అబద్ధాలు మూఢనమ్మకాలే ఈ హీరోని నాశనం చేసాయి!
కాలం మారుతున్నా మూఢనమ్మకాలపై ప్రజలకు నమ్మకం తగ్గడం లేదు. సాంకేతికత ఎంత ఎదిగినా ఇంకా నమ్మకాలు సడటడం లేదు.;
కాలం మారుతున్నా మూఢనమ్మకాలపై ప్రజలకు నమ్మకం తగ్గడం లేదు. సాంకేతికత ఎంత ఎదిగినా ఇంకా నమ్మకాలు సడటడం లేదు. 90లలో బాలీవుడ్ లో అగ్ర కథానాయకుడిగా కొనసాగిన గోవిందా అకస్మాత్తుగా సినిమాల నుంచి దూరమయ్యారు. అయితే అతడి కెరీర్ నాశనం అవ్వడానికి మూఢనమ్మకాల ప్రధాన కారణమని తనకు అత్యంత సన్నిహితుడైన నిర్మాత ప్రహ్లాజ్ నిహలానీ వెల్లడించారు.
1990లలో గోవిందాతో కలిసి పనిచేసిన ప్రముఖ నిర్మాత పహ్లాజ్ నిహలానీ తమ మధ్య ఉన్న రిలేషన్ చెడిపోవడానికి కారణం ఏమిటో చెప్పారు. తాము ఎందుకు క్లోజ్ ఫ్రెండ్స్ కాలేకపోయారో వివరించారు. నిహ్లానీ గోవిందా మూఢనమ్మకాల గురించి ప్రస్తావించారు. గోవిందా అనూహ్యమైన, పేలవమైన కెరీర్ నిర్ణయాల గురించి ప్రస్థావిస్తూ కాలక్రమంలో అతడిలో మూఢనమ్మకాలు ఘోరంగా పెరిగాయని మాట్లాడాడు. ఇది గోవిందాకు గొప్ప ఫాలోయింగ్ ఆదరణ ఉన్న సమయంలోనూ ప్రమాదకరంగా మారిందని అన్నారు.
గోవిందా నటనా ప్రతిభ, కుటుంబ నిబద్ధతను కొనియాడుతూనే అతడి కెరీర్ నాశనంలో ఈ అంశాలు ముఖ్య పాత్ర పోషించాయని నిహ్లానీ అన్నారు. గోవిందాలో క్రమంగా మూఢనమ్మకాలు ఎక్కువ అయ్యాయి. అతడు ఎప్పుడూ కొంచెం అనుమానాస్పదంగా ప్రవర్తించేవాడు. సెట్‌లో షాన్డిలియర్ పడబోతోందని.. అందరినీ పక్కకు వెళ్లమని కంగారు పెట్టారు ఓసారి. అప్పుడు అతడు ఖాదర్ ఖాన్ మునిగిపోతాడని అంచనా వేసాడు. తన మూఢనమ్మకాల ఆధారంగా బట్టలు మార్చుకోమని సెట్లో వారికి సూచించేవాడు. అతడు కొన్ని రోజుల(సెంటిమెంట్ వారం వర్జ్యం)లో కొన్ని పనులు చేయడానికి నిరాకరిస్తాడు. అతడి వల్ల కొన్ని పనులు ఆలస్యమయ్యేవి. దీనికి తోడు మోసపూరిత వ్యక్తిత్వం కూడా అతడి పతనానికి దారితీసింది! అని నిహ్లానీ అన్నారు.
తాము మొదటిసారి కలుసుకున్నప్పుడు గోవింద నటనతో కూడా అంతగా ఆకట్టుకోలేదు. మరుసటి రోజు ఒక అద్భుతమైన డ్యాన్సర్ అని చెప్పుకుంటూ గోవిందా షోరీల్‌తో తిరిగి వచ్చాడు. అయితే తాము ఎప్పుడూ స్నేహితులం కాలేదని నిహ్లానీ తెలిపారు. మాకు కనెక్షన్ ఉంది.. కానీ అతనితో పని చేయడం ఎల్లప్పుడూ కష్టం. అతడు రెండవ ఆలోచన లేకుండా డజన్ల కొద్దీ బి-గ్రేడ్ , సి-గ్రేడ్ సినిమాలకు సంతకాలు చేసేవాడు. అతడు ఒకే సమయంలో ఐదు లేదా ఆరు సినిమాలకు పని చేస్తాడు. అతడు ఎక్కడ ఉన్నాడో ఎవరికీ తెలియదు. అతడు నిరంతరం ఆలస్యంగా వచ్చేవాడు. అబద్ధం చెప్పేవాడు.. అని కూడా ప్రహ్లాజ్ నిహలానీ తెలిపారు. ``డబ్బు కోసమే ఇలా చేస్తున్నావని.. ఇది ప్రమాదకరమైన ఆలోచన అని చెప్పాను`` అని నిహలానీ గుర్తు చేసుకున్నారు.
తాము ఎప్పుడూ స్నేహితులు కాలేదని నిహ్లానీ స్పష్టం చేశారు. కెరీర్ సవాళ్లను ఎదుర్కొన్నప్పుడు మాత్రమే గోవింద తనను సంప్రదిస్తారు.. విజయవంతమైన సమయాల్లో కాదు. ఈ పరిశ్రమ నమ్మకంతో పనిచేస్తుంది. నమ్మకం విచ్ఛిన్నమైనప్పుడు ముందుకు సాగలేం. నమ్మకం ఉంటేనే నటుడు- నిర్మాత మధ్య సంబంధం కొనసాగుతుంది. అతడు ఎవరితోనూ సంబంధాలు కొనసాగించలేదు! అని నిహలానీ చెప్పారు.