పొలిటికల్ టచ్ & ఉస్తాద్ రీమేక్? హరీష్ ఏమన్నారంటే?
స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్.. ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నారు.;
స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్.. ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లీడ్ రోల్ లో నటించిన ఆ సినిమా.. మార్చి 26వ తేదీన రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో ఆయన తాజా మీడియా ప్రతినిధులకు రౌండ్ టేబుల్ ఇంటర్వ్యూ ఇచ్చారు. అందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
అయితే సినిమాలో పొలిటికల్ టచ్ లేదని హరీష్ శంకర్ రీసెంట్ గా వీడియో పోస్ట్ పెట్టగా.. ఇప్పుడు దానిపై మాట్లాడారు. మూవీలో కొన్ని డైలాగ్స్ ముఖ్యంగా గాజుపై డైలాగ్ ను మీడియా ప్రస్తావించగా.. ఆ గ్లాస్ అనేది కొత్తగా ఉస్తాద్ భగత్ సింగ్ లో తీసుకొచ్చింది కాదని, గబ్బర్ సింగ్ లో కూడా ఉందని చెప్పారు. గాజు గ్లాస్ మిడిల్ క్లాస్ ను రిప్రెంజెట్ చేస్తుందని అన్నారు.
"సినిమాలో హీరో ఎలివేషన్ డైలాగ్స్ ఉంటాయి. ఆయన పాలిటిక్స్ లో ఉండడం వల్ల అన్ని డైలాగ్స్ ను అలాగే చూస్తున్నారు. నాకు తిక్కుంది దానికో లెక్క ఉంది అనే డైలాగ్ ను ఇప్పుడు రాసుంటే.. పవన్ కోసం రాశానని అనేవారు. ఇతర పార్టీలు, వర్గాలు, మతాలకు ఎలాంటి ఇబ్బంది పెట్టే డైలాగ్స్ లేవని వీడియోలో క్లారిటీ ఇచ్చాను. కానీ హీరోను తక్కువ చేస్తానని చెప్పలేదు" అని అన్నారు. గాజు డైలాగ్ ఎవరినీ కించపరచదని తెలిపారు.
ఆ తర్వాత ఉస్తాద్ భగత్ సింగ్ రీమేకా అన్న విషయంపై హరీష్ మాట్లాడారు. "నాకు ఇప్పటికే అడిగితే చెప్పనని చెప్పా. ఎందుకంటే.. నాకు ఏదైనా సినిమా నచ్చితే డైరెక్ట్ గా రీమేక్ అని చెబుతా. ఇండస్ట్రీలో చాలా మంది రీమేక్స్ చేశారు. కానీ ఫస్ట్ టైమ్ గబ్బర్ సింగ్ కు మాటలు, మార్పులు అనే ట్యాగ్ పడింది. ఇప్పుడు ఉస్తాద్ రీమేక్ అయితే కథ, మాటలు అని ట్యాగ్ ఎందుకు వేసుకుంటా"అని ప్రశ్నించారు.
"తేరీ మూవీలో ఓ సీన్.. గబ్బర్ సింగ్ మూవీ నుంచి తీసుకున్నారు. కానీ ఇప్పుడు నేను తేరీ రీమేక్ చేస్తున్నా అంటే నేనేం చెబుతా. అయితే గబ్బర్ సింగ్ టైమ్ లో చాలా మంది పోలీస్ క్యారెక్టర్స్ చేశారు.. మళ్లీ నేనెందుకు అని పవన్ అడిగారు. అప్పుడు కొత్త ప్రొడక్ట్ అని చెప్పా. పోలీసు క్యారెక్టర్స్ ఎవరు చేసినా.. అంతా చూస్తున్నారు.. కానీ మిమ్మల్ని ఎవరూ కాప్ గా చూడలేదని, అందుకే కొత్తగా ఉంటుందని అని చెప్పా" అని తెలిపారు.
ఏదేమైనా ఉస్తాద్ భగత్ సింగ్ మూవీకి గాను పవన్ కళ్యాణ్ నుంచి ఎవరు ఏమి ఎక్స్పెక్ట్ చేస్తారో అన్నీ ఉంటాయని తెలిపారు హరీష్ శంకర్. "హెయిర్ స్టైల్, డ్రెస్సింగ్, డైలాగ్స్, డ్రామా అన్నీ ఉంటాయి. సెకండాఫ్ లో పవన్, శ్రీలీల డ్రామా బాగుంటుంది. సినిమా కంప్లీట్ ఎంటర్టైనర్ గా ఉంటుంది. మూవీ హెయిర్ స్టైల్ ను కొన్ని రోజుల వరకు మెయింటైన్ చేసి కూడా పవన్ ఫుల్ గా కోపరేట్ చేశారు" అని తెలిపారు.