• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  గ్యాంగ్స్ ఆఫ్ గోదావ‌రికి...

గ్యాంగ్స్ ఆఫ్ గోదావ‌రికి ఆ డేట్?

| టాలీవుడ్ యువ క‌థానాయ‌కుడు విశ్వ‌క్సేన్ ఆదివారం ఉద‌యం పెట్టిన ఒక సోషల్ మీడియా పోస్టు చిన్న‌పాటి క‌ల‌క‌ల‌మే రేపింది టాలీవుడ్లో

By - Tupaki Desk
Update: 2023-10-30 04:40 GMT

టాలీవుడ్ యువ క‌థానాయ‌కుడు విశ్వ‌క్సేన్ ఆదివారం ఉద‌యం పెట్టిన ఒక సోషల్ మీడియా పోస్టు చిన్న‌పాటి క‌ల‌క‌ల‌మే రేపింది టాలీవుడ్లో. కొన్ని నెల‌ల ముందే డిసెంబ‌రు 9కి రిలీజ్ డేట్ ఖాయం చేసుకున్న త‌న సినిమా గ్యాంగ్స్ ఆఫ్ గోదావ‌రిని ఆ తేదీ నుంచి వాయిదా వేయించ‌డానికి ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయ‌నే అర్థం వ‌చ్చేలా అత‌ను ఈ పోస్ట్ పెట్టాడు. బ్యాగ్రౌండ్ లేక‌పోవ‌డం వ‌ల్ల త‌న‌ను తొక్కాల‌ని చూస్తున్నార‌ని.. ఎట్టి ప‌రిస్థితుల్లోనూ డిసెంబ‌రు 9న త‌న చిత్రం రావాల్సిందే అని నిర్మాతకు అల్టిమేటం కూడా విధించాడ‌త‌ను. ఆ రోజు గ్యాంగ్స్ ఆఫ్ గోదావ‌రిని రిలీజ్ చేయ‌క‌పోతే తాను ప్ర‌మోష‌న్ల‌లో కూడా పాల్గొన‌న‌ని అత‌ను హెచ్చ‌రించ‌డం హాట్ టాపిక్‌గా మారింది. ఈ స్థితిలో నిర్మాత నాగ‌వంశీ ఏం చేస్తాడా అని అంద‌రూ ఎదురు చూస్తున్నారు. ఐతే వంశీ అయితే ఈ సినిమా రిలీజ్ విష‌యంలో ఒక నిర్ణ‌యం తీసేసుకున్న‌ట్లు స‌మాచారం.

డిసెంబ‌రు రెండో వారంలో తీవ్ర‌మైన పోటీ ఉండ‌టం, థియేట‌ర్లు చాలిన‌న్ని దొరికే అవ‌కాశం లేక‌పోవ‌డంతో డిసెంబ‌రు 29న ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాల‌ని నాగ‌వంశీ డిసైడ‌య్యాడట‌. డిసెంబ‌రు మూడో వారం ఆప్ష‌న్ కూడా ఉన‌ప్ప‌టికీ స‌లార్ ముంగిట ఈ చిత్రాన్ని రిలీజ్ చేయ‌డం రిస్క్ అవుతుంద‌ని భావిస్తున్నాడ‌ట‌. అందుకే క్రిస్మ‌స్, సంక్రాంతి మ‌ధ్య‌లో డేట్‌ను ఎంచుకున్న‌ట్లు తెలుస్తోంది. ప్ర‌స్తుతానికి విశ్వ‌క్ బెట్టు చేస్తున్న‌ప్ప‌టికీ.. అత‌డికి స‌ర్దిచెప్పి, ప్ర‌మోష‌న్ల‌కు ఒప్పించి కొత్త డేట్ ప్ర‌క‌టించ‌బోతున్నార‌ట‌. ఈ సినిమా మీద టీం అంతా చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్న‌ప్ప‌టికీ స‌రైన డేట్ ఎంచుకోవ‌డం స‌వాలుగా మారింది. లిరిసిస్ట్ ట‌ర్న్డ్ డైరెక్ట‌ర్ కృష్ణ‌చైత‌న్య రూపొందించిన ఈ చిత్రంలో విశ్వ‌క్ స‌ర‌స‌న నేహా శెట్టి క‌థానాయిక‌గా న‌టించింది. గోదావ‌రి ప్రాంతంలో రౌడీ గ్యాంగుల పోరు నేప‌థ్యంలో న‌డిచే క‌థ ఇది.

Tags:    
  • Gangsofgodavari 
  • Vishwaksen 
  • Nehashetty 
  • Krishnachaitanya 
  • Gangsofgodavarimovie 
  • Filmindustry 

Similar News

శ్ర‌ద్ధాక‌పూర్ కొత్త‌ లుక్: న‌ట్టింట ల‌క్ష్మీ దేవి ప్ర‌త్య‌క్ష‌మైన‌ట్టు

2026-11-06 16:30 GMT

టైసన్ నాయుడు ఫస్ట్ సింగిల్.. క్యాచీ ఫోక్ బీట్ తో 'మదరాసి రబ్బరు బొమ్మ'

2026-11-06 16:03 GMT

సగం షెడ్యూల్‌కే గుడ్‌బై.. న్యాయపోరాటాలు!

2026-11-06 15:30 GMT

ఆఫర్లు తెచ్చిన మైకం.. కానీ నన్ను కాపాడింది అతడే!

2026-11-06 14:30 GMT

బ్యానర్‌లో కాదు.. ఆయనతోనే సినిమా చేయాలనుంది: మౌళి

2026-11-06 13:18 GMT

కమల్ హాసన్ బర్త్‌డే ట్రీట్.. అదిరిపోయిన సండియర్ ఫస్ట్ లుక్!

2026-11-06 13:15 GMT

రామాయణం తీయడానికి ఇంత ఖర్చు అవసరమా..!

2026-11-06 13:11 GMT

దీపావళి స్పెషల్.. వీకెండ్స్ లో సందడి చేయనున్న సినిమాలు, సిరీస్ లు ఇవే!

2026-11-06 13:03 GMT

వైజాగ్ నుంచి హాలీవుడ్ వరకు శోభిత గ్రాండ్ జర్నీ!

2026-11-06 12:30 GMT

చదువు,ఉద్యోగాలు వదిలేసి యువత థియేటర్ల ముందుండాలా?

2026-11-06 11:40 GMT

ఫేమస్ నటీమణులపై లేడీ సూపర్‌స్టార్ శ్రీదేవి ఇంపాక్ట్!

2026-11-06 11:30 GMT

మెగాస్టార్‌కు వ‌రుస‌గా బాంబ్ బెదిరింపులు.. అస‌లేం జ‌రుగుతోంది?

2026-11-06 10:49 GMT

Copyright @2026

Powered by Blink CMS