హ‌రి హ‌ర ఈ డేటైనా క‌న్ఫ‌ర్మా?

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ న‌టించిన తొలి భారీ పాన్ ఇండియా మూవీ `హ‌రి హ‌ర వీర‌మ‌ల్లు`. రెండు భాగాలుగా రిలీజ్ కానున్న ఈ మూవీని క్రిష్‌, జ్యోతికృష్ణ రూపొదించారు.;

Update: 2025-06-13 09:51 GMT
హ‌రి హ‌ర ఈ డేటైనా క‌న్ఫ‌ర్మా?

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ న‌టించిన తొలి భారీ పాన్ ఇండియా మూవీ `హ‌రి హ‌ర వీర‌మ‌ల్లు`. రెండు భాగాలుగా రిలీజ్ కానున్న ఈ మూవీని క్రిష్‌, జ్యోతికృష్ణ రూపొదించారు. ప‌వ‌న్ న‌టించిన తొలి పీరియాడిక్ ఫిల్మ్ ఇదే కావ‌డంతో ఈ సినిమాపై అభిమానుల్లోనూ, సినీ ల‌వ‌ర్స్‌లోనూ భారీ అంచ‌నాలున్నాయి. ఈ నేప‌థ్యంలో ఫ‌స్ట్ పార్ట్‌ని ప్రేక్ష‌కుల ముందుకు తీసుకొస్తున్నారు. గ‌త కొన్ని నెల‌లుగా రిలీజ్ వాయిదాప‌డుతూ ప్రేక్ష‌కుల స‌హ‌నంతో పాటు డిస్ట్రిబ్యూట‌ర్ల, ఎగ్జిబిట‌ర్ల‌ స‌హ‌నాన్ని ప‌రీక్షిస్తోంది.

అంతే కాకుండా ఈ సినిమా రిలీజ్ డేట్‌లు వ‌రుస‌గా వాయిదా ప‌డుతుండ‌టంతో ఆ స‌మ‌యంలో రిలీజ్ చేయ‌లేక‌, త‌మ సినిమాల రిలీజ్‌ల‌ని ఆపు చేయ‌లేక కొంత మంది నిర్మాత‌లు, ద‌ర్శ‌కులు, హీరోలు తీవ్ర అస‌హ‌నానికి గుర‌వుతున్నారు. ఈ నెల 12న రిలీజ్ కావాల్సిన ఈ మూవీ చివ‌రి నిమ‌షంలో వాయిదా ప‌డింది. దీంతో చాలా మంది ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుంద‌ని ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. తాజా స‌మాచారం ప్ర‌కారం ఈ మూవీని జూలై 18న విడుద‌ల చేయాల‌ని మేక‌ర్స్ డేట్ ఫైన‌ల్ చేసుకున్న‌ట్టుగా తెలిసింది.

మామూలుగా అయితే ఈ నెలాఖ‌రునే విడుద‌ల చేయాల‌ని టీమ్ భావించింది. కానీ ఆ స‌మ‌యంలో మంచు విష్ణు క‌న్న‌ప్ప రిలీజ్ అవుతోంది. `హ‌రి హ‌ర కోసం అది వెన‌క్కి వెళ్ల‌దు. దీంతో హ‌రి హ‌ర టీమ్ తామే వెక్కి వెళ్లాల‌ని నిర్ణ‌యించుకున్నార‌ట‌. అందులో భాగంగానే ఈ మూవీని జూలై 18న రిలీజ్ చేయాల‌ని ఫిక్స్ అయ్యార‌ట‌. ఇదే నిజ‌మైతే రెండు మూడు రోజులు అటు ఇటుగా సినిమా రిలీజ్‌కు నెల‌కు పైనే స‌మ‌యం ఉంది. ప‌వ‌న్ కూడా ప్ర‌మోష‌న్స్‌ల పాల్గొంటాన‌ని నిర్మాత‌కు హామీ ఇవ్వ‌డంతో త్వ‌ర‌లోనే ప్ర‌మోష‌న్స్‌ని స్టార్ట్ చేయాల‌నుకుంటున్నార‌ట‌.

ప్రీ రిలీజ్ ఈవెంట్‌తో పాటు కీల‌క ఛాన‌ళ్ల‌కు, ప్రింట్ మీడియాకు ఇంట‌ర్వ్యూలు, స్పెష‌ల్ ప్రోగ్రామ్స్‌కు ప‌వ‌న్ అందుబాటులో ఉంటార‌ట‌. అంత‌కు మించి మ‌రే ప్ర‌మోష‌న్స్‌లో ప‌వ‌న్ పాల్గొన‌ర‌ని తెలిసింది. మ‌రో వారం ప‌ది రోజుల్లో ట్రైల‌ర్‌ని రిలీజ్ చేసి అందులోనే రిలీజ్ డేట్‌ని ప్ర‌క‌టిస్తార‌ట‌. ఇది నిజంగా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూసే. ఇక సోలో రిలీజ్ కాబ‌ట్టి `హ‌రి హ‌ర వీర‌మ‌ల్లు`కు బాక్సాఫీస్ వ‌ద్ద భారీ క్రేజ్ ఉంటుంద‌ని, ప్రారంభ వ‌సూళ్లు భారీగా ఉంటాయని ఇన్ సైడ్ టాక్‌.

ఇదిలా ఉంటే జూలై 11న అనుష్క 'ఘాటీ' రిలీజ్ అవుతున్న విష‌యం తెలిసిందే. ఇది రిలీజ్ అయిన వారం త‌రువాతే `హ‌రి హ‌ర వీర‌మ‌ల్లు` థియేట‌ర్ల‌లోకి రాబోతోంది. దీని త‌రువాత ఆగ‌స్టు వ‌ర‌కు మ‌రో సినిమా లేదు. దీంతో హ‌రి హ‌ర‌కు మంచి టైమ్ ఉంటుంద‌ని, వ‌సూళ్లు భారీగా ఉండే అవ‌కాశం ఉంద‌ని ట్రేడ్ వ‌ర్గాలు అంటున్నాయి. అంతా ఓకే కానీ ఈ డేట్ కూడా క‌న్ఫ‌ర్మా అనే అనుమానాల్ని అభిమానులు, ట్రేడ్ వ‌ర్గాలు వ్య‌క్తం చేస్తున్నాయి.

Tags:    

Similar News