ఘాటీ ప్రపంచంలో 'దస్సోర దస్సోర'

లిరిక్స్ ఘాటీల జీవితంలో ఎదురయ్యే కష్టాలు, వాస్తవాన్ని హైలెట్ చేశాయి. రాక్ స్టైల్ మ్యూజిక్‌తో పాటను బలంగా నిలిపారు.;

Update: 2025-08-20 16:40 GMT

టాలీవుడ్ క్వీన్ అనుష్క శెట్టిని బిగ్ స్క్రీన్ పై చూసి చాలా కాలమైంది. ఇక మరోసారి తన ప్రత్యేకమైన స్క్రిప్ట్ సెలెక్షన్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఘాటీ అనే యాక్షన్ డ్రామాలో ఆమె కీలక పాత్రలో నటిస్తోంది. ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ చిత్రానికి క్రిష్ జగర్లమూడి దర్శకత్వం వహిస్తుండగా, యువీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ కలిసి భారీ బడ్జెట్ పై నిర్మిస్తున్నారు.

ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన టీజర్, ట్రైలర్, ఫస్ట్ సాంగ్ సూపర్ రెస్పాన్స్ పొందాయి. సినిమా మీద అంచనాలు ఒక్కసారిగా పెంచేశాయి. తాజాగా దస్సోర దస్సోర అనే పవర్ ప్యాక్డ్ రాక్ సాంగ్‌ను రిలీజ్ చేశారు. ఈ సాంగ్ తో సినిమా చుట్టూ హైప్ మరింత పెరిగింది. ఈ పాటను సంగీత దర్శకుడు సాగర్ నాగవల్లి కంపోజ్ చేయగా, లిరిక్స్ ను ఈఎస్ మూర్తి రాశారు.

లిరిక్స్ ఘాటీల జీవితంలో ఎదురయ్యే కష్టాలు, వాస్తవాన్ని హైలెట్ చేశాయి. రాక్ స్టైల్ మ్యూజిక్‌తో పాటను బలంగా నిలిపారు. గీతా మాధురి, సాకేత్ కోమందూరి, శ్రుతి రంజని తమ ఎనర్జిటిక్ వాయిస్ తో ఈ సాంగ్ ను మరింత పవర్‌ఫుల్ చేశారు. అదే సమయంలో పాటలో చూపించిన యాక్షన్ సీన్స్, బీటీఎస్ క్లిప్స్ సినిమాకు ఉన్న ఇంటెన్సిటీని స్పష్టంగా చూపించాయి.

క్రిష్ జగర్లమూడి తన విజన్ తో, ప్యాషన్ తో తెరకెక్కిస్తున్న ఈ మూవీ, టెక్నికల్ విలువల పరంగా కూడా వేరే లెవెల్ లో కనిపిస్తోంది. ప్రతి ఫ్రేమ్ లో డీటైలింగ్ అద్భుతంగా ఉందని ఇప్పటికే టాక్. అనుష్క శెట్టి స్క్రీన్ ప్రెజెన్స్ మరీ ప్రత్యేకంగా కనిపిస్తోంది. ఆమె బాడీ లాంగ్వేజ్, ఇంటెన్సిటీ అందరినీ ఆకట్టుకునేలా ఉంది. విక్రమ్ ప్రభు మరో ముఖ్యమైన పాత్రలో నటిస్తుండగా, హీరోయిన్ గా అనుష్క చేసే సీన్స్ సినిమాకు మేజర్ హైలైట్ అవుతాయని తెలుస్తోంది.

ఘాటీ పాన్ ఇండియా స్థాయిలో, మల్టిపుల్ లాంగ్వేజెస్ లో సెప్టెంబర్ 5న విడుదల అవుతోంది. యాక్షన్ తో పాటు భావోద్వేగాలు కలిపి రూపొందించిన ఈ సినిమా ప్రేక్షకులను బలంగా కట్టిపడేస్తుందనే నమ్మకం క్రిష్ టీమ్ లో ఉంది. ఇప్పుడు రిలీజ్ చేసిన దస్సోర దస్సోర పాటతో ఆ అంచనాలు మరింత రెట్టింపు అయ్యాయి. ఇక సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి అంచనాలను అందుకుంటుందో చూడాలి.

Full View
Tags:    

Similar News