పెళ్లిచూపులు టైంలో హార్ట్ ఎటాక్.. ఆశ్చర్యపరిచిన తరుణ్ భాస్కర్!

తెలుగు సినిమా గమనాన్ని మార్చిన దర్శకుల్లో తరుణ్ భాస్కర్ ఒకరు. ఆయన నుండి సినిమా వస్తుందంటేనే ఏదో ఒక కొత్తదనం ఉంటుందని ప్రేక్షకులు ఆశిస్తారు.;

Update: 2026-01-27 18:30 GMT

తెలుగు సినిమా గమనాన్ని మార్చిన దర్శకుల్లో తరుణ్ భాస్కర్ ఒకరు. ఆయన నుండి సినిమా వస్తుందంటేనే ఏదో ఒక కొత్తదనం ఉంటుందని ప్రేక్షకులు ఆశిస్తారు. తాజాగా ఆయన దర్శకత్వం వహించిన 'ఓం శాంతి శాంతి శాంతిః' జనవరి 30న విడుదలకు సిద్ధమవుతోంది. ఈ క్రమంలో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన కెరీర్ ఆరంభం నాటి భయాలను, సక్సెస్ వెనుక ఉన్న ఒత్తిడిని తరుణ్ పంచుకున్నారు. ఆయన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో సినీ ప్రియులను కదిలిస్తున్నాయి. తరుణ్ తన గత అనుభవాలను ఈ ఇంటర్వ్యూ లో పంచుకున్నారు..

సక్సెస్ కూడా ఒక సమస్యే:

తరుణ్ భాస్కర్ తన మొదటి సినిమా 'పెళ్లి చూపులు' సాధించిన సంచలన విజయం గురించి మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆ సినిమా రిలీజ్ సమయంలో తన పరిస్థితి ఎలా ఉందని యాంకర్ అడగగా.. "నాకు హార్ట్ ఎటాక్ వచ్చినంత పని అయింది" అని సమాధానమిచ్చారు. ఒక మనిషి జీవితంలో విజయం, అపజయం రెండింటినీ దాటుకుని వస్తేనే ముందుకు వెళ్తాడని ఆయన అభిప్రాయపడ్డారు. ఆయన దృష్టిలో అతిగా వచ్చే సక్సెస్ అయినా, కుంగదీసే ఫెయిల్యూర్ అయినా రెండూ సమస్యలేనని, ఆ ఒత్తిడిని తట్టుకోవడం అప్పట్లో తనకు ఒక సవాలుగా అనిపించిందని తెలిపారు.

ఓం శాంతి శాంతి శాంతిః.. తరుణ్ మార్క్ క్రేజీ ఎంటర్టైనర్:

ఇక జనవరి 30న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ఓం శాంతి శాంతిః చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ మూవీ లో ఈషా రెబ్బ హీరోయిన్ గా..తరుణ్ భాస్కర్ తనదైన శైలిలో రాసుకున్న ఈ కథలో యూత్ ఫుల్ ఎలిమెంట్స్ తో పాటు హ్యూమర్ పీక్స్ లో ఉంటుందని సమాచారం. ఈ సినిమాతో పాటు తరుణ్ మరికొన్ని క్రేజీ ప్రాజెక్టులకు కూడా శ్రీకారం చుట్టారు. కేవలం దర్శకత్వమే కాకుండా, నటుడిగా కూడా బిజీగా ఉంటూనే తన మార్క్ సినిమాలను లైన్ లో పెడుతున్నారు. ప్రతి సినిమాలోనూ లోకల్ నేటివిటీని తనదైన శైలిలో చూపించే తరుణ్, ఈసారి కూడా బాక్సాఫీస్ వద్ద మ్యాజిక్ చేస్తారని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

విజయాన్ని తలకెక్కించుకోకుండా, అపజయానికి కుంగిపోకుండా ఉండటమే అసలైన గెలుపు అని తరుణ్ భాస్కర్ మాటలు నిరూపిస్తున్నాయి. 'పెళ్లి చూపులు' నాటి ఆందోళన నుండి నేడు 'ఓం శాంతి శాంతి శాంతిః' వరకు ఆయన ప్రయాణం ఎందరో యువ దర్శకులకు స్ఫూర్తిదాయకం. గతాన్ని ఒక పాఠంగా భావిస్తూ, వర్తమానంలో వైవిధ్యమైన కథలతో వస్తున్న తరుణ్ భాస్కర్, ఈ సినిమాతో మరోసారి తెలుగు సినిమా స్థాయిని పెంచుతారని ఆశిద్దాం. జనవరి 30న థియేటర్లలో ఈ సినిమా ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తుందో వేచి చూడాలి.

Tags:    

Similar News