కార‌వ్యాన్‌లో ఒంట‌రిగా ఈ హీరో ఏం చేస్తున్నాడో చూడండి!

మ‌రోవైపు హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ వ‌ర్క్ లైఫ్‌, ప్ర‌కృతి జీవ‌నం రెండిటినీ ఎలా బ్యాలెన్స్ చేయాలో చెబుతున్న ఫోటో కూడా ఇంట‌ర్నెట్ లో వైర‌ల్ అవుతోంది.;

Update: 2025-10-01 07:30 GMT

భూమిక నిర్మించిన `త‌కిట త‌కిట` సినిమాతో క‌థానాయ‌కుడిగా టాలీవుడ్ కి ప‌రిచ‌య‌మ‌య్యాడు హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ రాణే. అంత‌కుముందు పొట్ట పోషించుకునేందుకు, జీవ‌నోపాధి కోసం తాను పాత ఫ‌ర్నిచ‌ర్ కొని, కార్పెంట‌ర్ వ‌ర్క్ చేసి సికింద‌రాబాద్ ఫుట్ పాత్ పై అమ్మాన‌ని కూడా హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ చెప్పాడు. ఆ త‌ర్వాత వివాదాస్ప‌ద కిమ్ శ‌ర్మ‌తో డేటింగ్ చేసి నిరంత‌రం హెడ్ లైన్స్ లోకొచ్చాడు. ప్ర‌స్తుతం అత‌డు ఒంట‌రి. పూర్తిగా సినిమా కెరీర్ పైనే దృష్టి సారించాడు. ద‌శాబ్ధం పైగా సాగిన కెరీర్ లో అత‌డు చాలా ప‌రిణ‌తితో న‌టిస్తూ అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తున్నాడు.

అత‌డు నటించిన స‌న‌మ్ తేరి క‌స‌మ్ రెండో రిలీజ్ లో బంప‌ర్ హిట్ కొట్టి నిర్మాత‌ల‌కు లాభాలు అందించిన సంగ‌తి తెలిసిందే. త‌దుప‌రి సోనమ్ బజ్వాతో కలిసి ఏక్ దీవానే కి దీవానియాత్‌లో కనిపిస్తాడు. ఈ సినిమాని ద‌స‌రా కానుక‌గా అక్టోబర్ 2న విడుదల చేయాలని భావించినా, అక్టోబర్ 21న దీపావళికి విడుదల చేయడానికి రీషెడ్యూల్ చేశారు.

సంగీతపరమైన అబ్సెష‌న్ నేప‌థ్యంలో రొమాంటిక్ డ్రామా క‌థ‌తో ఇది రూపొందింది. ప్రేమ, అబ్సెసివ్, బ్రేక‌ప్ లాంటి అంశాల‌ను తెర‌పై చూపించ‌నున్నారు. ఈ సినిమాతో పాటు జాతీయ అవార్డు గ్రహీత ఒముంగ్ కుమార్ దర్శకత్వం వహించిన సాదియా ఖతీబ్, కరణ్‌వీర్ మెహ్రాతో కలిసి `సిలా`లో కూడా హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ నటించారు.

మ‌రోవైపు హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ వ‌ర్క్ లైఫ్‌, ప్ర‌కృతి జీవ‌నం రెండిటినీ ఎలా బ్యాలెన్స్ చేయాలో చెబుతున్న ఫోటో కూడా ఇంట‌ర్నెట్ లో వైర‌ల్ అవుతోంది. అత‌డు కార‌వ్యాన్ లో ఒక ప‌చ్చ‌ని ప్ర‌దేశంలోకి వెళ్లాడు. అక్క‌డ త‌న వంట తానే చేసుకుంటూ, ల్యాప్ టాప్ లో వ‌ర్క్ చేసుకుంటూ క‌నిపించాడు. సర్వైవల్ మోడ్ కంటే ఎప్పటికీ ముందుకు వెళ్లకూడదు! మనకు కావలసిందల్లా సూర్యకాంతి, ప్రకృతి, క‌నీస‌ ఆహారం....అని క్యాప్ష‌న్ కూడా ఇచ్చాడు. ప్ర‌కృతితో మమేక‌మై స‌హ‌జంగా జీవించ‌డం ఎలానో అత‌డు చెప్ప‌క‌నే చెబుతున్నాడు.

పాల్తాన్, తైష్, సనమ్ తేరి కసమ్, సావి, హసీన్ దిల్రుబా లాంటి చిత్రాల్లో హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ న‌టించాడు. త‌దుప‌రి ఏక్ దీవానే కి దీవానియాత్ విజ‌యంపై అత‌డు హోప్ తో ఉన్నాడు. కెరీర్ పై ఆశ నిరాశ‌లను అత‌డు ఒక వ్యాఖ్య‌లో తెలిపాడు. ``15ఏళ్లుగా క‌ల‌లు క‌నండి.. 9ఏళ్లు ప‌ని సీరియ‌స్ గా చేయండి.. 6 సంవత్సరాలు ఎవరి మాట వినకండి.. ఆపై మీ డ్రీమ్స్ లో జీవించండి!`` అని కూడా హర్షవర్ధన్ త‌న అభిమానుల‌కు సూచించాడు.

Tags:    

Similar News