హిట్‌ కావడం వల్లే విమర్శలు చేస్తున్నారట!

తాజాగా దర్శకుడు తరుణ్ మన్సుఖాని విమర్శలపై స్పందించాడు.;

Update: 2025-06-13 13:06 GMT

బాలీవుడ్‌ని వరుస ఫ్లాప్స్ ఇబ్బందులు పెడుతున్న సమయంలో వచ్చిన 'హౌస్‌ఫుల్‌ 5' సినిమా పాజిటివ్ రెస్పాన్స్ దక్కించుకుంది. హౌస్‌ఫుల్‌ ప్రాంచైజీలో ఇప్పటి వరకు వచ్చిన నాలుగు సినిమాలు వినోదాన్ని అందించి ఆకట్టుకున్నాయి. హిట్‌ ప్రాంచైజీ కావడంతో మొదటి నుంచి అంచనాలు ఉన్నాయి. అంచనాలకు తగ్గకుండా సినిమాను దర్శకుడు రూపొందించాడు. సినిమాలో భారీ తారాగణం ఉండటంతో కాస్త గందరగోళం క్రియేట్‌ అయిందనే రివ్యూలు వచ్చాయి. అయితే సినిమాలో వినోదం మాత్రం తగ్గలేదు అనేది విశ్లేషకుల అభిప్రాయం. ఇదే సమయంలో సినిమా చుట్టూ వివాదం రాజుకుంటుంది. సెన్సార్‌ బోర్డ్‌ తీరును సైతం కొందరు విమర్శిస్తున్నారు.

హౌస్‌ఫుల్‌ ప్రాంచైజీ అంటేనే అడల్ట్‌ కంటెంట్‌ ఉంటుందని, డబుల్‌ మీనింగ్ డైలాగ్స్ తో కామెడీ ఉంటుందని అంటారు. అయితే ఈ ప్రాంచైజీ లో అవి శృతి మించాయి. హద్దులు దాటిన వ్యంగ్యం, మితిమీరిన డబుల్‌ మీనిండ్‌ డైలాగ్స్‌, కొన్ని అడల్ట్‌ సీన్స్ కారణంగా ప్రేక్షకులు ఇబ్బంది పడుతున్నారు. ఈ సినిమాకు సెన్సార్‌ బోర్డ్‌ నుంచి యూ/ఎ సర్టిఫికెట్‌ వచ్చింది. ఇలాంటి కంటెంట్ ఉన్న సినిమాకు సెన్సార్‌ బోర్డ్‌ ఏ కాకుండా యూ/ఏ సర్టిఫికెట్‌ ఇవ్వడం చాలా విడ్డూరంగా ఉందంటూ చాలా మంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి బూతు సినిమాలు తీసి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ అంటూ ప్రచారం చేయడం ఏంటంటూ చాలా మంది ట్రోల్స్ చేస్తున్నారు.

తాజాగా దర్శకుడు తరుణ్ మన్సుఖాని విమర్శలపై స్పందించాడు. సినిమాలో మ్యాటర్‌ లేనప్పుడు ఎవరూ పట్టించుకోరు, ఎప్పుడైతే సినిమా హిట్ అవుతుందో, ఎప్పుడైతే సినిమాకు ప్రేక్షకుల ఆధరణ లభిస్తుందో అప్పుడు విమర్శలు చేయడం మొదలు పెడతారు, వివాదాల్లోకి లాగడానికి ప్రయత్నిస్తారు. ప్రస్తుతం హౌస్‌ఫుల్‌ 5 కి కూడా అదే జరుగుతుంది అన్నారు. సినిమాకు జనాల నుంచి మంచి స్పందన దక్కింది. రివ్యూలు కూడా పాజిటివ్‌గా వచ్చాయి. అందుకు తగ్గట్లుగానే వసూళ్లు నమోదు అవుతున్నాయి. ఇక ఇతర విమర్శలు అన్నీ కూడా మేము స్వీకరిస్తాం. సినిమాకు వచ్చిన స్పందన అన్నింటిని మేము పరిగణలోకి తీసుకుంటాం.

ఒక సినిమాను చూసిన ప్రేక్షకుడికి తన అభిప్రాయం వ్యక్తం చేసే అర్హత ఉంటుంది. అందుకే మేము వారి అభిప్రాయాన్ని గౌరవిస్తాం. అదే సమయంలో అనవసర విమర్శల గురించి ఎక్కువగా ఆలోచించమని చెప్పుకొచ్చాడు. వస్తున్న కలెక్షన్స్‌ను బట్టి సినిమాను ప్రేక్షకులు ఆధరిస్తున్నారు, వారి ఆభిమానం, ఆధరణ దక్కినందుకు సంతోషంగా ఉందని దర్శకుడు చెప్పుకొచ్చాడు. ప్రేక్షకుల నుంచి వస్తున్న స్పందన చూస్తూ ఉంటే సంతోషంగా ఉందని, ముందు ముందు మరిన్ని ఇలాంటి వినోదాత్మక సినిమాలు తీయాలనే ప్రేరణ కలుగుతుందని సన్నిహితుల వద్ద తరుణ్ మన్సుఖాని అన్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో అక్షయ్‌ కుమార్‌ ప్రధాన పాత్రలో నటించగా అభిషేక్ బచ్చన్ , రితేష్ దేశ్ముఖ్ , సంజయ్ దత్ , ఫర్దీన్ ఖాన్ , శ్రేయాస్ తల్పాడే , నానా పటేకర్ , జాకీ ష్రాఫ్ , డినో మోరియా , జాక్వెలిన్ ఫెర్నాండెజ్ , నర్గీస్ ఫఖ్రీ , చిత్రాంగద సింగ్ , సోనమ్ బజ్వా , సౌందర్య శర్మ , చుంకీ పాండే , నికితిన్ ధీర్, జానీ లివర్ తదితరులు ముఖ్య పాత్రల్లో కనిపించారు.

Tags:    

Similar News