మొగుడు స్టార్ హీరో అనే భయం భక్తి లేకుండా..!
భర్త అంటే భయం భక్తి గౌరవం.. ఒకప్పుడు!! ఏకి పారేయడమే ఈరోజుల్లో ట్రెండ్! వెనకటికి ఒక పెద్దాయన పాత రోజులతో పోలుస్తూ ఇలా విశ్లేషించారు.;
భర్త అంటే భయం భక్తి గౌరవం.. ఒకప్పుడు!! ఏకి పారేయడమే ఈరోజుల్లో ట్రెండ్! వెనకటికి ఒక పెద్దాయన పాత రోజులతో పోలుస్తూ ఇలా విశ్లేషించారు. అయితే ఇక్కడ ఎపిసోడ్ లో భార్యకు భర్త పెద్ద సూపర్ స్టార్ అని తెలిసినా అదేమీ లెన్షన్ పెట్టలేదు. నోటికి ఎంత వస్తే అంతా.. ఏది తోస్తే అది భర్తను అనేస్తుంటుంది. అలా ఇప్పటికే ఆ భర్త గారు చాలా చిన్నబుచ్చుకున్నారు.
ఈ ఎపిసోడ్ ఎవరి గురించి? అంటే.. బాలీవుడ్ సీనియర్ హీరో గోవింద, ఆయన భార్య సునీత అహుజా గురించే. ఈ మధ్య ఈ జంట నడుమ నడుస్తున్న వివాదం ఇప్పుడు పీక్ స్టేజ్‌కు చేరుకుంది. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో సునీత తన భర్తపై చేసిన వ్యాఖ్యలు బాలీవుడ్ లో సెన్సేషన్ సృష్టిస్తున్నాయి.
తన కామెంట్ల ప్రకారం.. తన భర్త గోవిందాను షుగర్ డాడీ అంటూ సంబోధించింది. సినిమా ఇండస్ట్రీలోకి వచ్చే కొత్త అమ్మాయిల గురించి సునీత ఘాటుగా స్పందించారు. ``ఈ రోజుల్లో హీరోయిన్లు కావాలని వచ్చే కొందరు అమ్మాయిలకు టాలెంట్ కంటే కూడా తమ ఖర్చులు భరించే **షుగర్ డాడీ**లే ముఖ్యం. అందం ఉండదు కానీ హీరోయిన్ అయిపోవాలనుకుంటారు! అని మండిపడ్డారు.
అటువంటి వారు సీనియర్ స్టార్లను వలలో వేసుకుని ఆ తర్వాత బ్లాక్ మెయిల్ చేస్తారని సునీత అహూజా ఆరోపించారు. తన భర్త కూడా ఇలాంటి వారి వలలో పడటంపై ఆమె తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.
అంతేకాదు గోవిందా వయసు, బాధ్యత గురించి సునీత తీవ్రంగా ప్రశ్నించారు. గోవిందను ఉద్దేశించి ఆమె చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలలో ఇప్పుడు జోరుగా వైరల్ అవుతున్నాయి. ``నీకు ఇప్పుడు 63 ఏళ్లు. పెళ్లికి ఎదిగిన కూతురు టీనా (36), కెరీర్ చూసుకోవాల్సిన కొడుకు యష్ (28) ఉన్నారు. ఈ వయసులో ఇలాంటి పనులు చేయడం ఏంటి?`` అని నిలదీశారు. యవ్వనంలో తప్పులు చేస్తే అర్థం చేసుకోవచ్చు.. ఎందుకంటే అప్పుడు అందరూ చేస్తారు. కానీ 60 ఏళ్లు దాటాక కూడా ఇలాంటి వార్తల్లో ఉండటం కుటుంబ గౌరవానికి మంచిది కాదు! అని హెచ్చరించారు.
నేను క్షమించను...
సునీత తన ఆవేదనను వ్యక్తం చేస్తూ... ఒకవేళ గోవింద అఫైర్లపై తనకు పక్కా ఆధారాలు దొరికితే ఎప్పటికీ క్షమించనని తేల్చి చెప్పారు. అలాగే తన కొడుకు యష్ కెరీర్ విషయంలో గోవింద ఏమాత్రం సహాయం చేయడం లేదని, షారూఖ్ లేదా అమితాబ్ బచ్చన్ వంటి వారు తమ పిల్లల కోసం ఎంత కష్టపడుతున్నారో చూడమని గోవింద ముఖం మీదే అడిగినట్లు ఆమె వెల్లడించారు.
గోవింద స్పందన
ఈ ఆరోపణలపై గోవింద కూడా స్పందించారు. ఇదంతా తన ప్రతిష్టను దెబ్బతీయడానికి జరుగుతున్న ఒక `పెద్ద కుట్ర` అని ఆయన అభివర్ణించారు. తన కుటుంబ సభ్యులను, తన భార్య సునీతను ఎవరో పావులుగా వాడుకుంటున్నారని, తనను బలహీనపరచడమే వారి లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.
ఒకప్పుడు బాలీవుడ్ నంబర్ వన్ జోడీగా పేరు తెచ్చుకున్న వీరు, ఇప్పుడు బహిరంగంగా తిట్టుకోవడం అభిమానులను బాధ కలిగిస్తోంది. ఈ వివాదం విడాకుల వరకు వెళ్తుందా లేదా సద్దుమణుగుతుందా అనేది వేచి చూడాలి.