ఆ విషయంలో సానుకూల ఫలితం కోసం ఎదురుచూస్తున్నా
హేరా ఫేరీ ఫ్రాంచైజ్ ఎంత పాపులరైందో తెలిసిందే. ఈ బ్లాక్ బస్టర్ ఫ్రాంచైజ్ నుంచి తప్పుకుంటున్నట్టు సీనియర్ నటుడు పరేష్ రావల్ ప్రకటించిన విషయం అందరికీ తెలుసు.;
హేరా ఫేరీ ఫ్రాంచైజ్ ఎంత పాపులరైందో తెలిసిందే. ఈ బ్లాక్ బస్టర్ ఫ్రాంచైజ్ నుంచి తప్పుకుంటున్నట్టు సీనియర్ నటుడు పరేష్ రావల్ ప్రకటించిన విషయం అందరికీ తెలుసు. ఈ సిరీస్‌లో బాబూరావూ గణపత్రావ్ పాత్రలో పరేష్ రావల్ నటించాడు. కథలో ఎంతో కీలకమైన పాత్ర ఆయనది. ఇప్పటికే హేరా ఫేరి రెండు సిరీస్ లు రాగా ఇప్పుడు హేరా ఫేరి మూడో భాగానికి రెడీ అవుతుంది.
ఇలాంటి టైమ్ లో సినిమా నుంచి తాను నిష్క్రమిస్తున్నట్టు చెప్పి అందరికీ షాకిచ్చాడు పరేష్ రావల్. దీంతో ఏం చేయాలో పాలుపోని పరిస్థితుల్లో నిర్మాత అక్షయ్ కుమార్ టీమ్, పరేష్ రావల్ పై కోర్టులో రూ.25 కోట్ల నష్ట పరిహారం కింద దావా వేయడం చర్చనీయాంశమైంది. అయితే పరేష్ రావల్ ఈ సినిమా నుంచి తప్పుకోవడానికి గల అసలు కారణమేంటనేది మాత్రం ఇప్పటికీ తెలియదు.
అక్షయ్ కుమార్ పరువు నష్టం దావా వేయగా, దానికి స్పందిస్తూ పరేష్ రావల్ తాను తీసుకున్న రెమ్యూనరేషన్ ను వడ్డీతో సహా తిరిగి ఇచ్చినప్పటికీ హేరాఫేరి ఫ్రాంచైజికి జరగాల్సిన నష్టమైతే జరుగుతుంది. ఉన్నట్టుండి ఆయన ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకోవడం వల్ల ప్రాజెక్టు మరింత లేటవడంతో పాటూ ఆర్టిస్టుల డేట్స్ కూడా మరోసారి అడ్జస్ట్ అవడానికి ఇబ్బందవడంతో పాటూ నిర్మాణంలో ఖర్చు పరంగా కూడా ఎక్కువ నష్టపోవడం ఖాయం.
రీసెంట్ గా హౌస్ ఫుల్5 సినిమాతో మంచి హిట్ ను అందుకున్న అక్షయ్ కుమార్ ఈ విషయంపై స్పందించాడు. పరేష్ రావల్ విషయంలో ఏం జరుగుతుందనేది మీ అందరికీ తెలుసని, ఈ విషయంలో సానుకూల ఫలితం కోసం తానెంతగానో వెయిట్ చేస్తున్నట్టు అక్షయ్ కుమార్ తెలిపారు. తన అప్‌కమింగ్ మూవీ కన్నప్ప మూవీ ప్రమోషన్స్ లో భాగంగా అక్షయ్ కుమార్ ఈ వ్యాఖ్యలు చేశారు. మంచు విష్ణు హీరోగా తెరకెక్కిన కన్నప్పలో అక్షయ్ కుమార్ శివుడు పాత్రలో కనిపించనున్నాడు. జూన్ 27న కన్నప్ప ప్రేక్షకుల ముందుకు రానుంది.