• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  'గేమ్‌ ఛేంజర్‌' మెలోడీ...

'గేమ్‌ ఛేంజర్‌' మెలోడీ అప్‌డేట్‌

| షూటింగ్‌ పూర్తి అయిన వెంటనే మూడో పాటను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడం ద్వారా మరింతగా పబ్లిసిటీ చేసే ఉద్దేశ్యంతో మేకర్స్ ఉన్నారట.

By - Tupaki Desk
Update: 2024-11-20 07:43 GMT

రామ్‌ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో దిల్‌ రాజు భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న గేమ్‌ ఛేంజర్ సినిమా షూటింగ్ కార్యక్రమాలు ముగింపు దశకు చేరుకున్నాయి. ఒకటి రెండు వారాల్లో సినిమాకు గుమ్మడి కాయ కొట్టబోతున్నారట. సినిమా ప్రమోషన్‌ కార్యక్రమాలు ఇప్పటికే షురూ అయ్యాయి. సినిమా నుంచి ఇప్పటికే వచ్చిన రెండు పాటలకు మంచి స్పందన వచ్చింది. సంక్రాంతి కానుకగా రాబోతున్న ఈ సినిమా నుంచి మూడో పాటను విడుదల చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. షూటింగ్‌ పూర్తి అయిన వెంటనే మూడో పాటను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడం ద్వారా మరింతగా పబ్లిసిటీ చేసే ఉద్దేశ్యంతో మేకర్స్ ఉన్నారట.

గేమ్‌ ఛేంజర్ సినిమాకు తమన్‌ సంగీతాన్ని అందిస్తున్న విషయం తెల్సిందే. సినిమా నుంచి ఇప్పటి వరకు వచ్చిన జరగండి, రా మచ్చా పాటలకు పూర్తి విభిన్నంగా మూడో పాట ఉంటుందని తెలుస్తోంది. ఈసారి రాబోతున్న పాట మెలోడీ బీట్స్‌లో ఉంటుందట. ఈ విషయాన్ని సంగీత దర్శకుడు తమన్‌ స్వయంగా ప్రకటించారు. మూడో పాటకు సంబంధించిన అప్‌డేట్‌ను అతి త్వరలోనే ఇవ్వబోతున్నట్లుగా ప్రకటించాడు. తప్పకుండా మూడో పాట ప్రతి ఒక్కరిని మెప్పించడంతో పాటు, సినిమా స్థాయిని అమాంతం పెంచే విధంగా ఉంటుంది అంటూ రామ్‌ చరణ్ ఫ్యాన్స్‌తో పాటు ప్రతి ఒక్కరు నమ్మకంగా ఉన్నారు.

హీరో, హీరోయిన్‌ మధ్య సాగే ఈ మెలోడీ డ్యూయెట్‌ సాంగ్‌కి సంబంధించిన రికార్డింగ్‌ పూర్తి అయిందని, ప్రస్తుతం తుది మెరుగులు దిద్దుతున్నట్లుగా తెలుస్తోంది. దర్శకుడు శంకర్‌ తన మార్క్‌లో ఈ పాటను చిత్రీకరించారు అంటూ వార్తలు వస్తున్నాయి. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం సినిమాలో ఈ పాట అత్యంత కీలకంగా ఉంటుందట. దర్శకుడు శంకర్‌ కాస్త ఎక్కువగానే ఖర్చు చేసి ఈ పాటను చిత్రీకరించారు అంటూ వార్తలు వస్తున్నాయి. గేమ్‌ ఛేంజర్‌ సినిమా అంచనాలు పెంచే విధంగా ఉండబోతున్న ఈ మెలోడీ సాంగ్‌ను ఇదే నెల చివరి వారంలో ప్రేక్షకలు ముందుకు తీసుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి.

రామ్‌ చరణ్ డ్యూయెల్‌ రోల్‌లో నటిస్తున్న ఈ సినిమాలో హీరోయిన్‌గా కియారా అద్వానీ నటిస్తోంది. అంజలి కీలక పాత్రలో కనిపించబోతుంది. శ్రీకాంత్‌తో పాటు పలువురు ప్రముఖ నటీనటులు కనిపించబోతున్నారు. సినిమాపై టీజర్‌ విడుదల తర్వాత అంచనాలు భారీగా పెరిగాయి. అంచనాలు ఏమాత్రం తగ్గకుండా ఉంటుంది అనే నమ్మకంను మేకర్స్ వ్యక్తం చేస్తున్నారు. సంక్రాంతికి పక్కా పండుగను రెట్టింపు చేసే విధంగా గేమ్‌ ఛేంజర్ సినిమా ఉంటుంది అంటున్నారు. అదే సంక్రాంతికి బాలకృష్ణ 'డాకూ మహారాజ్' సినిమాతో రాబోతున్నాడు. ఇక వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో రాబోతున్నారు. ఈ మూడు సినిమాల ఫలితాల విషయంలో అందరిలోనూ ఆసక్తి నెలకొంది.

It’s tat Melody Gonna Make Some Lovely Memories #GameChangerThirdSingle 🩷 🎈

Ready Guys 📢. 🎵

— thaman S (@MusicThaman) November 20, 2024
Tags:    
  • Tollywood 
  • Bollywood 
  • Kollywood 
  • Filmindustry 
  • Gamechanger 
  • Ramcharan 
  • Kiaraadvani 
  • Shankar 
  • SsThaman 
  • Dilraju 
  • Gamechangerthirdsong 

Similar News

డేంజర్ జోన్‌లో సీనియర్ హీరోయిన్ల‌ కెరీర్?

2026-11-11 13:30 GMT

స్టార్ డైరెక్ట‌ర్ ఇమేజ్ ని వాడుకోలేక‌పోతున్న ఫ్యామిలీ!

2026-11-11 12:30 GMT

అందానికి ప్రతిరూపాలు..అమ్మ ముద్రతో అలరిస్తున్న స్టార్ కిడ్స్!

2026-11-11 11:30 GMT

అజిత్, విజయ్‌లతో మణిరత్నం సినిమా ఎందుకు చేయలేదు?

2026-11-11 10:30 GMT

సిద్దూ పదో సినిమా.. సుకుమార్ టీమ్ నుంచి మరో దర్శకుడు!

2026-11-11 10:22 GMT

ఇంద్రగంటి రూట్ మారింది.. రోషన్‌తో సూపర్ హీరో

2026-11-11 10:21 GMT

నిహారికకు చుక్కలు చూపించిన టపాసులు.. రచ్చ రచ్చ చేసిన వీడియో!

2026-11-11 09:38 GMT

బాలయ్యా మజాకా.. తమన్ సంగీతానికి బాలయ్య గాత్రం!

2026-11-11 09:34 GMT

సాధారణంగా నెగిటివ్ కామెంట్స్ చేసే వర్మ.. రామాయణంపై ఇంత ప్రేమ ఎందుకు?

2026-11-11 07:31 GMT

పదేళ్ల ప్రేమాయణం తర్వాత సైలెంట్ గా ప్రియుడిని పెళ్లి చేసుకున్న ఇరుముడి హీరోయిన్!

2026-11-11 07:30 GMT

స్టార్ హీరో కోసం మండే సూర్యుడు!

2026-11-11 07:30 GMT

'విశ్వంభర'.. సైలెంట్‌గా పని కానిస్తున్నారే!

2026-11-11 07:29 GMT

Copyright @2026

Powered by Blink CMS