్ ఆశించిన ఫలితాలు ఇవ్వకపోవడం కూడా బ్యాక్ టు బ్యాక్ ఫెయిల్యూర్ల ఇంపాక్ట్ ను బలపరుస్తోంది. మొదటి రెండు సినిమాలూ మంచ ఇంపాక్ట్ చూపకపోతే, స్టార్ కిడ్‌కైనా కెరీర్‌పై ఒత్తిడి పెరగడం సహజమే. ఇవన్నీ చూస్తుంటే పెద్ద బ్యానర్లో భారీగా లాంఛ్ చేస్తే సక్సెస్ ఖాయమనే ఫార్ములా ఇక పనిచేయడం లేదా? అనే సందేహం కలుగుతుంది. మొత్తానికి, ఇబ్రాహీం అలీ ఖాన్ కెరీర్ ప్రస్తుతం ఒక కీలక మలుపులో నిలిచింది. స్టార్ కిడ్ అనే ట్యాగ్ మొదటి అడుగుగా మాత్రమే ఇచ్చినా, అక్కడి నుంచి ముందుకు వెళ్లడం మాత్రం పూర్తిగా టాలెంట్, అతని స్టోరీల ఎంపిక మరియు ఆడియన్స్ అంగీకారంపై ఆధారపడుతుందనే వాస్తవాన్ని ఈ పరిణామాలు స్పష్టంగా చూపిస్తున్నాయి.