• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  చరణ్, కియారా పర్పుల్...

చరణ్, కియారా పర్పుల్ లవ్.. థర్డ్ సింగిల్ ఎప్పుడంటే?

| వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 10వ తేదీన సినిమా రిలీజ్ చేయనున్నట్లు ఇప్పటికే మేకర్స్ ప్రకటించారు.

By - Tupaki Desk
Update: 2024-11-24 07:12 GMT

టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్, కోలీవుడ్ ప్రముఖ దర్శకుడు శంకర్ కాంబోలో గేమ్ ఛేంజర్ మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే షూటింగ్ పూర్తవ్వగా.. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 10వ తేదీన సినిమా రిలీజ్ చేయనున్నట్లు ఇప్పటికే మేకర్స్ ప్రకటించారు.


ఆర్ఆర్ఆర్ తర్వాత చరణ్ సోలోగా యాక్ట్ చేస్తున్న సినిమా కావడంతో మెగా ఫ్యాన్స్ గేమ్ ఛేంజర్ కోసం ఎంతగానో వెయిట్ చేస్తున్నారు. చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ కియారా హీరోయిన్ గా నటిస్తున్నారు. తెలుగమ్మాయి అంజలి కీలక పాత్ర పోషిస్తున్నారు. శ్రీకాంత్, ఎస్ జే సూర్య, సునీల్, సముద్రఖని ముఖ్యమైన రోల్స్ లో కనిపించనున్నారు.

భారీ బడ్జెట్ తో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మిస్తున్నారు. అయితే ఆ మధ్య కాస్త సైలెంట్ గా ఉన్న గేమ్ ఛేంజర్ మేకర్స్.. ఇప్పుడు వరుస అప్డేట్స్ తో సందడి చేస్తున్నారు. ఇప్పటికే మూవీ నుంచి రెండు సాంగ్స్, టీజర్ రిలీజ్ చేశారు. ఆడియన్స్ లో మూవీపై మంచి అంచనాలు క్రియేట్ చేశారు. పాజిటివ్ బజ్ కూడా సృష్టించారు.

ఇప్పుడు ఎంతగానో ఎదురుచూస్తున్న గేమ్ ఛేంజర్ థర్డ్ సాంగ్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. మూడో పాటను నవంబర్ 28న రిలీజ్ చేయబోతున్నట్టు ఆదివారం ఉదయం ప్రకటించారు. అదే సమయంలో కొత్త పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. అందులో చరణ్, కియారా పర్పుల్ కలర్ ఔట్ ఫిట్స్ లో ఓ రేంజ్ లో కనిపిస్తున్నారు. అందరినీ ఎంతో ఆకట్టుకుంటున్నారు.

ప్రస్తుతం చరణ్, కియారా పోస్టర్ తెగ చక్కర్లు కొడుతోంది. పోస్టర్ చాలా కూల్ గా ఉందని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. బ్యాక్ గ్రౌండ్ అదిరిపోయిందని, టాలీవుడ్ సూపర్ హిట్ మెలోడీ సాంగ్ ఆన్ లోడింగ్ అంటూ సందడి చేస్తున్నారు. కచ్చితంగా సాంగ్ చార్ట్ బస్టర్ గా నిలుస్తుందని.. వెయిటింగ్ ఫర్ సాంగ్ అని చెబుతున్నారు.

అయితే ఆ సాంగ్ కు సంబంధించి ఇప్పటికే గేమ్ ఛేంజర్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ బజ్ క్రియేట్ చేశారు. లిరిసిస్ట్ రామ జోగయ్య శాస్త్రి హైప్ సృష్టించారు. తమన్ నుంచి వచ్చిన బెస్ట్ సాంగ్స్ లో ఒకటి అని తెలిపారు. దీంతో అంతా మంచి అంచనాలు పెట్టుకున్నారు. మరి గేమ్ ఛేంజర్ నుంచి రానున్న మెలోడీ సాంగ్ ఎలా మెప్పిస్తుందో చూడాలి.

#GameChanger third single out on November 28.#RamCharan #KiaraAdvani #Shankar #Tupaki pic.twitter.com/DtoYgHeoNU

— Tupaki (@tupaki_official) November 24, 2024
Tags:    
  • Tollywood 
  • Filmindustry 
  • Gamechanger 
  • Poster 
  • 3rdSongAnnouncement 
  • Ramcharan 
  • Kiaraadvani 
  • Shankar 
  • Thaman 
  • Dilraju 

Similar News

డేంజర్ జోన్‌లో సీనియర్ హీరోయిన్ల‌ కెరీర్?

2026-11-11 13:30 GMT

స్టార్ డైరెక్ట‌ర్ ఇమేజ్ ని వాడుకోలేక‌పోతున్న ఫ్యామిలీ!

2026-11-11 12:30 GMT

అందానికి ప్రతిరూపాలు..అమ్మ ముద్రతో అలరిస్తున్న స్టార్ కిడ్స్!

2026-11-11 11:30 GMT

అజిత్, విజయ్‌లతో మణిరత్నం సినిమా ఎందుకు చేయలేదు?

2026-11-11 10:30 GMT

సిద్దూ పదో సినిమా.. సుకుమార్ టీమ్ నుంచి మరో దర్శకుడు!

2026-11-11 10:22 GMT

ఇంద్రగంటి రూట్ మారింది.. రోషన్‌తో సూపర్ హీరో

2026-11-11 10:21 GMT

నిహారికకు చుక్కలు చూపించిన టపాసులు.. రచ్చ రచ్చ చేసిన వీడియో!

2026-11-11 09:38 GMT

బాలయ్యా మజాకా.. తమన్ సంగీతానికి బాలయ్య గాత్రం!

2026-11-11 09:34 GMT

సాధారణంగా నెగిటివ్ కామెంట్స్ చేసే వర్మ.. రామాయణంపై ఇంత ప్రేమ ఎందుకు?

2026-11-11 07:31 GMT

పదేళ్ల ప్రేమాయణం తర్వాత సైలెంట్ గా ప్రియుడిని పెళ్లి చేసుకున్న ఇరుముడి హీరోయిన్!

2026-11-11 07:30 GMT

స్టార్ హీరో కోసం మండే సూర్యుడు!

2026-11-11 07:30 GMT

'విశ్వంభర'.. సైలెంట్‌గా పని కానిస్తున్నారే!

2026-11-11 07:29 GMT

Copyright @2026

Powered by Blink CMS