• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  గుంటూరు కారం.. రాబోయే...

గుంటూరు కారం.. రాబోయే రెండున్నార నెలల పాటు మోతే!

| ఆడియో సింగిల్​ను రిలీజ్​ చేసి.. ఆ తర్వాత బ్యాక్ టు బ్యాక్​ గ్యాప్ లేకుండా అప్డేట్స్​ ఇస్తానే ఉంటామన్న సంకేతాలను ఇవ్వడంతో పాటు సినిమా ఎలా ఉండబోతుందో రుచి చూపించనున్నారట.

By - Tupaki Desk
Update: 2023-10-12 05:30 GMT

సూపర్ స్టార్ మహేశ్ బాబు - మాటల మాంత్రికుడు త్రివిక్రమ్​ కాంబోలో రూపొందుతున్న భారీ మాస్ ఎంటర్​టైనర్ సినిమా గుంటూరు కారం. ఈ సినిమా రిలీజ్ కోసం, అలాగే ప్రమోషన్స్ ఎప్పుడెప్పుడు ప్రారంభం అవుతాయా అని​ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా అదిరిపోయే ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ బయటకు వచ్చింది.

తాజాగా అందిన సమాచారం ప్రకారం.. ప్రమోషన్స్​ను మొదలుపెట్టాలని మూవీటీమ్ సన్నాహాలు చేస్తున్నట్లు తెలిసింది. దసరా నుంచి ప్రమోషన్స్​ను ప్రారంభించి.. రాబోయే రెండున్నార నెలల పాటు గ్యాప్ లేకుండా బ్యాక్​ టు బ్యాక్ అప్డేట్స్ అండ్ సర్​ప్రైజెస్​తో​ సంక్రాంతి వరకు అభిమానుల్లో జోష్ నింపాలని రెడీ అవుతోందట. సంక్రాంతి రాబోయే సినిమాల లైనప్​ పెద్దగా ఉండటం వల్ల.. వాటిలో గుంటూరు కారం సినిమాకే ఎక్కువ బజ్ క్రియేట్ అయ్యేలా స్ట్రాటజీని ఫాలో అవ్వాలని ప్లాన్ చేస్తోందని తెలుస్తోంది.

ఫస్ట్ సింగిల్​ను దసరా కన్నా ముందే రిలీజ్ చేయాలని మేకర్స్​ కౌంట్​డౌన్ పెట్టుకున్నారట. ఆడియో సింగిల్​ను రిలీజ్​ చేసి.. ఆ తర్వాత బ్యాక్ టు బ్యాక్​ గ్యాప్ లేకుండా అప్డేట్స్​ ఇస్తానే ఉంటామన్న సంకేతాలను ఇవ్వడంతో పాటు సినిమా ఎలా ఉండబోతుందో రుచి చూపించనున్నారట. మూవీ కచ్చితంగా బ్లాక్ బాస్టర్ హిట్ అవుతుందని నమ్మకంతో ఉన్నారంట.

ఇకపోతే ఇప్పటివరకు పోస్ట్​పోన్​ చేసుకుంటూ ఎన్నో కష్టాలను ఎదుర్కోని ఈ మధ్యే షూటింగ్​ను జరుపుకుంటున్న ఈ గుంటురు కారం చిత్రాన్ని.. ఎలాగైనా వచ్చే ఏడాది 2024 సంక్రాంతికి రిలీజ్ చేసే దిశగా ముందుకు వెళ్తోంది మూవీటీమ్​. అందుకు తగ్గట్టు షెడ్యూల్స్​ను ప్లాన్​ చేసి షూటింగ్ చేసుకుంటూ ముందుకు సాగుతోంది.

చిత్రంలో శ్రీలీల - మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటిస్తున్నారు. సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్​ తమన్ సంగీతం అందిస్తున్నారు. హారిక అండ్‌ హాసిని క్రియేషన్స్‌ బ్యానర్​పై ఎస్‌.రాధాకృష్ణ గ్రాండ్​గా నిర్మిస్తున్నారు. అతడు, ఖలేజా చిత్రాల తర్వాత మహేశ్‌ - త్రివిక్రమ్‌ కాంబోలో మాస్‌ అంశాలతో రూపొందుతున్న చిత్రమిది.

Tags:    
  • Tollywood 
  • Maheshbabu 
  • Gunturkaram 
  • Movie 
  • Trivikram 
  • Updates 
  • Dasara 
  • Firstsingle 

Similar News

తెలుగు సినిమా మరిచిపోయిన మ్యాజిక్ ఇదే.. ఒక్క హిట్ పడితే ఇక మనదే రాజ్యం!

2026-11-03 00:30 GMT

మెగాస్టార్ చిరంజీవి వాచ్ కలెక్షన్ చూశారా.. బ్రాండ్ తో పాటు కాస్ట్ తెలిస్తే షాక్!

2026-11-02 22:30 GMT

వెండితెరపై హ్యాట్రిక్ కొట్టిన టాలీవుడ్ సెలబ్రిటీ రియల్ జోడీలివే!

2026-11-02 19:30 GMT

ప్రతిరోజూ సాంబార్ తింటే ప‌ర‌లోకానికే!

2026-11-02 18:30 GMT

కోర్టులో ఇమ్రాన్ ఖాన్ క్షమాప‌ణ‌లు.. OCI కార్డ్‌హోల్డర్ల ప‌రిమితుల‌పై భారీ చర్చ

2026-11-02 18:27 GMT

'రామాయణ' ప్రీ-సేల్స్: అంత‌ర్జాతీయ మార్కెట్ ప్ల‌స్ అవుతోందా?

2026-11-02 18:26 GMT

సెలబ్రిటీల భద్రతపై చిరంజీవి కీలక అడుగు.. కేంద్రం దృష్టికి సమస్య!

2026-11-02 18:24 GMT

కత్తులతో కాళికావతారం.. రష్మిక 'మైసా' పూనకాలు మామూలుగా లేవుగా!

2026-11-02 18:24 GMT

కిల్లింగ్.. స్ట‌న్నింగ్.. ఎన్నారై తెలుగు గాళ్ ఫోటోషూట్ దుమారం

2026-11-02 18:22 GMT

భర్తతో కలిసి క్యూట్‌గా కాజల్ అగర్వాల్.. లేటెస్ట్ ఫొటోలు వైరల్!

2026-11-02 18:21 GMT

'రోషమన్ థియరీ' అంటే ఏంటి? అలాంటి కథ తో వచ్చిన సినిమాలు ఏంటి?

2026-11-02 17:30 GMT

పూరి జగన్నాథ్ పెన్ను లో పవర్ తగ్గిందా?

2026-11-02 16:30 GMT

Copyright @2026

Powered by Blink CMS