ఘాటైన ముద్దులో GOG జోడి

విమర్శకుల నుంచి కూడా ప్రశంసలు అందుకున్నారు.

Update: 2024-05-07 10:46 GMT

విశ్వక్ సేన్.. ఈ టాలీవుడ్ యంగ్ హీరో రేంజే వేరు. తెలుగు సినీ ఇండస్ట్రీలో మల్టీ టాలెంటెడ్ గా దూసుకెళ్తున్నారు. వరుస చిత్రాలు చేస్తూ అలరిస్తున్నారు. తన యాక్టింగ్ తో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంటున్నారు. ఇటీవల ప్రయోగాత్మక చిత్రం గామితో వచ్చి మంచి హిట్ కొట్టారు. ఎవరూ చేయడానికి సాహసించని అఘోర శంకర్ రోల్ లో కనిపించి ఆకట్టుకున్నారు. విమర్శకుల నుంచి కూడా ప్రశంసలు అందుకున్నారు.


ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో బిజీగా ఉన్న మాస్ కా దాస్.. త్వరలోనే గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి చిత్రంతో సందడి చేయనున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా.. మే 17వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ మూవీపై ఆడియన్స్ లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవల మేకర్స్ విడుదల చేసిన టీజర్.. సినిమాపై మరింత హైప్ క్రియేట్ చేసింది. టీజర్ లో లంకల రత్నగా విశ్వక్ అదరగొట్టేశారు.

ఇక రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో మేకర్స్ ప్రమోషన్ల స్పీడ్ పెంచారు. తాజాగా అదిరిపోయే పోస్టర్ ను విడుదల చేశారు. అందులో విశ్వక్ సేన్ తో పాటు హీరోయిన్ నేహా శెట్టి ఉన్నారు. టీజర్ యమా మాస్ గా ఉండగా.. రీసెంట్ పోస్టర్ రొమాంటిక్ గా ఉంది. హీరోహీరోయిన్లలిద్దరూ ఘాటుగా లిప్ లాక్ పెట్టుకుంటున్నట్టు చూపించారు. బ్యాక్ గ్రౌండ్ అంతా బ్లాక్ మోడ్ లో అదిరిపోయింది. మూవీ రిలీజ్ కు మరో పది రోజులు టైమ్ ఉన్నట్లు మేకర్స్ గుర్తు చేశారు.

Read more!

అయితే ఈ సినిమా టీజర్ రిలీజ్ ఈవెంట్ లో ఫలక్‍ నామా దాస్ చిత్రంతో తనకు వచ్చిన మాస్ కా దాస్ ట్యాగ్‍ కు గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మూవీ న్యాయం చేస్తుందని విశ్వక్ సేన్ తెలిపారు. దీంతో మూవీపై అంచనాలు ఓ రేంజ్ లో పెరిగిపోయాయి. గోదావరి జిల్లాల బ్యాక్ డ్రాప్ లో గ్యాంగ్ స్టర్ డ్రామాగా రానున్న ఈ సినిమాలో స్టార్ హీరోయిన్ అంజలి ముఖ్య పాత్ర పోషిస్తోంది. వేశ్యగా కనిపించనున్నట్లు సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.

ఈ సినిమాకు ఛల్ మోహన్ రంగ ఫేమ్ కృష్ణ చైతన్య దర్శకత్వం వహించగా.. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు. యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన లిరికల్ సాంగ్స్.. మ్యూజిక్ లవర్స్ ను ఆకట్టుకున్న విషయం తెలిసిందే. మరి ఈ చిత్రం విశ్వక్ సేన్ కు ఎలాంటి హిట్ ఇస్తుందో చూడాలి.

Tags:    

Similar News