బిగ్ బాస్ 9 లోకి లక్స్ పాప..?
తెలుగులో కొన్నాళ్లు సందడి చేసి అటు బాలీవుడ్ షిఫ్ట్ అయిన అమ్మడు అక్కడ సినిమాలతో పాటు వెబ్ సీరీస్ లు కూడా చేసింది.;
లక్స్ పాప లక్స్ పాప లంచుకొస్తావా అంటూ బాలయ్యతో ఆడి పాడిన బ్యూటీ ఆశా షైనీ గుర్తుంది కదా.. ఆ అమ్మడు ఇప్పుడు ఫ్లోరా షైనీ గా పేరు మార్చుకుంది. తెలుగులో కొన్నాళ్లు సందడి చేసి అటు బాలీవుడ్ షిఫ్ట్ అయిన అమ్మడు అక్కడ సినిమాలతో పాటు వెబ్ సీరీస్ లు కూడా చేసింది. కొన్ని అడల్ట్ సీరీస్ లతో కూడా అమ్మడు వార్తల్లో నిలిచింది. తెలుగులో ఒక మోస్తారు ఇమేజ్ తెచ్చుకున్న ఫ్లోరా షైనీ మళ్లీ తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈసారి స్మాల్ స్క్రీన్ పై ఒక క్రేజీ రియాలిటీ షోలో అమ్మడు వస్తుందట.
బిగ్ బాస్ సీజన్ 9 లో ఫ్లోరా షైనీ..
బిగ్ బాస్ సీజన్ 9 లో ఫ్లోరా షైనీ వస్తుందట. ఇప్పటికే ఆమె ఎంపిక కన్ఫర్మ్ అయినట్టు తెలుస్తుంది. సీజన్ 9 లో సెలబ్రిటీస్ తో పాటుగా కామన్ మ్యాన్ కూడా ఉంటారు. మునుపటి సీజన్లలో లా ఒకరు కాకుండా ఈసారి కామన్ మ్యాన్ కూడా 5 దాకా వస్తారని తెలుస్తుంది. బిగ్ బాస్ సీజన్ 9 లో ఫ్లోరా షైనీ ఎంట్రీ దాదాపు ఫిక్స్ అన్నట్టే చెబుతున్నారు. అందుకోసం ఆమెకు భారీ రెమ్యునరేషన్ అందిస్తున్నారట.
తెలుగు ఆడియన్స్ దాదాపు ఆమెను మర్చిపోయారు. ఎప్పుడో 10, 15 ఏళ్ల క్రితమే ఆమె తెలుగు సినిమాలు ఆపేసింది. ఫ్లోరా షైనా రాకతో బిగ్ బాస్ 9 రసవత్తరంగా మారుతుందని చెప్పొచ్చు. ఈ సీజన్ అసలే రణరంగం అంటూ హోస్ట్ నాగార్జున ముందే చెప్పేస్తున్నారు. షో కాన్సెప్ట్ అంతా కూడా కొత్తగా ఉంటుందట.
బిగ్ బాస్ అగ్నిపరీక్షలో కామన్ మ్యాన్..
బిగ్ బాస్ కామన్ మ్యాన్ సెలక్షన్ ప్రాసెస్ లో భాగంగా బిగ్ బాస్ అగ్నిపరీక్ష అంటూ ఒక షో మొదలైంది. ఆగష్టు 22 నుంచి సెప్టెంబర్ 5 వరకు అది జియో హాట్ స్టార్ లో వస్తుంది. అందులో పాల్గొన్న 15 మంది కామన్ మ్యాన్ నుంచి ఐదుగురు హౌస్ లోకి సీజన్ 9 కంటెస్టెంట్స్ గా వస్తారు. మరి వీరిలో ఎవరు ఆ ఛాన్స్ అందుకుంటారు అన్నది తెలియాల్సి ఉంది.
బిగ్ బాస్ సీజన్ 9 షోకి ముందే బిగ్ బాస్ అగ్నిపరీక్ష ఆడియన్స్ ని ఎంగేజ్ చేస్తుంది. తప్పకుండా సీజన్ 9 కి జరిగిన 8 సీజన్ల కన్నా ఎక్కువ రేటింగ్ తీసుకొచ్చేలా బిగ్ బాస్ టీం ప్రయత్నాలు చేస్తుంది. సెప్టెంబర్ 6 నుంచి బిగ్ బాస్ సీజన్ 9 మొదలవుతుందని తెలుస్తుంది.