సెట్లలో లైంగిక దోపిడీ నుంచి బాలల్ని కాపాడే చట్టాలు!
సినీ పరిశ్రమలో బాల నటుల భద్రత, వారిపై జరుగుతున్న వేధింపుల నిరోధానికి సంబంధించి ఇటీవల ప్రపంచవ్యాప్తంగా చాలా తీవ్ర చర్చలు జరుగుతున్నాయి.;
సినీ పరిశ్రమలో బాల నటుల భద్రత, వారిపై జరుగుతున్న వేధింపుల నిరోధానికి సంబంధించి ఇటీవల ప్రపంచవ్యాప్తంగా చాలా తీవ్ర చర్చలు జరుగుతున్నాయి. హాలీవుడ్ లో తిమోతీ బస్‌ఫీల్డ్ కేసు, ఇతర పరిణామాలు ఈ వ్యవస్థలో ఉన్న లోపాలను ఎత్తిచూపుతున్నాయి.
దీనికి సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. ప్రముఖ హాలీవుడ్ నటుడు, దర్శకుడు తిమోతీ బస్‌ఫీల్డ్‌పై ఇటీవల వచ్చిన ఆరోపణలు సంచలనం సృష్టించాయి. 80లలో ఒక టీవీ షో సెట్‌లో మైనర్ బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆయనపై కేసులు నమోదయ్యాయి. బాధితురాలు అప్పట్లో చైల్డ్ ఆర్టిస్ట్‌గా పనిచేస్తుండగా, బస్‌ఫీల్డ్ తన అధికారాన్ని ఉపయోగించి ఆమెను వేధించినట్లు పేర్కొన్నారు. ఈ కేసు వల్ల పాత కాలపు హాలీవుడ్ సెట్లలో భద్రత ఎంత బలహీనంగా ఉండేదో మరోసారి స్పష్టమైంది.
క్వైట్ ఆన్ సెట్ - నికెలోడియన్ (టీవీ చానెల్) వివాదం గురించి ఈ సందర్భంగా ప్రస్థావించాలి. 2024 చివరలో అలాగే 2025లో విడుదలైన `క్వైట్ ఆన్ సెట్: ది డార్క్ సైడ్ ఆఫ్ కిడ్స్ టీవీ` అనే డాక్యుమెంటరీ సిరీస్ హాలీవుడ్‌ను కుదిపేసింది. పాపులర్ నికెలోడియన్ స్టార్ డ్రేక్ బెల్, తాను చిన్నప్పుడు ఒక డైలాగ్ కోచ్ చేతిలో ఎలా లైంగిక వేధింపులకు గురైందో ఈ సిరీస్ లో బహిరంగంగా వెల్లడించారు. నికెలోడియన్ వంటి పాపులర్ ఛానెళ్ల సెట్లలో పిల్లల పట్ల వివక్ష, వేధింపులు, భద్రతా లోపాలు ఉన్నాయని ఈ డాక్యుమెంటరీ బయటపెట్టింది.
వేధింపుల నిరోధానికి హాలీవుడ్ ఇప్పుడు కఠినమైన నిబంధనలను అమలు చేస్తోంది. దీనికోసం కొత్త చట్టాలు అమల్లోకి వచ్చాయి. దాని ప్రకారం... ప్రతి సెట్‌లో పిల్లలు ఉన్నప్పుడు తప్పనిసరిగా ఒక `చైల్డ్ సేఫ్టీ కోఆర్డినేటర్` ఉండాలి. వారు పిల్లల మానసిక, శారీరక భద్రతను పర్యవేక్షిస్తారు. చిన్న పిల్లలు పాల్గొనే సున్నితమైన సన్నివేశాల్లో ఏవైనా అభ్యంతరాలు ఉంటే పర్యవేక్షించడానికి ఇంటిమసీ కోఆర్డినేటర్లను నియమిస్తున్నారు. సెట్‌లో పనిచేసే ప్రతి సాంకేతిక నిపుణుడికి (లైట్ బాయ్ నుండి దర్శకుడి వరకు) కఠినమైన బ్యాక్‌గ్రౌండ్ చెక్ నిర్వహిస్తున్నారు.
బాల నటుల ఆన్‌లైన్ డేటాను, వారి ప్రైవసీని రక్షించడానికి కొత్త చట్టాలను తీసుకొచ్చారు. కాలిఫోర్నియా ఏజ్ యాక్ట్ అని దీనిని పిలుస్తున్నారు. చాలా రాష్ట్రాలు చిన్నప్పుడు జరిగిన వేధింపులపై బాధితులు ఎప్పుడైనా (ఎన్ని ఏళ్ల తర్వాతైనా) కేసు పెట్టేలా చట్టాలను సవరించాయి.
సినిమా రంగం ఎంత గ్లామరస్‌గా కనిపిస్తుందో, దాని వెనుక ఉన్న చీకటి కోణాలను రూపుమాపేందుకు ఇటీవల కొన్నేళ్లుగా బాధితులు ధైర్యంగా ముందుకు వస్తున్నారు. ఇటీవలి మీటూ ఉద్యమం చాలా వరకూ వారిలో ధైర్యాన్ని నింపింది. తిమోతీ బస్‌ఫీల్డ్ వంటి కేసులు మరిన్ని బయటకు రావడం వల్ల, ప్రస్తుత తరం బాల నటులకు సురక్షితమైన వాతావరణం లభిస్తుందని ఆశించవచ్చు.
అయితే భారతీయ చలనచిత్ర పరిశ్రమలో బాలలపై లైంగిక నేరాలకు ఎలాంటి శిక్షలు ఉన్నాయి? అంటే... దీనికోసం భారతీయ ప్రభుత్వం POCSO చట్టం అమలులోకి తెచ్చింది.