• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  గుంటూరు కారం కుర్చీ పాట...

గుంటూరు కారం కుర్చీ పాట ఆగయా.. మహేష్ ఊర మాస్

| ఒకవైపు నెగిటివ్ కామెంట్స్ వచ్చినప్పటికీ తప్పకుండా బిగ్ స్క్రీన్ పై మాత్రం ఈ సాంగ్ ఆకట్టుకుంటుంది అని చిత్ర యూనిట్ నమ్మకంగా చెబుతోంది.

By - Tupaki Desk
Update: 2023-12-30 10:55 GMT

సూపర్ స్టార్ మహేష్ బాబు గుంటూరు కారం సినిమా విడుదల తర్వాత ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో కానీ ప్రమోషన్స్ తో మాత్రం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా నిలుస్తోంది. ఒకవైపు ట్రోల్స్ వస్తున్నప్పటికీ మరొకవైపు పాజిటివ్ కామెంట్స్ కూడా గట్టిగానే వస్తున్నాయి. తప్పకుండా మాస్ ఆడియోన్స్ ను సినిమా ఆకట్టుకుంటుంది అని ఓవర్గం ఫ్యాన్స్ అయితే చాలా నమ్మకంతో ఉన్నారు.

దర్శకుడు త్రివిక్రమ్ మహేష్ బాబు కాంబినేషన్లో ఫ్యాన్స్ ఎలాంటి సినిమా చూడాలని అనుకుంటున్నారో అదే తరహాలో సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది అని నిర్మాత పదేపదే చెబుతున్నారు. ఇక ఈ సినిమాకు సంబంధించిన మూడవ సాంగ్ కుర్చీ మడతపెట్టి.. అనే విడుదల చేశారు. శుక్రవారం రోజు ఈ పాట ప్రోమో విడుదల చేశారు. సోషల్ మీడియాలో బాగా వైరల్ అయిన ఆ డైలాగ్ ఈ పాటలో చరణంగా తీసుకోవడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది.

ఒకవైపు నెగిటివ్ కామెంట్స్ వచ్చినప్పటికీ తప్పకుండా బిగ్ స్క్రీన్ పై మాత్రం ఈ సాంగ్ ఆకట్టుకుంటుంది అని చిత్ర యూనిట్ నమ్మకంగా చెబుతోంది. అయితే మొత్తం లిరికల్ పాటను కొద్దిసేపటి క్రితం విడుదల చేశారు. అందులో మహేష్ బాబు శ్రీ లీల ఇద్దరు కూడా మాస్ స్టెప్పులతో అయితే గట్టిగానే ఇంపాక్ట్ చూపించారు. సాంగ్ చిత్రీకరిలోనే కొన్ని ఆఫ్ స్క్రీన్ మూమెంట్స్ కూడా హైలెట్ చేశారు.

ఇక రామచోగయ్య శాస్త్రి రాసిన ఈ పాటను తమను కంపోజ్ చేయగా సాహితీ, శ్రీకృష్ణ పాడారు ఇక పాటలో మహేష్ బాబు కంప్లీట్ మాస్ లుక్ లో కనిపిస్తున్నారు అతని డ్రెస్సింగ్ స్టైల్ తో పాటు డైలాగ్ డెలివరీ కూడా గుంటూరు యాసతో హైలెట్ చేసేలా కనిపిస్తోంది. ఇక్కడ ఎవడి పాటకు వాడే లిరిక్స్ రాసుకోవాలి ఎంజాయ్ చేయాలి అనే విధంగా మహేష్ బాబు మధ్యలో ఒక డైలాగ్ కూడా వదిలారు.

ఏది ఏమైనా మాస్ ఆడియోన్స్ ను కంప్లీట్ గా ఈ న్యూ ఇయర్ రోజు ఆకట్టుకోవాలి అని చిత్ర యూనిట్ గట్టిగానే ఫిక్స్ అయింది. అయితే పాటపై మాత్రం భిన్నమైన అభిప్రాయాలు వస్తున్నాయి. కానీ మహేష్ బాబు లుక్కు మాత్రం ఫర్ఫెక్ట్ మాస్ యాంగిల్ లో క్లిక్ అవుతుందని అనిపిస్తుంది. కుర్చీపై కూర్చున్న ఒక ఫోటో కూడా పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ చేసేలా ఉంది. మరి సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి కలెక్షన్స్ అందుకుంటుందో చూడాలి.

Full View
Tags:    
  • Gunturukaraam 
  • Maheshbabu 
  • Chairsong 
  • Trivikram 
  • Thaman 
  • Sreeleela 

Similar News

తెలుగు సినిమా మరిచిపోయిన మ్యాజిక్ ఇదే.. ఒక్క హిట్ పడితే ఇక మనదే రాజ్యం!

2026-11-03 00:30 GMT

మెగాస్టార్ చిరంజీవి వాచ్ కలెక్షన్ చూశారా.. బ్రాండ్ తో పాటు కాస్ట్ తెలిస్తే షాక్!

2026-11-02 22:30 GMT

వెండితెరపై హ్యాట్రిక్ కొట్టిన టాలీవుడ్ సెలబ్రిటీ రియల్ జోడీలివే!

2026-11-02 19:30 GMT

ప్రతిరోజూ సాంబార్ తింటే ప‌ర‌లోకానికే!

2026-11-02 18:30 GMT

కోర్టులో ఇమ్రాన్ ఖాన్ క్షమాప‌ణ‌లు.. OCI కార్డ్‌హోల్డర్ల ప‌రిమితుల‌పై భారీ చర్చ

2026-11-02 18:27 GMT

'రామాయణ' ప్రీ-సేల్స్: అంత‌ర్జాతీయ మార్కెట్ ప్ల‌స్ అవుతోందా?

2026-11-02 18:26 GMT

సెలబ్రిటీల భద్రతపై చిరంజీవి కీలక అడుగు.. కేంద్రం దృష్టికి సమస్య!

2026-11-02 18:24 GMT

కత్తులతో కాళికావతారం.. రష్మిక 'మైసా' పూనకాలు మామూలుగా లేవుగా!

2026-11-02 18:24 GMT

కిల్లింగ్.. స్ట‌న్నింగ్.. ఎన్నారై తెలుగు గాళ్ ఫోటోషూట్ దుమారం

2026-11-02 18:22 GMT

భర్తతో కలిసి క్యూట్‌గా కాజల్ అగర్వాల్.. లేటెస్ట్ ఫొటోలు వైరల్!

2026-11-02 18:21 GMT

'రోషమన్ థియరీ' అంటే ఏంటి? అలాంటి కథ తో వచ్చిన సినిమాలు ఏంటి?

2026-11-02 17:30 GMT

పూరి జగన్నాథ్ పెన్ను లో పవర్ తగ్గిందా?

2026-11-02 16:30 GMT

Copyright @2026

Powered by Blink CMS