గోల్డ్ స్పాట్ గ్లింప్స్: ఫీల్‌గుడ్ లవ్‌స్టోరీతో అంబాజీపేట డైరెక్టర్ కొత్త ప్రయోగం

విజువల్స్ పరంగా ఈ గ్లింప్స్ చాలా ఫ్రెష్‌గా అనిపిస్తుంది. కొండ ప్రాంతాలు, పచ్చటి చెట్లు, ఒంటరిగా ఉన్న భారీ మర్రిచెట్టు నేపథ్యం కథలోని నేటివిటీని హైలెట్ చేస్తున్నాయి.

Update: 2026-09-07 06:42 GMT

​టాలీవుడ్‌లో కంటెంట్ బేస్డ్ సినిమాలకు ఎప్పుడూ మంచి క్రేజ్ ఉంటుంది. 'అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్' లాంటి నేచురల్ ఎమోషనల్ డ్రామాతో మెప్పించిన దర్శకుడు దుష్యంత్ కటికనేని ఇప్పుడు కొత్త రూట్లో వెళుతున్నది. క్రియేటర్‌గా వ్యవహరిస్తూ కథ అందిస్తున్న సరికొత్త చిత్రం 'గోల్డ్ స్పాట్'. వేణు కార్తికేయన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా నుంచి విడుదలైన అఫీషియల్ గ్లింప్స్ ప్రస్తుతం నెట్టింట సినిమా లవర్స్ ను ఎట్రాక్ట్ చేస్తోంది.

​గ్లింప్స్ ఆరంభమే చాలా పొయెటిక్‌గా, హృదయానికి హత్తుకునే వాయిస్‌ఓవర్‌తో మొదలవుతుంది. చిన్నప్పుడే తల్లిని దూరం చేసిన దేవుడికి ఇంకెప్పుడూ దణ్ణం పెట్టకూడదు అనుకున్న అమ్మాయికి, అదే దేవుడు రామ్ అనే వ్యక్తిని పరిచయం చేసిన తీరును ఇందులో ఎంతో ఆర్గానిక్‌గా చూపించారు. ఒక పవిత్రమైన బంధాన్ని, భావోద్వేగాల లోతును ఒక్క సన్నివేశంలోనే రివీల్ చేస్తూ మేకర్స్ కథలోని ఇంటెన్సిటీని పరిచయం చేశారు.

డైలాగ్స్ ఆలోచింపజేసేలా ఉన్నాయి. "చాలామంది మన జీవితంలోకి వచ్చి వెళ్తూ ఉంటారు.. కానీ ఎవరో ఒక్కరు మాత్రమే మన జీవితం అయిపోతారు. అలా నా జీవితంలోని ప్రతి జ్ఞాపకానికి మొదటి అక్షరం నా రామ్" అనే డైలాగ్ యూత్‌కి బాగా కనెక్ట్ అవుతోంది. ప్రేమ తాలూకు జ్ఞాపకాలను ఇంత బ్యూటిఫుల్‌గా హైలెట్ చేయడం ఆడియన్స్‌కి మంచి వైబ్ ఇస్తోంది. రామ్ పాత్రలో అభిషేక్, కథానాయికగా కాజల్ చౌదరి తమ ఎక్స్‌ప్రెషన్స్‌తో చక్కగా మెప్పించారు.

​విజువల్స్ పరంగా ఈ గ్లింప్స్ చాలా ఫ్రెష్‌గా అనిపిస్తుంది. కొండ ప్రాంతాలు, పచ్చటి చెట్లు, ఒంటరిగా ఉన్న భారీ మర్రిచెట్టు నేపథ్యం కథలోని నేటివిటీని హైలెట్ చేస్తున్నాయి. దానికి తోడు రాత్రి పూట కురిసే వర్షంలో, ఎస్టీడీ బూత్ వెలుగుల్లో హీరో హీరోయిన్లు ఎదురుపడే ఫ్రేమ్ సినిమాటిక్ ఫీల్‌ను అమాంతం పెంచేసింది. బ్యాక్‌గ్రౌండ్‌లో వచ్చే సోల్‌ఫుల్ మ్యూజిక్ ఈ లవ్ డ్రామాను మరింత డీప్‌గా మార్చింది.

​ఈ ప్రాజెక్ట్‌ను విజయ్ కృష్ణ లింగమనేని సమర్పిస్తుండగా, రావిపాటి రవితేజ పాచిపాల నిర్మిస్తున్నారు. రాడిక్స్ సినిమాస్ బ్యానర్‌పై వస్తున్న ఈ చిత్రానికి నరేన్ రెడ్డి సంగీతం అందించగా, నరేష్ అడుప సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. సరికొత్త కాంబినేషన్‌లో వస్తున్నప్పటికీ ప్రొడక్షన్ వేల్యూస్, టెక్నికల్ స్టాండర్డ్స్ చాలా ప్రామిసింగ్‌గా కనిపిస్తున్నాయి. ప్యూర్ ఎమోషన్స్‌తో కూడిన ఈ లవ్ స్టోరీ పూర్తి వివరాలు, టీజర్ త్వరలోనే రానున్నాయి.

Tags:    

Similar News