వీర‌మ‌ల్లు చూసి ఆయ‌న షాక‌వ‌డం ఖాయం

మొత్తానికి వీర‌మ‌ల్లు షూటింగ్ ను పూర్తవ‌డంతో జూన్ 12న సినిమాను రిలీజ్ చేద్దామ‌ని మేక‌ర్స్ అనౌన్స్ చేశారు.;

Update: 2025-06-05 11:04 GMT

ప‌వ‌న్ క‌ళ్యాణ్ హీరోగా తెర‌కెక్కిన పీరియాడిక్ యాక్ష‌న్ సినిమా హరి హ‌ర వీర‌మ‌ల్లు. ఏ ముహూర్తాన ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లిందో కానీ ప్ర‌తీ ద‌శ‌లోనూ సినిమాకు అడ్డంకులు ఏర్ప‌డుతూనే ఉన్నాయి. మొద‌ట కరోనా కార‌ణంగా ఈ సినిమా షూటింగ్ ఆగిపోయింది. ఆ త‌ర్వాత ప‌వ‌న్ వేరే సినిమాల‌ను చేద్దామ‌ని ఈ ప్రాజెక్టును లైట్ తీసుకోవ‌డంతో మ‌రికాస్త లేటైంది.

ఆ త‌ర్వాత ప‌వ‌న్ రాజ‌కీయాల్లో బిజీగా ఉండ‌టంతో ఊహించ‌ని విధంగా వీర‌మ‌ల్లు లేట‌వుతూనే వ‌స్తోంది. పదే ప‌దే సినిమా లేట‌వుతూ ఉండ‌టం వ‌ల్ల హ‌రి హ‌ర వీర‌మ‌ల్లు ప్రాజెక్టు నుంచి ప‌వ‌న్ త‌ప్పుకున్నాడు. దీంతో వీర‌మ‌ల్లు ద‌ర్శ‌క‌త్వ బాధ్య‌త‌ల్ని నిర్మాత ఏఎం ర‌త్నం కొడుకు జ్యోతి కృష్ణ తీసుకుని ఆగిపోయిన ఆ సినిమాను రీసెంట్ గానే పూర్తి చేశాడు.

మొత్తానికి వీర‌మ‌ల్లు షూటింగ్ ను పూర్తవ‌డంతో జూన్ 12న సినిమాను రిలీజ్ చేద్దామ‌ని మేక‌ర్స్ అనౌన్స్ చేశారు. కానీ సీజీ వ‌ర్క్స్ ఇంకా పెండింగ్ లో ఉండ‌టం వ‌ల్ల వీర‌మ‌ల్లు మ‌రోసారి వాయిదా ప‌డింది. మెగా సూర్య ప్రొడ‌క్ష‌న్స్ లో ఏఎం ర‌త్నం నిర్మించిన ఈ సినిమా ప్ర‌మోష‌న్స్ లో భాగంగా నిర్మాత ర‌త్నం మాట్లాడుతూ వీర‌మ‌ల్లు సినిమాను మొద‌ట ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన క్రిష్ కు చూపించాల‌ని ప్లాన్ చేస్తున్న‌ట్టు చెప్పారు.

త్వ‌ర‌లోనే వీర‌మ‌ల్లు సినిమాను క్రిష్ కు చూపిస్తామ‌ని, క్రిష్ సినిమా చూశాక పూర్తిగా షాక్ అవ‌డం ఖాయ‌మ‌ని, అత‌ను తీద్దామ‌నుకున్న సినిమాకు మేం చేసిన మార్పుల‌ను చూసి అత‌ను క‌చ్ఛితంగా ఆశ్చ‌ర్య‌పోతాడ‌ని ర‌త్నం అన్నారు. అయితే ఈ సినిమా ప‌లు మార్లు వాయిదాలు ప‌డ‌టంతో వీర‌మ‌ల్లుపై పెద్ద‌గా అంచ‌నాలు లేవు. ఒక‌వేళ క్రిష్ కూడా ప్ర‌మోష‌న్స్ లో పాల్గొంటే సినిమాపై హైప్ పెరిగే అవ‌కాశ‌ముంది కానీ ఆయ‌న పాల్గొనే ఛాన్సులైతే త‌క్కువ‌. చూడాలి మ‌రి క్రిష్ వీర‌మ‌ల్లు ప్ర‌మోష‌న్స్ లో భాగ‌మ‌వుతాడో లేదో.

Tags:    

Similar News