• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  మెగా ప్రిన్స్ కాస్ట్ లీ...

మెగా ప్రిన్స్ కాస్ట్ లీ మిస్టేక్స్..!

| ప్రవీణ్ సత్తారు వరుణ్ తేజ్ ని నమ్మి బోగవల్లి ప్రసాద్ ఈ సినిమాకు 50 కోట్ల బడ్జెట్ తో గాండీవధారి అర్జున నిర్మించారు

By - Tupaki Desk
Update: 2023-08-28 10:27 GMT

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ రీసెంట్ గా గాండీవధారి అర్జున సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ముందు నుంచి పెద్దగా బజ్ తెచ్చుకోలేదు రిలీజ్ ట్రైలర్స్ కాస్త సినిమాపై ఆసక్తి పెరిగేలా చేసినా థియేటర్ లో ఆడియన్స్ ని థ్రిల్ చేయడంలో విఫలమైంది. వరుణ్ తేజ్ కి ఇలాంటి షాక్ లు తగలడం కొత్తేమి కాదు. ఆల్రెడీ లాస్ట్ ఇయర్ గని అంటూ వచ్చి నిరాశపరిచాడు వరుణ్ తేజ్. గని సినిమా కోసం కూడా చాలా కష్టపడ్డాడు. అంతేకాదు ఆ సినిమా కు బడ్జెట్ కూడా భారీగానే అయ్యింది.

గని తర్వాత ఇంకాస్త ఫోకస్ తో ఉన్న వరుణ్ ప్రవీణ్ సత్తారు చెప్పిన కథకు లాక్ అయ్యాడు. అయితే సినిమా కథ వరకు ఓకే కానీ స్క్రీన్ మీద చూపించినప్పుడు ఆ ఫీల్ రాదు. వరుణ్ తేజ్ సినిమాల్లో అదే జరుగుతుంది. గాండీవధారి అర్జున కథ చెప్పినప్పుడు ఎగ్జైట్ అయ్యే వరుణ్ తేజ్ ఈ సినిమా చేసి ఉండొచ్చు కానీ సినిమా మాత్రం ఆడియన్స్ అంచనాలను అందుకోలేకపోయింది.

ప్రవీణ్ సత్తారు వరుణ్ తేజ్ ని నమ్మి బోగవల్లి ప్రసాద్ ఈ సినిమాకు 50 కోట్ల బడ్జెట్ తో గాండీవధారి అర్జున నిర్మించారు. వరుణ్ తేజ్ మార్కెట్ అంత లేకపోయినా సినిమా సబ్జెక్ట్ ని నమ్ముకుని ఖర్చు పెట్టారు. అయితే ఇందులో డైరెక్టర్ తప్పు ఎంత ఉంది హీరోది ఎంత ఉంది అన్నది పక్కన పెడితే ఇద్దరు కూడా నిర్మాత పెట్టిన బడ్జెట్ కి తగిన అవుట్ పుట్ ఇవ్వడంలో ఫెయిల్ అయ్యారు. గని, గాండీవధారి అర్జున ఈ రెండు సినిమాలు కూడా ఫెయిల్యూర్ అవడం వల్ల వరుణ్ తేజ్ కాస్ట్ లీ మిస్టేక్స్ గా ఆడియన్స్ చెప్పుకుంటున్నారు.

ఇలానే చేస్తే వరుణ్ తేజ్ కెరీర్ రిస్క్ లో పడే ఛాన్స్ ఉన్నట్టే లెక్క. ప్రేక్షకులు కొత్త కథలను ఎంకరేజ్ చేస్తారు కానీ అవి వాళ్లు యాక్సెప్ట్ చేసేలా తెరకెక్కించాలి తప్ప మరోలా అయితే రిజల్ట్ ఇలానే ఉంటుంది. సో ఇక మీదట అయినా వరుణ్ తేజ్ చేయకుండా ఉంటే బెటర్ అని చెప్పొచ్చు. మరి వరుణ్ తేజ్ తన కెరీర్ ప్లానింగ్ ఎలా చేసుకుంటాడన్నది చూడాలి. గాండీవధారి అర్జున సినిమా అనుకున్న రేంజ్ సక్సెస్ అందుకోలేదు. అందుకే వరుణ్ నెక్స్ట్ సినిమా ఆపరేషన్ వాలెంటైన్ మీద గురి పెట్టుకున్నారు మెగా ఫ్యాన్స్.

Tags:    
  • Varuntej 
  • Megaprince 
  • Gandeevadhariarjuna 
  • Praveensattaru 
  • Filmindustry 
  • Herovaruntej 
  • Ghanifilm 
  • Gandeevadhariarjunafilm 

Similar News

స్నేహితుల రియల్ లైఫ్ డ్రామానే సినిమా!

2026-11-05 10:08 GMT

'జైల‌ర్ 3'పై ఊహించని అప్‌డేట్‌.. ఆ ఏడాదే సెట్స్‌పైకి?

2026-11-05 10:01 GMT

దిగ్గజాల సమ్మేళనం: 1986 నాటి అన్న‌గారు ఎన్టీఆర్ విందులో చిరంజీవి!

2026-11-05 10:00 GMT

పెద్ద సినిమాలకు మాత్రమే ఎందుకీ నిర్లక్ష్యం..!

2026-11-05 09:58 GMT

విడుదలకు ముందే కేక పెట్టిస్తున్న కాకా..!

2026-11-05 08:06 GMT

నేచుర‌ల్ అందంతో జెన్ Zని క‌వ్విస్తున్న డెబ్యూ న‌టి

2026-11-05 08:06 GMT

అన్ని పుకార్ల‌కు చెక్.. 'దాదా' ఫిక్స‌యితే ద‌బిడి దిబిడే!

2026-11-05 07:53 GMT

ఇదేమి కన్ఫ్యూజన్ నాని.. అది ఇది కాదు.. అదే ఇది..!

2026-11-05 07:53 GMT

'రామాయణం' మూవీ రివ్యూ

2026-11-05 07:40 GMT

బాకీలు ఎగ్గొట్టిన మ్యూజిక్ డైరెక్టర్.. దేవుడికి కంప్లైంట్!

2026-11-05 07:36 GMT

మళ్లీ వోగ్ కవర్‌పై కత్రినా.. ఫ్యాన్స్‌కు స్పెషల్ ట్రీట్!

2026-11-05 07:35 GMT

ఈ దీపావళికి పెద్దగా సౌండ్ చేయలేకపోయిన టాలీవుడ్!

2026-11-05 07:27 GMT

Copyright @2026

Powered by Blink CMS