ఆ స్టార్ తో రాజమౌళి సినిమా కోసం ఫ్యాన్స్ అంతా వెయిటింగ్..!

అయితే మహేష్ తర్వాత మళ్లీ ఎన్.టి.ఆర్ తో జక్కన్న సినిమా ఉంటుందని ప్లాన్.

Update: 2024-04-30 14:50 GMT

పాన్ ఇండియా లెవెల్ లో కాదు ప్రస్తుతం రాజమౌళి పేరు ఇంటర్నేషనల్ లెవెల్ లో వినిపిస్తుంది. బాహుబలి సినిమాతో పాన్ ఇండియా హిట్ కొట్టిన రాజమౌళి RRR తో హాలీవుడ్ స్టార్ డైరెక్టర్స్ ని సైతం మెప్పించేలా చేశాడు. ఆర్.ఆర్.ఆర్ తర్వాత మహేష్ తో తన నెక్స్ట్ సినిమా ఫిక్స్ చేసుకున్నాడు రాజమౌళి. ఆ సినిమా హాలీవుడ్ రేంజ్ కి ఏమాత్రం తగ్గకుండా తెరకెక్కించే ప్లానింగ్ లో ఉన్నారు. అయితే మహేష్ తర్వాత మళ్లీ ఎన్.టి.ఆర్ తో జక్కన్న సినిమా ఉంటుందని ప్లాన్.


మరోపక్క రాజమౌళి సినిమాతో కాకుండా తన సొంత టాలెంట్ తో పాన్ ఇండియా క్రేజ్ తెచ్చుకున్నాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. ఈ ఇద్దరి కాంబినేషన్ లో సినిమా పడితే చూడాలని కోరుతున్నారు అల్లు ఫ్యాన్స్. మన స్టార్స్ లో చాలా కమిటెడ్ గా ఉన్న స్టార్ గా అల్లు అర్జున్ కెరీర్ ఎలా మొదలు పెట్టాడు ఇప్పుడు స్థాయికి చేరుకున్నాడు అన్నది చూస్తే అతని కష్టం ఏంటో తెలుస్తుంది. నిర్మాత తనయుడిగా ఏదో సినిమాలు చేశామంటే చేశామన్నట్టు కాకుండా సినిమా సినిమాకు తన రేంజ్ పెంచుకుంటూ వచ్చాడు అల్లు అర్జున్.

Read more!

పుష్ప రాజ్ పాత్రతో పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకులను ఫిదా అయ్యేలా చేశాడు. అల్లు అర్జున్ తో రాజమౌళి సినిమా చేస్తే చూడాలని ఫ్యాన్స్ కోరుతున్నారు. రాజమౌళి అల్లు అర్జున్ కలిసి చేసే సినిమా నెవర్ బిఫోర్ అనిపించేలా ఉంటుందని చెప్పొచ్చు. పుష్ప లో బన్నీ యాక్టింగ్ చూసి ఫిదా అయిన జక్కన్న తన హీరోల లిస్ట్ లో అల్లు అర్జున్ ని చేర్చుకున్నాడు. సరైన కథ కుదిరితే బన్నీతో రాజమౌళి సినిమా ఫిక్స్ అయినట్టే లెక్క.

మహేష్ తో సినిమా రెండేళ్లలో పూర్తి చేయాలని చూస్తున్న రాజమౌళి ఆ సినిమాను కూడా రెండు భాగాలుగా చేస్తాడని టాక్ వినిపిస్తుంది. మహేష్ తర్వాత తారక్ తో సినిమా అంటున్నారు కానీ ఈలోగా అల్లు అర్జున్ కి సూట్ అయ్యే కథ వస్తే మాత్రం రాజమౌళి అల్లు అర్జున్ కాంబో ఫిక్స్ అయినట్టే అని చెప్పొచ్చు. పుష్ప 2 తో త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న అల్లు అర్జున్ ఆ తర్వాత త్రివిక్రం, అట్లీ, సందీప్ వంగ లతో వరుస క్రేజీ సినిమాలు ప్లాన్ చేస్తున్నాడు.

Tags:    

Similar News