హుషారు 2: కొత్త హీరోతో పెద్ద రిస్క్ వర్కౌట్ అవుతుందా?

టాలీవుడ్‌లో చిన్న సినిమాగా విడుదలై ఊహించని విజయాన్ని అందుకున్న హుషారు మూవీ ఇప్పుడు సీక్వెల్‌తో మళ్లీ వార్తల్లోకి వచ్చింది.;

Update: 2026-04-16 07:48 GMT

టాలీవుడ్‌లో చిన్న సినిమాగా విడుదలై ఊహించని విజయాన్ని అందుకున్న హుషారు మూవీ ఇప్పుడు సీక్వెల్‌తో మళ్లీ వార్తల్లోకి వచ్చింది. అప్పట్లో యూత్‌ఫుల్ కంటెంట్, ఫన్ ఎలిమెంట్స్‌తో బాక్సాఫీస్ వద్ద స్లీపర్ హిట్‌గా నిలిచిన ఈ సినిమా, ఇప్పుడు రెండో భాగంతో మరోసారి అదే మ్యాజిక్‌ను రిపీట్ చేస్తుందా అన్న చర్చ మొదలైంది. సాధారణంగా భారీ సినిమాలకే సీక్వెల్స్ రావడం చూస్తుంటాం. కానీ హుషారు లాంటి చిన్న సినిమా ఫ్రాంచైజ్‌గా మారడం టాలీవుడ్‌లో మారుతున్న ట్రెండ్‌ను ప్రతిబింబిస్తోంది. అయితే, మొదటి భాగం సక్సెస్‌ను సీక్వెల్ ఎంతవరకు క్యాష్ చేసుకుంటుందనేది ఇప్పుడు కీలక ప్రశ్నగా మారింది.

హీరోగా అశోక్ గ‌ల్లా?

ఇక ఈ సీక్వెల్ చుట్టూ ఎక్కువ చర్చకు దారితీసిన అంశం కాస్టింగ్. ఈ సీక్వెల్ కోసం ఒరిజినల్ కాస్ట్‌ను కొనసాగించకుండా, కొత్త హీరోగా అశోక్ గ‌ల్లాను తీసుకోవడం ఆసక్తికర నిర్ణయంగా మారింది. ఇప్పటికే హీరో మూవీతో డీసెంట్ డెబ్యూ అందుకున్న అశోక్ గల్లా, ఇంకా ఒక పెద్ద హిట్ కోసం ఎదురు చూస్తున్నాడు. ఈ నేపథ్యంలో హుషారు2 ఆయన కెరీర్‌లో టర్నింగ్ పాయింట్ అవుతుందా అన్న అంచనాలు పెరుగుతున్నాయి. ఒకవైపు ఫ్రెష్ ఫేస్‌తో ఫ్రాంచైజ్‌కు కొత్త ఎనర్జీ వచ్చే అవకాశం ఉండగా, మరోవైపు ఒరిజినల్ ఫీల్ మిస్ అవుతుందా అన్న సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఈ రిస్క్ ఫ్యాక్టర్ సినిమాపై మ‌రింత హైప్‌ను పెంచుతోంది.

మొద‌టి భాగం డైరెక్ట‌ర్‌తోనే!

హుషారు సినిమాను డైరెక్ట్ చేసిన శ్రీ హ‌ర్ష కొనుగంటి ఈ ప్రాజెక్టు ను హ్యాండిల్ చేయ‌నున్నారు. మొదటి భాగంలో యూత్ కనెక్ట్‌ను బాగా క్యాచ్ చేసిన ఆయన, ఇప్పుడ‌దే మ్యాజిక్‌ను రిపీట్ చేస్తారా అన్నదే ఆసక్తికర అంశం. ముఖ్యంగా హుషారు సినిమాలో మ్యూజిక్, ఫన్ ఎలిమెంట్స్ కీలక పాత్ర పోషించాయి. సాంగ్స్, ఫ్రెండ్‌షిప్ మూమెంట్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. అందుకే సీక్వెల్‌లో కూడా అదే ఎనర్జీ కొనసాగుతుందా లేక కొత్తగా ఏదైనా ప్రయోగం చేస్తారా అన్నది చూడాలి.

ఇక మార్కెట్ పరంగా చూస్తే, చిన్న సినిమాగా మొదలైన ఈ బ్రాండ్ ఇప్పుడు ఎలా పొజిషన్ అవుతుందనేది కీలకం. ప్రస్తుతం టాలీవుడ్‌లో సీక్వెల్స్ ట్రెండ్ పెరుగుతోంది. పెద్ద సినిమాలే కాదు, చిన్న సినిమాలు కూడా ఇప్పుడు ఫ్రాంచైజ్‌లుగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో హుషారు2 థియేట్రికల్ రిలీజ్‌పైనే దృష్టి పెడుతుందా, లేక OTT స్ట్రాటజీని కూడా ఉపయోగించుకుంటుందా అన్నది ఆసక్తికరంగా మారింది. మొత్తానికి, స్లీపర్ హిట్‌గా మొదలైన హుషారు ఇప్పుడు ఫ్రాంచైజ్‌గా మారి కొత్త దిశలో అడుగులు వేస్తుండగా, ఈ సీక్వెల్ నిజంగా ఆ అంచనాలను అందుకుంటుందా లేదో చూడాలి.

Tags:    

Similar News