• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  2024 లోక్‌సభ ఎన్నికల్లో...

2024 లోక్‌సభ ఎన్నికల్లో ఫ్యామిలీమ్యాన్?

| ఫ్యామిలీమ్యాన్ వెబ్ సిరీస్‌తో పాన్ వ‌ర‌ల్డ్ లో పాపుల‌రైన జాతీయ ఉత్త‌మ న‌టుడు మ‌నోజ్ భాజ్ పాయ్ రాజ‌కీయాల్లో ప్ర‌వేశిస్తున్నార‌నేది సంచ‌ల‌న వార్త‌.

By - Tupaki Desk
Update: 2024-01-06 03:39 GMT

ఫ్యామిలీమ్యాన్ వెబ్ సిరీస్‌తో పాన్ వ‌ర‌ల్డ్ లో పాపుల‌రైన జాతీయ ఉత్త‌మ న‌టుడు మ‌నోజ్ భాజ్ పాయ్ రాజ‌కీయాల్లో ప్ర‌వేశిస్తున్నార‌నేది సంచ‌ల‌న వార్త‌. ఆర్జీవీ `స‌త్య` చిత్రంతో ఉత్త‌మ న‌టుడిగా జాతీయ అవార్డ్ అందుకున్న మనోజ్ భాజ్ పాయ్ త‌న కెరీర్ లో ఎన్నో విలక్ష‌ణ పాత్ర‌ల‌కు ప్రాణ ప్ర‌తిష్ఠ చేసారు. ఇప్పుడు అత‌డు రాజ‌కీయారంగేట్రం చేస్తున్నార‌న‌గానే అభిమానుల్లో ఒక‌టే ఉత్కంఠ నెల‌కొంది.

మనోజ్ బీహార్‌లోని పశ్చిమ చంపారన్ జిల్లా నుంచి లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉందని ఒక పాపుల‌ర్ న్యూస్ పోర్టల్ వెల్ల‌డించింది. ఈ పోస్ట్ కొద్ది సేపటికే వైరల్‌గా మారి మనోజ్ దృష్టిని ఆకర్షించింది. తాను రాజకీయాల్లో చేరి 2024 లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తానని వస్తున్న వార్తలపై నటుడు మనోజ్ బాజ్‌పేయి మౌనం వీడారు. ``అచ్చా యే బతైయే యే బాత్ కిస్నే బోలా యా కల్ రాత్ సప్నా ఆయా? బొలియే బోలియే!`` అని రాసాడు. ఇది మీకు ఎవరు చెప్పారు? లేదా నిన్న రాత్రి మీకు కల వచ్చిందా? నాకు చెప్పండి! అని కొంత సీరియస్ టోన్ తో ఎదురు ప్ర‌శ్నించాడు. దీంతో అతడు రాజ‌కీయారంగేట్రం చేయ‌డం లేద‌ని క్లారిటీ వ‌చ్చింది.

6 ప్యాక్ యాబ్స్ తో షాక్‌లు:

మనోజ్ బాజ్‌పేయి కేవ‌లం త‌న ఎంపిక‌ల‌తోనే కాదు.. చాలా విష‌యాల్లో త‌న‌లోని వైవిధ్యాన్ని ప్ర‌ద‌ర్శిస్తుంటారు. కొత్త సంవ‌త్స‌రంలో అతడు ఇచ్చిన ట్రీట్ మామూలుగా లేదు. జ‌న‌వ‌రి 1న‌ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో చొక్కా లేని ఫోటోను పోస్ట్ చేసి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశాడు. ఈ ఫోటోలో మ‌నోజ్ తన అబ్స్‌ను ప్రదర్శిస్తూ కనిపించాడు. దానికి క్యాప్షన్ ఇస్తూ, ``న్యూ ఇయర్ న్యూ మి! దేఖో రుచికరమైన సూప్ కా మేరీ బాడీ పే అసర్. ఏక్దమ్ కిల్లర్ లుక్ హైనా? (చూడండి, రుచికరమైన సూప్ నా శరీరాన్ని ఎలా ప్రభావితం చేసిందో, పూర్తిగా కిల్లర్ లుక్, కాదా?)``అని అన్నాడు. నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల కానున్న తన తదుపరి ప్రాజెక్ట్ `కిల్లర్ సూప్` గురించి ప్రస్తావించాడు. ఫోటోలో మనోజ్ రూపం ఉలి వేసి చెక్కిన‌ట్టుగా మారింది. సిక్స్ ప్యాక్ అబ్స్‌తో షాక్ లు ఇచ్చాడు. చాలా మంది ప్రముఖులు కామెంట్ సెక్షన్‌లో అతడి బాడీ అద్భుత‌ పరివర్తనను ప్రశంసించారు. అనురాగ్ కశ్యప్ `చుప్పే రుస్తోమ్` అని రాసాడు. సునీల్ గ్రోవర్ ప్రశంసిస్తూ, `ఆగ్ లగా ది ఆనే ఇంటర్నెట్ పే` అని రాశాడు. అతని ఫ్యామిలీ మ్యాన్ సహనటుడు సన్నీ హిందూజా, `వాహ్... ముఝే నహీ పతా థా ఆప్ మే భీ ఐబ్ హై సర్` అని రాశారు.

ఫ్యామిలీమ్యాన్ 3 కోసం రెడీ:

కొన్నాళ్ల క్రితం మనోజ్ బాజ్‌పేయ్ ది ఫ్యామిలీ మ్యాన్ మూడవ సీజన్ గురించి ఓపెన‌య్యారు. ఈ ఏడాది విడుదల కానున్న తదుపరి భాగం కోసం అభిమానులు ఉత్సాహంగా ఉన్నారు. అతడు తన పాత్ర, శ్రీకాంత్ తివారీ గురించి వివరాలను వెల్లడించాడు. షూటింగ్ గురించి తెలిపారు. 2024 ఫిబ్రవరి చివరిలో షూటింగ్ ప్రారంభిస్తామని తెలిపారు. ఈసారి మేము ఎక్కువగా ఈశాన్య ప్రాంతంలో షూటింగ్ చేస్తాము. గత సీజన్‌లో ఎక్కడి నుంచి వెళ్లిపోతామో అక్కడి నుంచి మొద‌ల‌వుతుంది.. మునుపటి సీజన్ కంటే ఈసారి ఫ్యామిలీ మ్యాన్ పెద్దదిగా ఉంటుందని నేను హామీ ఇస్తున్నాను. బడా సుందర్ ఔర్ భయానక్ హోగా. కొత్త పరిస్థితులు, కొత్త క్లిష్ఠ‌త‌లు ఉంటాయి. ఈసారి శ్రీకాంత్ తివారీ తన జీవితంలో ఆ దశలో ఉన్నాడు. అక్కడ అతడి పిల్లలు పెరిగారు. శ్రీకాంత్ కూడా కొంచెం వృద్ధాప్యంలో ఉన్నారు.. కానీ సవాళ్లు అతనిని విడిచిపెట్టవు.. అని తెలిపారు.

Tags:    
  • Manojbhajpai 
  • Loksabha 
  • Famillyman 
  • Satya 
  • Bollywood 
  • Srikanthtiwari 
  • ` 

Similar News

స్నేహితుల రియల్ లైఫ్ డ్రామానే సినిమా!

2026-11-05 10:08 GMT

'జైల‌ర్ 3'పై ఊహించని అప్‌డేట్‌.. ఆ ఏడాదే సెట్స్‌పైకి?

2026-11-05 10:01 GMT

దిగ్గజాల సమ్మేళనం: 1986 నాటి అన్న‌గారు ఎన్టీఆర్ విందులో చిరంజీవి!

2026-11-05 10:00 GMT

పెద్ద సినిమాలకు మాత్రమే ఎందుకీ నిర్లక్ష్యం..!

2026-11-05 09:58 GMT

విడుదలకు ముందే కేక పెట్టిస్తున్న కాకా..!

2026-11-05 08:06 GMT

నేచుర‌ల్ అందంతో జెన్ Zని క‌వ్విస్తున్న డెబ్యూ న‌టి

2026-11-05 08:06 GMT

అన్ని పుకార్ల‌కు చెక్.. 'దాదా' ఫిక్స‌యితే ద‌బిడి దిబిడే!

2026-11-05 07:53 GMT

ఇదేమి కన్ఫ్యూజన్ నాని.. అది ఇది కాదు.. అదే ఇది..!

2026-11-05 07:53 GMT

'రామాయణం' మూవీ రివ్యూ

2026-11-05 07:40 GMT

బాకీలు ఎగ్గొట్టిన మ్యూజిక్ డైరెక్టర్.. దేవుడికి కంప్లైంట్!

2026-11-05 07:36 GMT

మళ్లీ వోగ్ కవర్‌పై కత్రినా.. ఫ్యాన్స్‌కు స్పెషల్ ట్రీట్!

2026-11-05 07:35 GMT

ఈ దీపావళికి పెద్దగా సౌండ్ చేయలేకపోయిన టాలీవుడ్!

2026-11-05 07:27 GMT

Copyright @2026

Powered by Blink CMS