• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఓవర్సీస్ లో హనుమాన్...

ఓవర్సీస్ లో హనుమాన్ చెడుగుడు

| ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా 3.03 మిలియన్ డాలర్ల కలెక్షన్స్ ని హనుమాన్ సొంతం చేసుకొని సరికొత్త రికార్డ్ ని క్రియేట్ చేసింది.

By - Tupaki Desk
Update: 2024-01-16 04:10 GMT

ప్రశాంత్ వర్మ, తేజా సజ్జా కాంబినేషన్ లో వచ్చిన తెలుగు సూపర్ హీరో మూవీ హనుమాన్ ప్రపంచ వ్యాప్తంగా సత్తా చాటుతోంది. ఏకంగా 11 భాషలలో ఈ చిత్రాన్ని రిలీజ్ చేశారు. ఇంగ్లీష్ వెర్షన్ కూడా ఇతర దేశాలలో అందుబాటులో ఉన్నట్లు తెలుస్తోంది. సంక్రాంతి రేసులో సాలిడ్ సక్సెస్ అందుకున్న చిత్రంగా ఇప్పటికే హనుమాన్ టాప్ చైర్ లో ఉంది. వంద కోట్ల గ్రాస్ ని క్రాస్ చేసినట్లు తెలుస్తోంది.

అఫీషియల్ గా ఎనౌన్స్ చేయడం ఒకటే మిగిలింది. ఇక ఓవర్సీస్ లో కూడా హనుమాన్ సత్తా చాటుతోంది. స్టార్ హీరోల సినిమాలకి ఏ మాత్రం తీసిపోకుండా కలెక్షన్స్ ప్రభంజనం సృస్తోంది. ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా 3.03 మిలియన్ డాలర్ల కలెక్షన్స్ ని హనుమాన్ సొంతం చేసుకొని సరికొత్త రికార్డ్ ని క్రియేట్ చేసింది.

చిన్న హీరోల సినిమాలలో ఇంత వేగంగా 3 మిలియన్ డాలర్లు కలెక్ట్ చేసిన చిత్రంగా రికార్డ్ సృష్టించింది. చిన్నారుల నుంచి వృద్ధుల వరకు అన్ని వర్గాల వారికి నచ్చే విధంగా హనుమాన్ కాన్సెప్ట్ ఉండటంతో ఫ్యామిలీతో కలిసి మూవీ చూడటానికి ఇష్టపడుతున్నారు. దీంతో కలెక్షన్స్ రోజు రోజుకి పెరుగుతున్నాయి. నార్త్ అమెరికాలో ఇప్పటి వరకు 20.78 కోట్ల గ్రాస్ ని హనుమాన్ వసూళ్లు చేసింది.

ఇక యూకే, ఐర్లాండ్ లో 1.56 కోట్ల గ్రాస్, ఆస్ట్రేలియాలో 1.4 కోట్లు, యూఏఈ, గల్ఫ్ దేశాలలో 1.1 కోట్లు, రెస్ట్ ఆఫ్ వరల్డ్ లో 70 లక్షల గ్రాస్ కలెక్ట్ అయ్యింది. ఓవరాల్ గా ఇండియన్ కరెన్సీలో 25.54 కోట్ల గ్రాస్ ని హనుమాన్ సొంతం చేసుకుంది. గుంటూరు కారం సినిమా కూడా ఓవర్సీస్ లో ఈ స్థాయిలో కలెక్షన్స్ ని ఇంకా సాధించలేదని తెలుస్తోంది.

సూపర్ స్టార్ కెరియర్ లోనే గుంటూరు కారం హైయెస్ట్ ఓవర్సీస్ కలెక్షన్స్ ని సొంతం చేసుకునే అవకాశం ఉంది. అయితే హనుమాన్ కలెక్షన్స్ ని మాత్రం బీట్ చేసే అవకాశం ఉండకపోవచ్చు. మూవీ టాక్ బాగుండటంతో థియేటర్స్ సంఖ్య కూడా క్రమంగా పెరుగుతోంది. నార్త్ ఇండియాలో కూడా హనుమాన్ సాలిడ్ కలెక్షన్స్ ని సాధిస్తోందని బాలీవుడ్ క్రిటిక్స్ చెబుతున్నారు.

Tags:    
  • Tollywood 
  • Prasanthvarma 
  • Tejasajja 
  • Hanuman 
  • Hanumanmovie 
  • Overseas 
  • Collections 
  • Northamerica 
  • Boxoffice 

Similar News

టైసన్ నాయుడు ఫస్ట్ సింగిల్.. క్యాచీ ఫోక్ బీట్ తో 'మదరాసి రబ్బరు బొమ్మ'

2026-11-06 16:03 GMT

సగం షెడ్యూల్‌కే గుడ్‌బై.. న్యాయపోరాటాలు!

2026-11-06 15:30 GMT

ఆఫర్లు తెచ్చిన మైకం.. కానీ నన్ను కాపాడింది అతడే!

2026-11-06 14:30 GMT

బ్యానర్‌లో కాదు.. ఆయనతోనే సినిమా చేయాలనుంది: మౌళి

2026-11-06 13:18 GMT

కమల్ హాసన్ బర్త్‌డే ట్రీట్.. అదిరిపోయిన సండియర్ ఫస్ట్ లుక్!

2026-11-06 13:15 GMT

రామాయణం తీయడానికి ఇంత ఖర్చు అవసరమా..!

2026-11-06 13:11 GMT

దీపావళి స్పెషల్.. వీకెండ్స్ లో సందడి చేయనున్న సినిమాలు, సిరీస్ లు ఇవే!

2026-11-06 13:03 GMT

వైజాగ్ నుంచి హాలీవుడ్ వరకు శోభిత గ్రాండ్ జర్నీ!

2026-11-06 12:30 GMT

చదువు,ఉద్యోగాలు వదిలేసి యువత థియేటర్ల ముందుండాలా?

2026-11-06 11:40 GMT

ఫేమస్ నటీమణులపై లేడీ సూపర్‌స్టార్ శ్రీదేవి ఇంపాక్ట్!

2026-11-06 11:30 GMT

మెగాస్టార్‌కు వ‌రుస‌గా బాంబ్ బెదిరింపులు.. అస‌లేం జ‌రుగుతోంది?

2026-11-06 10:49 GMT

రామాయణ లో ఉన్నది.. ఆదిపురుష్‌లో లేనిది ఇదేనా!

2026-11-06 10:48 GMT

Copyright @2026

Powered by Blink CMS