'కాంతార' త‌ర‌హాలో `పౌజీ` రిలీజ్!

విజ‌యం రెట్టించిన ఉత్సాహాన్ని అందిస్తుంది. ఎన్ని ర‌కాల ఐడియాలైనా క‌ల్పిస్తుంది. చాలా వ‌ర‌కూ సినిమా సీక్వెల్స్ ఐడియాలు అన్న‌వి స‌క్సెస్ నుంచే పుడ‌తాయి.;

Update: 2025-11-21 16:30 GMT

విజ‌యం రెట్టించిన ఉత్సాహాన్ని అందిస్తుంది. ఎన్ని ర‌కాల ఐడియాలైనా క‌ల్పిస్తుంది. చాలా వ‌ర‌కూ సినిమా సీక్వెల్స్ ఐడియాలు అన్న‌వి స‌క్సెస్ నుంచే పుడ‌తాయి. చాలా అరుదుగానే ఒకే క‌థ‌ను రెండు భాగాలుగా చెప్పాల‌నుకునే వారుంటారు. ఆ త‌ర‌హా నిర్ణ‌యాలు కూడా ఇనిస్టెంట్ గా జ‌రుగుతుంటాయి. కానీ స‌క్సెస్ నుంచి తీసుకునే నిర్ణ‌యాలు ఇంకాస్త లోతుగా క‌నిపిస్తుంటాయి. `కాంతార` సౌత్ లో అంత పెద్ద విజ‌యం సాధిస్తుంద‌ని రిష‌బ్ శెట్టి ఎంత మాత్రం ఊహించ‌లేదు. ఓ చిన్న చిత్రంగా రిలీజ్ అయి పెద్ద విజ‌యం సాధించింది.

కొన్ని లీడ్స్ త‌ప్ప అంతా కొత్త‌గానే:

తెలుగు ఆడియ‌న్స్ కు అంత గొప్ప గా క‌నెక్ట్ అవుతుంద‌ని అత‌డు ఏమాత్రం ఊహించ‌లేదు. క‌ట్ చేస్తే కోట్ల వ‌సూళ్ల‌ను తెలుగు మార్కెట్ నుంచే రాబ‌ట్టింది. `కాంతార‌`లో రిష‌బ్ చెప్పిన క‌థ‌కు చాలా చ‌రిత్ర ఉంది. అందులో ఓ చిన్న భాగాన్ని మాత్ర‌మే ఓ సాధార‌ణ చిత్రంగా చేసాడు. కానీ ఆ స‌క్సెస్ రిష‌బ్ ఐడియాల‌జీలో ఎన్నో మార్పులు తీసుకొచ్చింది. `కాంతార చాప్ట‌ర్ వ‌న్` అంటూ ప్రీక్వెల్ గా మ‌రో క‌థ‌తోనూ గ్రాండ్ స‌క్సెస్ అయ్యాడు. నిజానికి ఈ రెండు క‌థ‌ల్లో కొన్ని లీడ్స్ త‌ప్ప మిగ‌తా అంతా కొత్త క‌థే. రెండు క‌థ‌ల‌కు సంబంధం లేకుండానే ఉంటుంది.

హ‌ను కూడా అలాగే ఆలోచిస్తున్నాడా:

కానీ `కాంతార‌`కు ముందు క‌థ అంటూ ప్రీక్వెల్ గా ప్రేక్ష‌కుల ముందుకొచ్చాడు. ఇక్క‌డ అత‌డు `కాంతార` ఇమేజ్ ని ఎన్ క్యాష్ చేసుకున్నాడు? అన్న‌ది క్లియ‌ర్. ఎందుకంటే `కాంతార` రిలీజ్ అయిన కొన్ని రోజుల త‌ర్వాత ప్రీక్వెల్ అనౌన్స్ మెంట్ చేసారు. అంత‌వ‌ర‌కూ ప్రీక్వెల్ ఉంటుంద‌ని ఎవ‌రికీ తెలియ‌దు. తాజాగా ఇదే త‌ర‌హాలో `పౌజీ` క‌థ‌ని కూడా ద‌ర్శ‌కుడు హ‌నురాఘ‌వ‌పూడి చెప్పే ప్ర‌య‌త్నం చేస్తున్నాడు. హ‌ను `పౌజీ` విష‌యంలో ధైర్య‌మైన నిర్ణ‌య‌మే తీసుకుంటున్నాడ అన్న వార్త వెలుగులోకి వ‌స్తోంది. `పౌజీ` ఇంకా రిలీజ్ అవ్వ‌లేదు. వ‌చ్చే ఏడాది ఆగ‌స్టులో రిలీజ్ అవుతుంది.

ఆ డైరెక్ట‌ర్ పై అదో మ‌చ్చ‌:

అది విజ‌యం సాధిస్తుందా? లేదా? రిలీజ్ త‌ర్వాత డిసైడ్ అవుతుంది. కానీ `పౌజీ 2` గా `పౌజీ ప్రీక్వెల్` క‌థ‌ను చెప్పేం దుకు రెడీ అవుతున్నాడు? అన్న‌ది తాజా స‌మాచారం. అయితే ఈ ప్ర‌క‌ట‌న ఇంకా అధికారికంగా రాలేదు. రిలీజ్ అయ్యే వ‌ర‌కూ కూడా హ‌ను రాఘ‌వ‌పూడి అంత ధైర్యం చేయ‌క‌పోవ‌చ్చు. `పౌజీ` స‌క్సెస్ అవుతుందా? ఫెయి ల‌వుతందా? అన్న‌ది రిలీజ్ త‌ర్వాత తేలే అంశం. స‌క్సెస్ అయితేనే `పౌజీ` కి పీక్వెల్ ఛాన్స్ ఉంటుంది. చేయ‌డానికి ప్ర‌భాస్ కూడా ముందుకొస్తాడు. లేదంటే? ప్లాప్ సినిమాకు ప్రీక్వెల్ ఏంట‌నే విమర్శ ఎదుర్కోక త‌ప్ప‌దు. ప్ర‌స్తుతం బాలీవుడ్ ద‌ర్శ‌కుడు ఆయాన్ ముఖ‌ర్జీ ఇలాంటి విమ‌ర్శ‌లే ఎదుర్కుంటున్నాడు. `బ్ర‌హ్మ‌స్త` రిలీజ్ కు ముందే రెండు భాగాలంటూ ప్ర‌క‌టించాడు. కానీ మొద‌టి భాగ‌మే ఫెయిలైంది. భారీ ఓపెనింగ్స్ త‌ప్ప పెట్టుబ‌డి కూడా తీసుకురాని చిత్రంగా మిగిలిపోయింది. అప్ప‌టి నుంచి `బ్ర‌హ్మ‌స్త్ర‌-2` ఉంటుందా? ఉండ‌దా? అన్న దానిపై ర‌క‌ర‌కాల ప్ర‌చారం జ‌రుగుతోంది.

Tags:    

Similar News