• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  స్పిరిట్.. ఎలా...

స్పిరిట్.. ఎలా ఉంటుందంటే..

| తాజాగా యానిమల్ మ్యూజిక్ డైరెక్టర్ హర్షవర్ధన్ రామేశ్వర్ చేసిన వ్యాఖ్యలు.. స్పిరిట్ మూవీపై అంచనాలు ఒక్కసారిగా పెంచేశాయి.

By - Tupaki Desk
Update: 2024-02-26 12:26 GMT

యానిమల్ మూవీతో టాక్ ఆఫ్ ది టౌన్ గా మారిపోయారు టాలీవుడ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా. బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్, నేషనల్ క్రిష్ రష్మిక మందన్న జంటగా నటించిన ఈ మూవీ.. బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. వరల్డ్ వైడ్ గా రూ.900 కోట్లకు పైగా రాబట్టిన ఈ మూవీ.. అన్ని సెంటర్లలో బ్లాక్ బస్టర్ అయింది. సందీప్ రెడ్డి టేకింగ్ కు అంతా ఫిదా అయ్యారు. ఇండియన్ మూవీస్ లో ఇదో కల్ట్ క్లాసిక్ అంటూ విమర్శకులు కూడా ప్రశంసించారు.

అయితే యానిమల్ మూవీ తర్వాత సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించే కొత్త సినిమాలపై అందరి దృష్టి పడింది. ఇప్పటికే సందీప్.. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో స్పిరిట్ మూవీ చేస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో ఈ క్రేజీ ప్రాజెక్ట్ పై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. డిఫరెంట్ విజన్ తో స్పెషల్ కాన్సెప్ట్ తో స్పిరిట్ ను రూపొందిస్తున్నారట సందీప్ రెడ్డి.

 

తాజాగా యానిమల్ మ్యూజిక్ డైరెక్టర్ హర్షవర్ధన్ రామేశ్వర్ చేసిన వ్యాఖ్యలు.. స్పిరిట్ మూవీపై అంచనాలు ఒక్కసారిగా పెంచేశాయి. ఆడియెన్స్ మతి పోగొట్టే మ్యూజిక్ తో అదరగొట్టే హర్షవర్ధన్.. ఇటీవల తిరుమలను సందర్శించారు. ఆ సమయంలో తన అప్ కమింగ్ ప్రాజెక్ట్ కు సంబంధించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. యానిమల్ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ప్రభాస్ స్పిరిట్ మూవీ కోసం కూడా మాట్లాడారు.

ప్రభాస్ తో సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించనున్న స్పిరిట్ మూవీ త్వరలోనే ప్రారంభం కానుందని హర్షవర్ధన్ చెప్పారు. యానిమల్ మూవీకి మించి స్పిరిట్ ఉంటుందని చెప్పారు. మ్యూజిక్ విషయంలో కూడా యానిమల్ ను మించిపోద్దని చెప్పారు. ప్రస్తుతం హర్షవర్ధన్ కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. స్పిరిట్ మూవీ కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నట్లు ప్రభాస్ ఫ్యాన్స్ కామెంట్లు పెడుతున్నారు.

ప్రభాస్ స్పిరిట్ మూవీని రా అండ్ పవర్ ఫుల్ యాక్షన్ ఫిల్మ్ గా తీయనున్నట్లు ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తెలిపారు సందీప్ వంగా. అయితే యానిమల్ లో వయలెన్స్ ఎక్కువగా ఉన్నట్లు కామెంట్లు వచ్చాయి. మరి స్పిరిట్ విషయంలో సందీప్ ఏం చేస్తారో చూడాలని నెటిజన్లు అంటున్నారు. మరి స్పిరిట్ మూవీపై మేకర్స్.. ఏమైనా అప్డేట్ ఇస్తారేమో చూడాలి.

Tags:    
  • Animalmovie 
  • Harshavardhan 
  • Spirit 
  • Sundeepreddyvanga 
  • Prabhas 
  • Socialmediaviral 
  • Tirumalatemple 

Similar News

టాలీవుడ్ రెండు లెజెండరీ ఫ్యామిలీలతో మెగాస్టార్..!

2026-11-05 01:30 GMT

'జైలర్ 2' విజువల్స్ కొత్తగా కనిపించడానికి వాడిన టెక్నిక్ ఏంటంటే?

2026-11-05 00:30 GMT

సుకుమార్ రామ్ చరణ్ ను రంగస్థలం లో చెవిటి వాడిగా చూపించాడు. ఇప్పుడెలా చూపిస్తున్నాడో తెలుసా?

2026-11-04 23:30 GMT

Tollywood: చిన్న తప్పు కూడా పెద్ద ముప్పే!

2026-11-04 22:30 GMT

చిరంజీవి, బాలయ్య, వెంకటేష్, నాగార్జున కాంబోలో మూవీ రాబోతోందా?

2026-11-04 19:30 GMT

'ఆపరేషన్ సింధూర్'పై రేసింగ్: 10 సినిమాలు ప్ర‌క‌టించారు కానీ..!

2026-11-04 18:30 GMT

తమిళ ఇండస్ట్రీ కన్నా తెలుగు ఇండస్ట్రీలోనే గౌరవం..!

2026-11-04 18:03 GMT

Bigg Boss Telugu 10: తొమ్మిదో వారం డేంజర్ జోన్‌లో ఆ ఐదుగురు!

2026-11-04 18:02 GMT

Bigg Boss Telugu 10: 'రివార్డ్ అండ్ రివెంజ్' లో అదిరిపోయే ట్విస్ట్స్

2026-11-04 18:02 GMT

ఎన్నో మల్టీస్టారర్లలో.. ఈ రాబోయే తెలుగు మల్టీస్టారర్ మిన్న!

2026-11-04 18:01 GMT

అఖిల్ అక్కినేని క్రష్ ఎవరో తెలుసా..?

2026-11-04 18:01 GMT

మినీ కొట్టు పెట్టిన జగపతిబాబు కూతురు.. వీడియో వైరల్!

2026-11-04 17:53 GMT

Copyright @2026

Powered by Blink CMS