వీరమల్లు రిలీజ్ కు ముందు పాత బాకీల పంచాయితి
సాధారణంగా ఏ సినిమానైనా విడుదలకు రెడీ అవుతుందంటే కాంట్రవర్సీలు కామనే.;
సాధారణంగా ఏ సినిమానైనా విడుదలకు రెడీ అవుతుందంటే కాంట్రవర్సీలు కామనే. ప్రస్తుతం రిలీజ్ అవుతున్న సినిమా మేకర్స్ గతంలో తాము తీసిన చిత్రాల విషయంలో డిస్ట్రిబ్యూటర్లకు, ఎగ్జిబిటర్లకు ఏమైనా బాకీ ఉంటే వసూల్ చేసుకోడానికి ఇదే సరైన సమయం అని భావిస్తుంటారు. అందుకే కొత్త సినిమాల రిలీజ్ టైమ్ లో పాత బాకీలు అడుగుతారు.
ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమాకు కూడా ఇదే పరిస్థితి ఎదురైంది. ఈ సినిమా నిర్మాత ఏ ఎం రత్నంను పాత బాకీలు వెంటాడుతున్నాయిు. గతంలో ఏ ఎం రత్నం తీసిన సినిమాలు కొన్న డిస్ట్రిబ్యూషన్ సంస్థలు తాజాగా హైదరాబాగ్ లోని ఫిల్మ్ ఛాంబర్ ను ఆశ్రయించారు. తామకు ఏ ఎం రత్నం నుంచి డబ్బులు రావాలంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు.
గతంలో ఏ ఎం రత్నం గోపీచంద్ హీరోగా ఆక్సిజన్ సినిమా రూపొందించారు. ఈ సినిమా అంతగా ఆడలేదు. అయితే ఈ సినిమాకు సంబంధించి తమకు రూ. 2 కోట్ల 60 లక్షలు రావాల్సి ఉందని, ఈ మొత్తాన్ని సెటిల్ చేయాలంటూ ఏషియన్ ఎంటర్ ప్రైజస్ సంస్థ ఫిలిం ఛాంబర్ లో ఫిర్యాదు చేసింది. అలాగే ముద్దుల కొడుకు, బంగారం అనే మరో 2 సినిమాలకు సంబంధించి కూడా రూ. 90 లక్షలు బకాయిలు ఉన్నాయని మరో సంస్థ కూడా ఛాంబర్ లో ఫిర్యాదు చేసింది.
అలా ఈ బకాయిలకు, హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ కు సదరు సంస్థలు లింకు పెట్టాయి. ఈ సినిమా విడుదలకు ముందే తమ బాకీలు చెల్లించాలని డిస్ట్రిబ్యూటర్లు, ఆయా కంపెనీల తరఫున కోరుతున్నారు. అయితే ఇది బహిరంగం కావడంతోపాటు, మరికొన్ని అంశాల వల్ల నైజాంలో అనేక ప్రాంతాల్లో హరిహర వీరమల్లు డిస్ట్రిబ్యూషన్ డీల్స్ కంప్లీట్ అవ్వలేదు.
అయితే ఇవన్నీ వీరమల్లు రిలీజ్ కు సరిగ్గా 10 రోజుల ముందు ఫిల్మ్ ఛాంబర్ లో పాత బాకీల పంచాయితీ మొదలవ్వడం, గతంలోనూ థియేటర్ పర్సెంటేజీ విషయంలోనూ వివాదం జరగడం ఫ్యాన్స్ ను కలవరపెడుతోంది!