`పుష్ప 2` చూసి నేర్చుకోమన్నది ఇందుకే!
వినోద పరిశ్రమ వింత వ్యామోహంతో ఉంది. ముఖ్యంగా బాలీవుడ్ పై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నా, ఇప్పటికీ పాత మూస విధానానికే అంకితమైంది.;
వినోద పరిశ్రమ వింత వ్యామోహంతో ఉంది. ముఖ్యంగా బాలీవుడ్ పై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నా, ఇప్పటికీ పాత మూస విధానానికే అంకితమైంది. ఇటీవల విడుదలైన `హౌస్ ఫుల్ 5` దీనికి ఫక్తు ఉదాహరణ అని విమర్శిస్తున్నారు. స్త్రీల అందాలను ఎక్స్ పోజ్ చేయడం, గ్లామ్ షోలను హైలైట్ చేయడం, బూతు డైలాగులు చెప్పించడంతో షోని నడిపించడం తీవ్ర విమర్శలకు తావిస్తోంది.
ముఖ్యంగా ఈ సినిమాలో ఐదుగురు అందాల భామలు కథానాయికలుగా నటించారు. వీళ్లలో సౌందర్య శర్మ పాత్ర ప్రత్యేకమైనది. కానీ ఈ భామను కనీసం డైలాగ్ అన్నదే లేకుండా కేవలం గ్లామర్ షో కోసం పరిమితం చేసి, హీరోలు ఆమె అందాలను తాకుతుంటే థియేటర్లలో ప్రేక్షకులు ఆస్వాధించాలి! అన్నట్టు డైరెక్టర్ కొన్ని సీన్లను క్రియేట్ చేసాడని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ప్రపంచీకరణలో ఎవరు ఎప్పుడు ఏ వస్తువును ఎలా అయినా అమ్ముకోవచ్చు! అనే సిద్ధాంతం ప్రకారం.. ఇప్పుడు స్త్రీ అందాలను ఇలా గ్లామ్ షోతో అమ్మేయాలనుకోవడం సరికాదని సాంప్రదాయవాదులు విమర్శిస్తున్నారు. ముఖ్యంగా సౌందర్య శర్మను ఒక వస్తువులా చూపించారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ చిత్రంలో నటించిన గ్లామ్ డాళ్స్ జాక్విలిన్ ఫెర్నాండెజ్, నర్గీస్ ఫక్రీ, సోనమ్ బజ్వా కూడా ఇదే విధంగా హద్దు మీరి బూతు షో చేసారు.
హౌస్‌ఫుల్ 5 వినోదభరితమైన ఫ్యామిలీ డ్రామాగా ప్రమోట్ చేసారు. కానీ ఇలాంటి చెత్త ట్రిక్కులు ప్లే చేయడం ద్వారా విమర్శల్ని ఎదుర్కొంటున్నారు. తరుణ్ మన్షుఖానీ దర్శకత్వంపై తీవ్ర విమర్శలొచ్చాయి. ముఖ్యంగా అసభ్యకరంగా చూపించాడని విమర్శిస్తున్నారు. కామెడీ పేరుతో గ్రాండ్ మస్తీ తరహాలో దీనిని బూతు సినిమాగా తీయడంపై విమర్శలొస్తున్నాయి.
బాలీవుడ్ మారలేదని ఇంతకుముందు సీనియర్ నటుడు, శక్తిమాన్ ఫేం ముఖేష్ ఖన్నా బాలీవుడ్ ని తీవ్రంగా విమర్శించాడు. పుష్ప 2లో ఆలు మగల మధ్య మోటు సరసాన్ని కూడా ఎంతో అందంగా హుందాగా చూపించారని, బాలీవుడ్ వాళ్లు ఈ సినిమా చూసి నేర్చుకోవాలని సూచించారు. హిందీ చిత్రసీమలో కథానాయికతో రొమాన్స్ అనగానే హద్దు మీరి చెలరేగిపోతారని విమర్శించాడు. ఇప్పుడు హౌస్ ఫుల్ 5 సినిమా చూసి వస్తే ముఖేష్ జీ ఏమంటారో?