• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  విజయ్ GOAT .... ఖండించిన...

విజయ్ GOAT .... ఖండించిన నిర్మాత‌

| ద‌ళ‌ప‌తి విజయ్ న‌టిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ `ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్` (ది గోట్) రిలీజ్ ఆల‌స్య‌మ‌వుతోందంటూ పుకార్ షికార్ చేస్తోంది.

By - Tupaki Desk
Update: 2024-07-29 05:30 GMT

ద‌ళ‌ప‌తి విజయ్ న‌టిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ `ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్` (ది గోట్) రిలీజ్ ఆల‌స్య‌మ‌వుతోందంటూ పుకార్ షికార్ చేస్తోంది. అయితే నిర్మాత అర్చన కల్పాతి ఈ ప్ర‌చారాన్ని ఖండించారు. అసంపూర్తిగా ఉన్న VFX పని కారణంగా GOAT ఆలస్యం అవుతుందని ఊహాగానాలు చెల‌రేగ‌గా.. దీనిపై వెంట‌నే నిర్మాత స్పందించారు. అర్చన కల్పాతి సోషల్ మీడియాల్లో దీనిపై స్ప‌ష్ఠ‌త‌నిచ్చారు. ఈ చిత్రం 5 సెప్టెంబర్ 2024న ముందే ప్ర‌క‌టించిన తేదీన‌ విడుదలకు షెడ్యూల్‌లో ఉందని తెలిపారు. అలాగే గోట్ మూడవ సింగిల్‌కి సంబంధించి ఒక కొత్త అప్‌డేట్ 1ఆగస్ట్ 2024న చెబుతామ‌ని తెలిపారు. ఇది విజ‌య్ అభిమానుల్లో ఉత్సాహం పెంచింది.

ఈ చిత్రంలో విజయ్ సరసన మీనాక్షి చౌదరి నటించారు. జయరామ్, స్నేహ, లైలా, యోగి బాబు, VTV గణేష్, అజ్మల్ అమీర్, మైక్ మోహన్, వైభవ్, ప్రేమి, అజయ్ రాజ్, అరవింద్ ఆకాష్ ప్ర‌ధాన తారాగ‌ణం. వెంక‌ట్ ప్ర‌భు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. AGS ఎంటర్‌టైన్‌మెంట్ ప‌తాకంపై అర్చన కల్పాతి -కల్పాతి S. అఘోరమ్ నిర్మిస్తున్నారు.

ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ పాన్ ఇండియా కేట‌గిరీలో దేశ‌వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ LLP తెలుగు వెర్షన్‌ను పంపిణీ చేస్తుంది. దీనికి యువన్ శంకర్ రాజా సంగీతం ప్ర‌ధాన అస్సెట్ కానుంది. విజ‌య్ ఈ చిత్రంలో ద్విపాత్రాభిన‌యం చేస్తుండ‌డంతో స‌ర్వ‌త్రా ఆస‌క్తి నెల‌కొంది. ఇప్ప‌టికే పోస్ట‌ర్ల‌కు మంచి స్పంద‌న ల‌భించింది.

మైత్రి హ‌వా విజ‌య్ `గోట్`కి ప్ల‌స్

పాన్ ఇండియా ప్రొడక్షన్ హౌస్ మైత్రీ మూవీ మేకర్స్ ప్ర‌స్తుతం వ‌రుస‌ చిత్రాలను నిర్మిస్తోంది. కొన్ని ఆసక్తికరమైన ప్రాజెక్ట్‌లు ప్ర‌స్తుతం ప్రీప్రొడ‌క్ష‌న్ ద‌శ‌లో ఉన్నాయి. మైత్రి ఇటీవలి కాలంలో నైజాంలో సలార్, హను-మాన్ వంటి ఇతర బ్యాన‌ర్ల‌ సినిమాల‌ను విజయవంతంగా పంపిణీ చేసింది. మైత్రీ మూవీ మేకర్స్ ద్వారా తెలుగు రాష్ట్రాల్లో విడుదలైన మలయాళ చిత్రం మంజుమ్మెల్ బాయ్స్ ఇక్కడ కూడా బంపర్ హిట్ అయ్యింది. ఇప్పుడు, వెంకట్ ప్రభు దర్శకత్వం వహించిన ది గోట్ (ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్) చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో విడుద‌ల చేస్తూ మైత్రీ మూవీ మేకర్స్ విడుదల భాగస్వామిగా మార‌డం ఉత్సాహం పెంచింది. ఈ క్రేజీ పాన్ ఇండియా ఫిల్మ్ ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో భారీ ప్రమోషన్లతో గ్రాండ్ రిలీజ్ ఉంటుందని మైత్రి తెలిపింది.

Not true. We are very much on track and working 24/7 to make a kickass film. Please don’t spread negativity and false news.

— Archana Kalpathi (@archanakalpathi) July 29, 2024
Tags:    
  • GOAT 
  • Thalapathyvijay 
  • Venkataprabhu 
  • Kollywood 
  • Filmindustry 
  • Leo 
  • Archanakalpathi 
  • Vfxwork 
  • Thegreatestofalltime 

Similar News

నిజంగా దెబ్బలు తిన్న హీరోయిన్.. కానీ అమ్మా నాన్నకి ఆ సినిమానే ఇష్టమంట..!

2026-11-05 02:31 GMT

ఇద్దరు తమిళ హీరోలు.. ఒక తెలుగు హీరో.. జరగబోనుంది ఏమిటి..?

2026-11-05 02:30 GMT

టాలీవుడ్ రెండు లెజెండరీ ఫ్యామిలీలతో మెగాస్టార్..!

2026-11-05 01:30 GMT

'జైలర్ 2' విజువల్స్ కొత్తగా కనిపించడానికి వాడిన టెక్నిక్ ఏంటంటే?

2026-11-05 00:30 GMT

సుకుమార్ రామ్ చరణ్ ను రంగస్థలం లో చెవిటి వాడిగా చూపించాడు. ఇప్పుడెలా చూపిస్తున్నాడో తెలుసా?

2026-11-04 23:30 GMT

Tollywood: చిన్న తప్పు కూడా పెద్ద ముప్పే!

2026-11-04 22:30 GMT

చిరంజీవి, బాలయ్య, వెంకటేష్, నాగార్జున కాంబోలో మూవీ రాబోతోందా?

2026-11-04 19:30 GMT

'ఆపరేషన్ సింధూర్'పై రేసింగ్: 10 సినిమాలు ప్ర‌క‌టించారు కానీ..!

2026-11-04 18:30 GMT

తమిళ ఇండస్ట్రీ కన్నా తెలుగు ఇండస్ట్రీలోనే గౌరవం..!

2026-11-04 18:03 GMT

Bigg Boss Telugu 10: తొమ్మిదో వారం డేంజర్ జోన్‌లో ఆ ఐదుగురు!

2026-11-04 18:02 GMT

Bigg Boss Telugu 10: 'రివార్డ్ అండ్ రివెంజ్' లో అదిరిపోయే ట్విస్ట్స్

2026-11-04 18:02 GMT

ఎన్నో మల్టీస్టారర్లలో.. ఈ రాబోయే తెలుగు మల్టీస్టారర్ మిన్న!

2026-11-04 18:01 GMT

Copyright @2026

Powered by Blink CMS