నీలి రంగు గౌనులో ఈషా గ్లామర్ హీట్.. స్టన్నింగ్!
బాలీవుడ్ గ్లామరస్ బ్యూటీ ఈషా గుప్తా మరోసారి ఇంటర్నెట్ ను షేక్ చేస్తోంది. పారిస్ వేదికగా జరిగిన ఓ ప్రముఖ ఫ్యాషన్ ఈవెంట్ లో ఆమె ధరించిన దుస్తులు ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్ గా మారాయి.;
బాలీవుడ్ గ్లామరస్ బ్యూటీ ఈషా గుప్తా మరోసారి ఇంటర్నెట్ ను షేక్ చేస్తోంది. పారిస్ వేదికగా జరిగిన ఓ ప్రముఖ ఫ్యాషన్ ఈవెంట్ లో ఆమె ధరించిన దుస్తులు ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్ గా మారాయి. లేత నీలం రంగు ఆఫ్ షోల్డర్ గౌనులో ఈషా గుప్తా అచ్చం దేవకన్యలా మెరిసిపోతోంది. డీప్ నెక్ లైన్ తో డిజైన్ చేసిన ఈ గౌనులో ఆమె తన గ్లామర్ తో స్టన్ అయ్యేలా దర్శనమిచ్చింది. ముఖ్యంగా ఆ డ్రెస్ కింది భాగంలో ఉన్న వెండి రంగు ఎంబ్రాయిడరీ వర్క్ ఆమె లుక్ కు రాయల్ టచ్ ఇచ్చింది.
ఈ లుక్ లో ఈషా మేకప్, హెయిర్ స్టైల్ ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. పాతకాలపు హాలీవుడ్ హీరోయిన్ల తరహాలో షార్ట్ వేవీ హెయిర్ స్టైల్ తో ఆమె చాలా క్లాసీగా కనిపిస్తోంది. ముదురు ఎరుపు రంగు లిప్ స్టిక్ చెవులకు చిన్న డైమండ్ ఇయర్ రింగ్స్ ధరించి ఎంతో హుందాగా తయారైంది. బాల్కనీలో నిల్చుని ఆమె ఇచ్చిన ఫోజులు, ఆ కిల్లర్ ఎక్స్ ప్రెషన్స్ కుర్రాళ్ళ గుండెల్లో మంటలు పుట్టిస్తున్నాయి.
ఇక ఈషా గుప్తా కెరీర్ విషయానికి వస్తే.. 'జన్నత్ 2' సినిమాతో బాలీవుడ్ లోకి అడుగుపెట్టింది. తొలి సినిమాతోనే తన గ్లామర్ తో, నటనతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత 'రుస్తుం', 'బాద్ షాహో', 'టోటల్ ధమాల్' వంటి చిత్రాల్లో నటించి మెప్పించింది. కేవలం నటిగానే కాకుండా, తన బోల్డ్ నెస్ తో ఇండస్ట్రీలో ప్రత్యేకమైన ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. మిస్ ఇండియా ఇంటర్నేషనల్ టైటిల్ గెలుచుకున్న ఈ భామ, వెండితెరపై కూడా అదే స్థాయి అందాన్ని ఆరబోస్తూ దూసుకుపోయింది.
తెలుగు ప్రేక్షకులకు కూడా ఈషా సుపరిచితురాలే. రామ్ చరణ్ నటించిన 'వినయ విధేయ రామ' సినిమాలో "ఏక్ బార్.. ఏక్ బార్" అంటూ సాగే స్పెషల్ సాంగ్ లో చిందేసి మాస్ ఆడియెన్స్ ను ఉర్రూతలూగించింది. అలాగే 'ఆశ్రమ్' వెబ్ సిరీస్ లో ఆమె చేసిన సోనియా పాత్రకు మంచి క్రేజ్ వచ్చింది. అందులో ఆమె చూపించిన బోల్డ్ పర్ఫార్మెన్స్ కు విమర్శకుల ప్రశంసలు కూడా దక్కాయి. వెండితెరపై అవకాశాలు కాస్త తగ్గినా, వెబ్ సిరీస్ లలో మాత్రం ఈ అమ్మడు దుమ్మురేపుతోంది.
ప్రస్తుతం సినిమాల పరంగా స్పీడ్ తగ్గించినప్పటికీ, సోషల్ మీడియాలో మాత్రం ఈషా గుప్తా హవా ఏమాత్రం తగ్గలేదు. నిత్యం ఇలాంటి ఫొటోషూట్స్ తో, ఫ్యాషన్ ఈవెంట్స్ తో వార్తల్లో నిలుస్తూనే ఉంది. తన ఫిట్ నెస్ వీడియోలతో, యోగా పోజులతో నెటిజన్లకు ఇన్స్పిరేషన్ గా నిలుస్తోంది. సరైన అవకాశం వస్తే మరోసారి వెండితెరపై సత్తా చాటాలని చూస్తోంది. ఈ లేటెస్ట్ పారిస్ లుక్ చూస్తుంటే ఇంటర్నేషనల్ మోడల్స్ కు ఏమాత్రం తీసిపోని విధంగా ఆమె గ్లామర్ ఉంది.