డ్రగ్స్ కేసు.. హీరో నవదీప్ కి చిక్కులు..!

అయితే, తాజాగా నవదీప్ ఇంట్లో నర్కోటిక్ అధికారులు సోదాలు చేశారు.. రీసెంట్ గా జరిపిన పోలీస్ రెయిడ్స్ లో రామ్ చంద్ అనే వ్యక్తి పట్టబడ్డాడు.

Update: 2023-09-19 08:00 GMT

డ్రగ్స్ కేసు మరోసారి టాలీవుడ్ లో కలకలం రేపింది. ఇప్పటికే చాలా సార్లు ఈ డ్రగ్స్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. చాలా మంది టాలీవుడ్ స్టార్స్ ని విచారించిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే, తాజాగా మరోసారి ఈ టాపిక్ రావడం గమనార్హం. మాదాపూర్ డ్రగ్స్ కేసులో తాజాగా టాలీవుడ్ హీరో నవదీప్ పేరు ఎక్కువగా వినపడుతోంది. ఆయనను పోలీసులు నిందితుడిగా పేర్కొన్నారు. ఆయన పరారీలో ఉన్నారంటూ కూడా వార్తలు వచ్చాయి. అయితే, తాను ఎక్కడికి పారిపోలేదు అని నవదీప్ క్లారిటీ కూడా ఇచ్చారు.

అయితే, తాజాగా నవదీప్ ఇంట్లో నర్కోటిక్ అధికారులు సోదాలు చేశారు.. రీసెంట్ గా జరిపిన పోలీస్ రెయిడ్స్ లో రామ్ చంద్ అనే వ్యక్తి పట్టబడ్డాడు. దీంతో, ఆయన ఇచ్చిన వాంగ్మూలంలో నవదీప్ పేరు చెప్పినట్లు తెలుస్తోంది. నవదీప్ తనతో కలిసి డ్రగ్స్ సేవించాడు అంటూ రామ్ చంద్ పోలీసులకు చెప్పాడు. దీంతో, తెలంగాణ నార్కోటిక్స్ బ్యూటీ అధికారులు నవదీప్ ను ఈ కేసులో నిందితుడిగా చేర్చారు.

దీనిలో భాగంగానే, సెప్టెంబర్ 16వ తేదీన హైదరాబాద్ నగరంలోని నవదీప్ ఇంట్లో నార్కోటిక్స్ అధికారులు సోదాలు నిర్వహించారు. ఆ సమయంలో నవదీప్ ఇంట్లో లేనట్లు తెలుస్తోంది. అయినప్పటికీ అధికారులు వారి సెర్చ్ ఆపరేషన్ కొనసాగించారు. అయితే, ఈ డ్రగ్స్ వ్యవహారంలో పోలీసులు తనను అరెస్టు చేయకుండా ఉండేందుకు ముందుగా నే హైకోర్టును ఆశ్రయించారు.

Read more!

ఆయన విన్నపాన్ని కోర్టు కూడా సానుకూలంగా తీసుకుంది.. నవదీప్ ని అరెస్టు చేయవద్దని కోర్టుకూడా పోలీసులకు చెప్పడం విశేషం. అయితే, నవదీప్ పిటిషన్ కి సంబంధించి నార్కోటిక్ బ్యూరో అధికారులు కౌంటర్ పిటిషన్ దాఖలు చేయాలని అనుకుంటున్నారట.

ఇదిలా ఉండగా, గత నెల ఆగస్టు 31వ తేదీన మాదాపూర్ లోని ఫ్రెష్ లివింగ్ అపార్ట్మెంట్ లో ఓ పార్టీ జరిగింది. ఆ పార్టీలో డ్రగ్స్ వాడినట్లు పోలీసులకు తెలిసింది. దీంతో, వారు దాడులు చేశారు. ఈ దాడుల్లో నార్కోటిక్ అధికారులు దాదాపు 13 మందిని అరెస్టు చేశారు. నవదీప్ ని కూడా అరెస్టు చేసి, ఆయనను విచారించాలని అధికారులు భావిస్తున్నట్లు సమాచారం.

Tags:    

Similar News