తెరవెనుక క్లాష్.. చేతులు మారుతున్న క్రేజీ ప్రాజెక్ట్?

టాలీవుడ్‌లో ఒక భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఒక స్టార్ డైరెక్టర్, అగ్ర హీరో కలయికలో సినిమా ఉండబోతోందని ఇన్నాళ్లూ ప్రచారం సాగింది.;

Update: 2026-01-27 13:30 GMT

టాలీవుడ్‌లో ఒక భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఒక స్టార్ డైరెక్టర్, అగ్ర హీరో కలయికలో సినిమా ఉండబోతోందని ఇన్నాళ్లూ ప్రచారం సాగింది. కానీ ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ పట్టాలెక్కకముందే రకరకాల మలుపులు తిరుగుతోంది. ముఖ్యంగా హీరో మారుతున్నాడనే వార్త ఫిల్మ్ నగర్ సర్కిల్స్‌లో జోరుగా వినిపిస్తోంది. అధికారికంగా ఎలాంటి ప్రకటన లేకపోవడంతో ఈ ఊహగానాలకు మరింత బలం చేకూరుతోంది.

ఈ ప్రాజెక్ట్ చేతులు మారడం వెనుక ఒక బలమైన కారణం ఉందనే టాక్ వినిపిస్తోంది. హీరోకు, దర్శకుడికి మధ్య జరిగిన ఒక 'ఈగో క్లాష్' కారణంగానే ఈ సినిమా పట్టాలు తప్పిందని సమాచారం. ఇద్దరి మధ్య అభిప్రాయ భేదాలు రావడంతో, ఆ దర్శకుడు ఇప్పుడు అదే కథను మరో హీరో వద్దకు తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. ఇన్నాళ్లూ తమ ఫేవరెట్ హీరోనే ఈ సినిమా చేస్తాడని ఆశపడ్డ అభిమానులకు ఇది మింగుడుపడని విషయంగా మారింది.

నిజానికి ఈ ప్రాజెక్ట్ అనౌన్స్ అయినప్పుడు అంచనాలు హై రేంజ్ లో పెరిగాయి. ఒక పౌరాణిక నేపథ్యం ఉన్న టైటిల్‌తో ఈ సినిమా రాబోతోందని, ఇందుకోసం సదరు హీరో గెటప్ కూడా మార్చబోతున్నారని వార్తలు వచ్చాయి. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయ్యింది. ఒక హీరో నుంచి మరో హీరో వద్దకు, అక్కడి నుంచి ఇంకో హీరో వద్దకు ఈ కథ చక్కర్లు కొడుతోంది. ప్రస్తుతం ఒక స్టార్ హీరో ఈ ప్రాజెక్టుపై ఆసక్తి చూపిస్తున్నాడనే ప్రచారం జరుగుతోంది.

ఈ పరిణామాల వల్ల ఎవరు నష్టపోయారు, ఎవరికి లాభం చేకూరింది అనే చర్చ ఇప్పుడే అనవసరం. ఎందుకంటే బాక్సాఫీస్ వద్ద ఫలితం తేలే వరకు ఏదీ చెప్పలేం. దర్శకుడు తన విజన్‌ను అలాగే ఉంచి కేవలం హీరోను మాత్రమే మారుస్తున్నాడా? లేక కథలో కూడా మార్పులు చేస్తున్నాడా? అనేది సస్పెన్స్‌గా మారింది. ఈ అగ్రిమెంట్లు, క్లాష్‌ల మధ్య అసలు సినిమా ఎప్పుడు మొదలవుతుందనేది మిలియన్ డాలర్ల ప్రశ్న.

మరోవైపు సదరు హీరో కూడా తన తదుపరి ప్రాజెక్టులతో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఒక క్రేజీ దర్శకుడితో పాన్ ఇండియా సినిమా చేస్తున్నాడు. డేట్ల సర్దుబాటు కుదరకపోవడం కూడా ఈ క్లాష్‌కి ఒక కారణం కావొచ్చు. ఏదేమైనా ఒక భారీ ప్రాజెక్ట్ ఇలా హీరోల మధ్య ఊగిసలాడటం పరిశ్రమలో చర్చనీయాంశంగా మారింది. ఫ్యాన్స్ మాత్రం తమ హీరోనే ఈ సినిమాలో ఉండాలని గట్టిగా కోరుకుంటున్నారు.మొత్తానికి ఈ భేదాభిప్రాయాలు ఎటు దారితీస్తాయో చూడాలి. ఈగోలు పక్కన పెట్టి మళ్ళీ పాత కాంబినేషనే సెట్ అవుతుందా? లేక కొత్త హీరోతోనే దర్శకుడు ముందుకు వెళ్తాడా? అనేది త్వరలోనే తేలిపోనుంది.

Tags:    

Similar News