GOG లీడర్.. మాస్ కా బాప్

విశ్వక్ సేన్ హీరోగా టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ క్రియేట్ చేసుకునే దిశగా అడుగులు వేస్తున్నాడు

Update: 2024-05-09 04:02 GMT

విశ్వక్ సేన్ హీరోగా టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ క్రియేట్ చేసుకునే దిశగా అడుగులు వేస్తున్నాడు. సినిమా సినిమాకి వేరియేషన్ చూపిస్తూ కొత్త కథలను ప్రయత్నం చేస్తున్నాడు. డిఫరెంట్ గా తనని తాను ఎస్టాబ్లిష్ చేసుకుంటున్నాడు. దాస్ కా దమ్కీ సినిమాతో కమర్షియల్ హీరోగా విశ్వక్ సేన్ సక్సెస్ అందుకున్నారు.

అలాగే ఈ ఏడాది గామి చిత్రంతో మరో విభిన్నమైన కథని ప్రేక్షకులకి అందించాడు. ఈ మూవీ కూడా హిట్ టాక్ సొంతం చేసుకుంది. ఇప్పుడు గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి అంటూ గోదావరి జిల్లాలో రౌడీయిజాన్ని, రాజకీయాన్ని కలిపి చూపించే ప్రయత్నం చేస్తున్నాడు. ఈ సినిమా కోసం విశ్వక్ గోదావరి స్లాంగ్ కూడా నేర్చుకొని డబ్బింగ్ చెప్పడం విశేషం.

కృష్ణ చైతన్య దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ టీజర్ ఇప్పటికే ప్రేక్షకుల ముందుకు వచ్చి ఆకట్టుకుంది. సాంగ్స్ కూడా సూపర్ హిట్ అయ్యాయి. దీంతో సినిమా పై మంచి బజ్ క్రియేట్ నడుస్తోంది. ఈ మూవీ నుంచి రెగ్యులర్ గా పోస్టర్స్ రిలీజ్ చేస్తూ పబ్లిక్ లో పాజిటివ్ వైబ్ క్రియేట్ చేసే ప్రయత్నం చిత్ర యూనిట్ చేస్తోంది. మే 17న ప్రపంచ వ్యాప్తంగా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి రిలీజ్ కాబోతోంది.

ఇప్పటికే చిత్ర యూనిట్ ప్రమోషన్ ఆక్టివిటీస్ షురూ చేసింది. ఇదిలా ఉంటే తాజాగా మరో అప్డేటెడ్ పోస్టర్ ని రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ లో చుట్టూ రాజకీయ పార్టీ జెండాలు ఉన్నాయి. వాటి ముందు బ్లాక్ షర్ట్, పంచకట్టుతో స్టైలిష్ గా కళ్ళజోడు ధరించి, న్యూ లుక్ తో విశ్వక్ సేన్ కనిపిస్తూ ఉండడం విశేషం. ఒక పవర్ఫుల్ మాస్ నాయకుడిగా విశ్వక్ మెరిసిపోతున్నాడు.

ఈ లుక్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాకి పెద్ద అస్సెట్ గా ఉందనే మాట వినిపిస్తోంది. సాధారణ జీవితం నుంచి పవర్ ఫుల్ లీడర్ గా విశ్వక్ సేన్ ఈ సినిమాలో మారబోతున్నట్లు అర్థమవుతుంది. అలాగే ఆ పాత్రలో కాస్త నెగిటివ్ షేడ్స్ కూడా ఉంటాయట మూవీ పై పాజిటివ్ వైబ్ ఉన్న నేపథ్యంలో ఓపెనింగ్స్ అయితే సాలిడ్ గా రావడం గ్యారంటీ అనే మాట ట్రేడ్ పండితుల నుంచి వినిపిస్తోంది.

Tags:    

Similar News